రివ్యూ

గందరగోళమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ *
తారాగణం:
నవీన్‌చంద్ర, నివేతాథామస్, అలీ, అభిమన్యుసింగ్, అనంత్, జీవా, ఈస్తర్ అనిల్, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం: రాధేస్ వేగా
నిర్మాతలు: కొత్తపల్లి ఆర్. రఘుబాబు కె.బి.చౌదరి
దర్శకత్వం: అజయ్ ఒద్దిరాల

** ** ** **********

జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్- పేరు వినగానే ఆసక్తి కలిగించేదిగా ఉన్నా, ఆ స్థాయి ఉత్సాహాన్ని చిత్రం చూస్తున్నప్పుడు నింపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దానికి ప్రధాన కారణం రెండు గంటల పది నిమిషాల చిత్రంలో రకరకాల షేడ్స్ పెట్టేయాలన్న తపన, చిత్రకథను ఎక్కడా కలపకపోవడం. దీనివల్ల చిత్ర బృందం పండించాలనుకున్న ఏ రసమూ ప్రేక్షకుడికి అందలేదు. వివరాల్లోకి వెళితే...
హోటల్ వాలెట్‌లో పెట్టే కార్లకు డ్రైవర్‌గా పనిచేసే వర (నవీన్ చంద్ర), జూలీని ప్రేమిస్తాడు. కానీ జూలీ తల్లిదండ్రులు నువ్వు మా అమ్మాయికి తగిన వాడవుకాదు, మా అమ్మాయిని వదిలేయడానికి నీకు ఎంత అవసరం? అన్న ప్రశ్నకు సమాధానంగా పది లక్షల రూపాయలిస్తే ప్రేమను మర్చిపోతాను అని చెబుతాడు. ఈలోగా ఆ ఊళ్లో ఉండే మాఫియా డాన్ ఖాన్ (అభిమన్యుసింగ్)కి అవసరమైన ల్యాప్‌ట్యాప్స్ సూట్‌కేసు వర డ్రాప్ చేసే కారులో కస్టమర్ మర్చిపోతే దొరకడం వల్ల, దాని కోసం ఖాన్ బృందం ఇతని వెంటపడతాడు. అలాగే పోలీసులూ. మరి ఇలాంటి క్రైమ్ ఎలిమెంట్ నుంచి బయటపడి జూలీని ఎలా తిరిగి పొందాడో అన్నవాటికి సమాధానంగా జూలియట్ ఇడియట్‌ల లవ్‌స్టోరీ ముగుస్తుంది. కథని స్థూలంగా పరిశీలించడంతోనే ఇందులో అటు క్రైమ్, ఇట్ లవ్ (దీనికి తోడు మదర్ సెంటిమెంట్) సమాంతరంగా ప్రయాణం చేశాయి అని తెలుస్తోంది కదా! కానీ ఆ ప్రయాణాన్ని సాఫీగా చూపడంలో నూతన దర్శకుడు అజయ్ పడిన తడబాటు వల్ల అవి గమ్యాన్ని చేరుకోలేకపోయాయి. ఇంకా వివరాల్లోకి వెళితే.. చూపిన అంశాల్లో చాలావాటికీ క్లారిటీ లోపించడం అన్న విషయం పక్కకు పెట్టి వాటిపై ప్రాథమిక అవగాహన కూడా దర్శకుడికి లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. సాధారణంగా వాలెట్ (వాహనాలు నిలపడానికి వ్యాపార సంస్థలు చూపించే ప్రదేశం)లో కార్లు పెట్టి, తిరిగి వాటిని యజమాని అడగ్గానే ఇవ్వడమే దానికై నియమించిన డ్రైవర్ పని. కానీ ఇందులోలా వాలెట్‌లో పెట్టిన కార్లతో సదరు డ్రైవర్ నగరంలో చక్కర్లు కొట్టడం ఎక్కడా జరగదు. ఒకవేళ అలా జరిగేటట్లయితే కార్లు పార్క్ చేయడానికి ఎవరూ ఒప్పుకోరు. అలాగే టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన దరిమిలా పోలీసు పరిశోధన కూడా మునపటి కంటే సులభమై నేరస్థుల్ని ఇట్టే పట్టేసేలా చేస్తోంది. అది విస్మరించి, సెల్‌ఫోన్‌తో నిందితుడు చేసిన ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతన్ని అనే్వషించే విషయాన్ని వదిలి, దానికేదో పెద్ద ఇన్విస్టిగేషన్ అంటూ రీళ్లు చుట్టేయడం హాస్యాస్పదం. కానీ, అదే ఫోను సిగ్నల్స్‌తో పట్టేశాం అని వేరే సన్నివేశంలో చూపడం మరీ విచిత్రం. అంటే దీనివల్ల తెలుస్తున్నది ఏమిటంటే స్క్రిప్టునీ, సీన్స్‌నీ ఒక పద్ధతి ప్రకారం తీసినట్లు అనిపించింది తప్ప, కంట్రోల్‌తో కథ నడిపినట్లు అనిపించలేదు. అదే రకంగా అవసరాలకి అప్పులిచ్చాక వారిని, చాలా చీప్‌గా చూపడం ఇందులో మాదిరి ఎక్కడా వుండదు. ఇదంతా కామెడీ అని సినిమా యూనిట్ భావించిందేమోగానీ, ఆ బాపతు అనుభూతి ప్రేక్షకులకు కలగలేదు. పాత్రదారుల నటనా శైలి విషయానికి వస్తే అందరికంటే జూలీ పాత్రధారిణి నివేతాథామస్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసింది. వాస్తవానికి తెలుగులో నివేతాకి ఇది తొలి చిత్రమైనా, ఈ సినిమాకన్నా ముందే ఆమె నటించిన జెంటిల్‌మెన్, నిన్నుకోరి విడుదలయ్యాయి. ఎటొచ్చీ వర పాత్రధారి నవీన్ చంద్రే ఆమెకు సరిగ్గా కుదరలేదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. అయితే విడిగా చూస్తే నవీన్ నటన ఓకే. చాలా కాలానికి అనుకుంటా.. అలీకి ఇందులో పూర్తి స్థాయి నిడివిలో గన్ లాడెన్ (బిన్ లాడెన్‌కి పేరడీ) పాత్ర లభించింది. దాన్ని ఆయన తనదైన శైలిలో నటించి మెప్పించాడు. మిగతా పాత్రల్లో ఖాన్‌గా అభిమన్యుసింగ్ అలవాటైన కామెడీ టచ్‌తో నటించాడు. ‘వీడ్ని తప్పించుకోవడం అంటే సునామీలో స్విమ్మింగ్ చేసినట్లే..’ వంటి చోట్ల సంభాషణలు బాగా పేలాయి. అసలు పేరుకు తగ్గట్లు ప్రేమ నేపథ్యమే ప్రధానంగా సినిమా నడిపించి వుంటే చిత్రం ఇంత గందరగోళంలో పడి ఉండేది కాదేమో!

-అనే్వషి 7981327110