రివ్యూ

ఫీల్‌గుడ్ ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హలో! *** బాగుంది
తారాగణం:
అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జగపతిబాబు, రమ్యకృష్ణ, అనీష్ కురువిల్లా, సత్యకృష్ణ, అజయ్, కృష్ణుడు తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్

** ** ** *** ******************

తొలిచిత్రం ‘అఖిల్’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన సిన అఖిల్‌కు ఆ చిత్రం అనుకున్నంత పేరును తెచ్చిపెట్టలేక పోయంది. అఖిల్‌అక్కినేని మూడోతరం వారసుడిగా పరిచయమైన హీరోల్లో అఖిల్ ఒకరు. విజయం అనేది అతడి కెరీర్‌కు చాలా కీలకమైన సమయంలో వచ్చిన రెండో చిత్రం ‘హలో!’. తొలి చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో.. రెండో చిత్రంతో ఎలాగైనా సక్సెస్‌ని కొట్టాలన్న తపనతో మంచి కథ కోసం దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్‌లో ఎంపిక చేసుకున్న చిత్రమే ‘హలో!’. ‘మనం’ చిత్రం ద్వారా అక్కినేని ఫ్యామిలీకి మరచిపోలేని అనుభూతిని మిగిల్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా విషయంలో తొలి నుంచి నాగార్జున తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. దాంతో ఈ అంచనాలు మరీ పెరిగిపోయాయి. అఖిల్ వయసుకు, అతడి ఇమేజ్‌కు తగ్గ కథా కథనాలతో ఈ చిత్రం తెరకెక్కింది. కసితో విజయం సాధించాలన్న పట్టుదలకు తోడు తమకు కలిసొచ్చే డిసెంబర్ సెంటిమెంట్‌ను కూడా పక్కాగా ఫాలో అయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి ఈ నెలలోనే మంచి రికార్డ్స్ ఉన్నాయి. అందుకే నాగార్జున ఈ చిత్రం విడుదల సమయాన్ని ఎంతో ముందుగానే ప్రకటించేశాడు. మరి అక్కినేని ఫ్యామిలీకి మరోసారి ఈ ప్లాన్ వర్కవుట్ అయింది? ‘హలో..’అంటూ పలకరించిన అఖిల్ విజయాన్ని అందుకున్నాడా? దర్శకుడు విక్రమ్ కె.కుమార్, నిర్మాత నాగార్జున అక్కినేని అంచనాలకు తగ్గట్టుగానే ఈ ‘హలో!’ ఉందా? చూద్దాం..
శీను (అఖిల్)కు జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి ప్రియదర్శన్) అనే అమ్మాయి చిన్నతనంలోనే పరిచయమవుతుంది. జున్ను ఓ పెద్దింటి అమ్మాయి. శీను ఓ అనాథ. ఇద్దరూ ఒకరంటే ఒకరిపై అభిమానాన్ని పెంచుకుంటారు. అతడి సంగీతం అంటే జున్నుకి చాలా ఇష్టం. శీను ప్లే చేసే మ్యూజిక్‌ను జున్ను బాగా ఇష్టపడుతుంది. నా అన్న వారు ఎవరూలేని శీను సిగ్నల్ దగ్గర ఏక్‌తారా వాయిస్తూ అడుక్కుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుండగా అనుకోకుండా జున్ను వాళ్ల నాన్నకు ఢిల్లీకి బదిలీ అయి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా వెళ్లిపోతున్న సమయంలో సిగ్నల్ దగ్గర శీనును చూసి వంద రూపాయల నోట్‌పై సెల్ నెంబర్ రాసి కారులోంచి బయటికి విసిరి ఫోన్ చేయమంటుంది జున్ను. కానీ ఆసమయంలోనే ఆ వందనోటును మరొకడు ఎత్తుకొని పారిపోతాడు. అతడిని వెంబడించే సమయంలో శీనుకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన కారును నడుపుతున్నది సరోజిని (రమ్యకృష్ణ). శీనును ఆసుపత్రిలో చేర్పించి తన భర్త ప్రకాష్ (జగపతిబాబు)కు అసలు విషయం చెప్పి సరైన వైద్యాన్ని అందించి అతడిని మళ్లీ మామూలు మనిషిని చేస్తుంది. అప్పుడే అనాథ అయిన శీనును దత్తత తీసుకొని అవినాష్‌గా పేరు మార్చి పెంచుకుంటుంటారు. కానీ శీను, జున్నును మాత్రం మరచిపోలేకపోతుంటాడు. జున్ను ఇచ్చిన సెల్ నెంబర్ పోగొట్టుకున్న శీను రోజూ సిగ్నల్ వద్దకే వస్తుంటాడు. ఎన్నటికైనా జున్ను తిరిగొస్తుందన్న ఆశ అతడిలో వుంటుంది. ఆ ఆశతోనే ఏళ్లు గడిచిపోతాయి. శీను పెద్దవాడవుతాడు. మరి ఇంతకీ శీను జున్నును కలుసుకున్నాడా? ఆమెను కలిసే క్రమంలో అతడు ఎదుర్కొన్న సంఘటనలేమటి? సాహసాలేమిటి? అన్నదే సినిమా.
కథ కొత్తేదేం కాదు. చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక మళ్లీ కలుసుకోవడమనేది మనం చాలా సినిమాల్లో చూసేశాం. అఖిల్‌ని రీలాంచ్ చేసే కీలక సమయంలో నాగార్జున ఇలాంటి తరహా కథను ఎంచుకోవడం సాహసమే! ఆ సాహసం దర్శకుడు విక్రమ్ మీద వున్న నమ్మకం కావొచ్చు. ఫస్ట్ఫాలో చిన్నప్పటి ఎపిసోడ్‌ను విభిన్నంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. విడిపోయిన శీను, జున్నులు ఒక ఫోన్‌కాల్ దూరంలో ఉన్నారని తెలిసేలోపే కథలో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. దర్శకుడి టేకింగ్, అతడి మార్క్ కథనంపై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం మరింత పెంచేలా చేసింది. శీను అవినాష్‌గా మారే క్రమం,, ఆ సమయంలో రమ్యకృష్ణ, జగపతిబాబుల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చూస్తుండగానే ఫస్ట్ఫా ముగిసిపోతుంది. అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అవినాష్, ప్రియలుగా మారిన శీను, జున్నులు కలుసుకుని దగ్గరయ్యే వైనం.. ఆ తర్వాత వారిద్దరూ తాము చిన్నప్పటి స్నేహితులం అని తెలుసుకోవడం తదితర సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ప్రతీ సన్నివేశాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. ముఖ్యంగా భావోద్వేగాలే ప్రధాన బలంగా ఉన్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి. ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులకు అఖిల్‌ను దగ్గర చేశాడు దర్శకుడు. అదే స్థాయిలో హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో యువతను ఆకట్టుకునే చేసిన ప్రయత్నం బావుంది. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా తీర్చిదిద్దాడు. సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ ఫస్ట్ఫా. చిత్రాన్ని మొదలు పెట్టటడమే ఆహ్లాదకరంగా ప్రారంభించిన దర్శకుడు విశ్రాంతి వరకు అలాగే కొనసాగించాడు. కథానాయకుడు అఖిల్ క్యారెక్టర్‌ని హల్‌చల్ చేయకుండా కూల్‌గా నడిపిస్తూ అతడి చుట్టూ చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సృష్టించాడు. జగపతిబాబు, రమ్యకృష్ణల మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయ. చిన్ననాటి కథను కూడా అందంగా చూపించిన దర్శకుడు అందులోని భావోద్వేగాల్ని చాలా సేపూ అలానే కొనసాగించాడు. కథ ముఖ్య ఉద్దేశ్యం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ.. అది గెలవడం. అలా అయినప్పుడు మరి వారిద్దరి మధ్య దాని తీవ్రత, దాన్ని పొందడానికి వాళ్లు పడే తపన ప్రధానంగా చూపాలి. ప్రేమను మిస్సయ్యాం. దాన్ని పొందాలి అనే భావం హీరో హీరోయిన్ల మాటల్లోనే కపిస్తుంది. అయితే దాని కోసం వాళ్లు పతాక సన్నివేశంలో తప్ప మరెక్కడా పెద్దగా ప్రయత్నించలేదు. ఈ విషయంలో దర్శకుడు మరింత ఎమోషనల్ డ్రామాను సృష్టిస్తే బావుండేదేమో! హీరోయిన్ ఆచూకీ సరిగ్గా తెలిసే సమయంలో హీరో ఫోన్ చేయడం, దాని కోసం అతను దేనినీ లెక్క చేయకుండా ప్రాణాన్ని రిస్క్ చేయడం చూసే ప్రేక్షకులకు థ్రిల్‌గా అనిపించాయ. అయతే ఒక్క ఫోన్ నెంబర్‌ని ట్రెస్ చేయలేక ఇబ్బంది పడే హీరో విషయం మాత్రం అంత తేలిగ్గా మింగుడుపడదు.
నటీనటుల విషయానికొస్తే.. అఖిల్ అన్ని విభాగాలను ఆటాడేసుకున్నాడు. తొలి సినిమాతో పోలిస్తే అతడు మైరుగైన నటను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్ అయితే చాలా కొత్తగా వున్నాయి. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా స్క్రీన్‌ప్లే బేస్‌తో సాగిపోయే ఫస్ట్ఫాలో అఖిల్ మంచి మార్కుల్నే కొట్టేశాడు. ఎక్కడా హీరోలా కాకుండా కథకి నాయకుడిలా మాత్రమే కనిపించడం మెచ్చుకోతగ్గ అంశం. వన్‌మ్యాన్‌షో లా చిత్రాన్ని మొత్తం ఆటాడేసుకున్నాడు. డాన్సుల్లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్ చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. ఈమె పాత్రకు ఫస్ట్ఫాలో ఏ మాత్రం ప్రాధాన్యం లేకపోయినా సెకండాఫ్‌లో చక్కటి భావోద్వేగాలు పలికించింది. జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్, కృష్ణుడు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా చూస్తే అనూప్ సంగీతం మెప్పిస్తుంది. పాటలు బావున్నాయి. వయొలెన్ మీద సిగ్నేచర్ ట్యూన్ హమ్మింగ్ చేసేలా వుంది. విన్న ప్రతీసారి మరోసారి వినాన్నట్టు ఉంది. సన్నివేశాలకు తగ్గట్టుగా అనూప్ చేసిన రీ రికార్డింగ్ ఓకే. ముఖ్యంగా పి.ఎస్ వినోద్ కెమెరా పనితనం చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ప్రతీ ఫ్రేమ్‌ని ఎంతో అందంగా చూపించింది. ఎక్కడా కెమెరా పనిని తప్పుపట్టలేం. బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రఫీ అదిరిపోయింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. అఖిల్‌ని ఎలాగైనా నిలబెట్టేందుకు నిర్మాతగా నాగార్జున అక్కినేని ఏ మాత్రం వెనుకాడలేదు. నిర్మాణ విలువలు భారీ స్థాయిలో వున్నాయి. ఈ విషయంలో నాగ్ తన మార్క్‌ని ప్రదర్శించి ఉన్నత ప్రమాణాలతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఇన్ని విభాగాలు బావున్న ఈ చిత్రానికి ఎమోషనల్ సీన్స్, అఖిల్, కళ్యాణిల నటన, యాక్షన్ సీన్స్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయ. చిత్రంలో అక్కడక్కడా నెమ్మదించిన కథనం, రొటీన్ కథే కావడం, సెల్ కొట్టేసి పారిపోతున్న వ్యక్తిని వెంబడించే సమయంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌కు అనవసరమైన లింక్‌ని కూడా జతచేయడం కొద్దిగా స్క్రీన్‌ప్లే లోపంగా కనిపించింది. మొత్తం మీద ‘హలో!’ ఓ ఫీల్ గుడ్ ప్రేమకథే. యువతను బాగా ఆకట్టుకుంటుంది.

-రతన్