రివ్యూ

ఫ్యామిలీ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంసిఏ ** ఫర్వాలేదు
తారాగణం:
నాని, సాయిపల్లవి, భూమిక, రాజీవ్ కనకాల, పోసాని,సీనియర్ నరేష్, ఆమని, విజయ్,
ప్రియదర్శి, వెనె్నల కిషోర్ తదితరులు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: సమీర్‌రెడ్డి
నిర్మాతలు: ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ వేణు

** ** ** *** ***

వరుస విజయాలతో యమజోష్ మీదున్నాడు యువ హీరో నాని. నిర్మాతగా ఈ ఏడాదిలో ఐదు విజయవంతమైన చిత్రాలు నిర్మించి డబుల్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు ‘దిల్’ రాజు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తికలగడం సహజం. అంతేకాదు, ఈ ఏడాది ‘దిల్’రాజు సాధించిన ఐదు విజయవంతమైన చిత్రాల్లో నాని నటించిన ‘నేను లోకల్’ కూడా ఒకటి కావడం విశేషం. సగటు ప్రేక్షకుడిని అన్ని రకాలుగా ఆకట్టుకోగలిగే సత్తా ఉన్న కథానాయకుడు నాని. అతడి సినిమా అంటే వినోదం ఖాయం అనే నమ్మకం కలుగుతుంది. సినిమా సినిమాకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనపై ఉన్న నమ్మకాన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. దానికి తగ్గట్టే అతడికి విజయాలూ దక్కుతున్నాయి. ‘ఓ మైఫ్రెండ్’ సినిమాతో పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు చాలా గ్యాప్ తర్వాత తెరకెక్కించిన చిత్రమే ఈ ఎంసిఏ (మిడిల్‌క్లాస్ అబ్బాయ్). ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయ. మరి నాని, ‘దిల్’రాజులు ఈ చిత్రం ద్వారా తమ విజయపరంపరను కొనసాగించారా? అంచనాలను ‘ఎంసిఏ’ అందుకుందా? దర్శకుడు శ్రీరామ్ వేణుకు విజయం దక్కిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
రాజీవ్ (రాజీవ్ కనకాల), నాని (నాని) అన్నదమ్ములు. నాని ఎలాంటి బాధ్యత లేకుండా అన్నయ్య మీద ఆధారపడి హ్యాపీగా కాలం గడిపేస్తుంటాడు. తల్లి తండ్రి లేకపోవడంతో తమ్ముడిని ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచుతాడు రాజీవ్. అలా హాయిగా గడచిపోతున్న వారి జీవితంలోకి అన్న పెళ్లితో వదిన జ్యోతి (్భమిక) ప్రవేశిస్తుంది. ఇక అప్పటి నుంచి నానికి ఏదో కోల్పోతున్నానన్న బాధ కలుగుతుంటుంది. ఎంతో హ్యాపీగా వున్న జీవితంలోకి వదిన రాకతో అన్నయ్య తనని పట్టించుకోవడం లేదని నిరాశ పడుతుంటాడు. సరిగ్గా అదే సమంలో ఆర్టీఓ ఆఫీసర్ అయిన వదినకు వరంగల్‌కు బదిలీ అవడం వల్ల తోడుగా నాని వెళ్లాల్సి వస్తుంది. అన్నను విడిచిపోతున్నందుకు నానిలో బాధ చోటుచేసుకుంటుంది. కానీ వెళ్లక తప్పదు. వరంగల్‌కు వెళ్లిన వదినకు శివశక్తి ట్రావెల్స్ అధినేత శివ (విజయ్) అనే కుర్రాడి వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. అక్రమంగా నడుస్తున్న అతడి బస్సులన్నీ ఆమె సీజ్ చేస్తుంది. దాంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అతడి మనుషులతో ఆమెను చంపే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విషయం తెలిసిన నాని వాళ్ల బారి నుంచి వదినను రక్షించుకుంటాడు. అయితే.. అదే సమయంలో పదిరోజుల్లో వదినను చంపేస్తానని ఛాలెంజ్ చేస్తాడు శివ. అలా జరగనివ్వను అంటూ ప్రతి ఛాలెంజ్ విసురుతాడు నాని. ఈ పోటీలో ఎవరు నెగ్గారు? వరంగల్‌లో వుంటున్న పల్లవి (సాయి పల్లవి)తో ఎలా ప్రేమలో పడ్డాడు? ఇంతకీ వారి ప్రేమాయణం ఎలా మొదలయింది? వదిన సమస్యను తన భుజాలపై వేసుకున్న నాని ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? శివ-నానికి మధ్య జరిగిన వార్‌లో ఎవరు నెగ్గారు? అనేది తెరపై చూడాల్సిందే.
దర్శకుడు శ్రీరామ్ వేణు ఎంచుకున్న కథ మంచిదే. అయితే దాన్ని తెరకెక్కించే విషయంలో అంత సక్సెస్ కాలేదు. మిడిల్ క్లాస్ వ్యక్తులు.. వారికి ఎదురయ్యే సమస్యలు.. వాటి నుంచి వారు ఎలా దాటుకుంటూ వెళతారు.. అదే సమస్యను ఫేస్ చేసేటప్పుడు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూపించే ప్రయత్నం చేశాడు. వదిన, మరిది మధ్య ప్రేమానుబంధాన్ని తెలిపే చిత్రాలు ఇది వరకు ఎన్నో వచ్చినా, ఇలా పూర్తి స్థాయిలో వదినను విలన్ భారీనుండి కాపాడుకునే మరిది అనే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రాలేదు. వదిన, మరిది మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. తొలి చిత్రంతో నిరాశపరిచిన దర్శకుడు రెండో ప్రయత్నంలో ఫర్వాలేదనిపించాడు. కథా కథనాల్లో మంచి పట్టు చూపించాడు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో, విలన్ మధ్య సాగే ఎత్తుకు పై ఎత్తులు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. తొలి భాగాన్ని వినోదాత్మకంగా నడిపిన దర్శకుడు సెకండాఫ్‌కు వచ్చేసరికి కాస్త తడబడ్డాడు. ఒకే మూడ్‌లో కొనసాగించాడు. నాని, సాయి పల్లవిల లవ్‌ట్రాక్ సరదాగా సాగుతూ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అయితే నాని, దిల్‌రాజు చిత్రం అంటే ప్రేక్షకులు కచ్చితంగా కొత్త పాయింట్‌ను ఆశిస్తారు. కానీ దర్శకుడు పాత కథని నమ్ముకున్నాడు. రొటీన్ కథని సరదా సన్నివేశాలతో నడిపించాడు. విలన్ పాత్ర యొక్క ముగింపును తప్ప ప్రతి పాత్ర ప్రవర్తన, పరిస్థితి ఎక్కడికక్కడ ఊహకందిపోతూనే ఉంటాయి. దీంతో సినిమాపై పెద్దగా ఆసక్తికానీ, చూస్తున్నంతసేపు థ్రిల్‌కానీ కలగవు. మిడిల్‌క్లాస్ అబ్బాయ్ అంటూ టైటిల్ పెట్టుకున్నప్పుడు ఆ మధ్య తరగతి నేపథ్యం తాలూకు వినోదం ఉంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ.. అదేం ఉండదు.
నటీనటుల విషయానికొస్తే.. మిడిల్‌క్లాస్ కుర్రాడిలా నాని సినిమా అంతటా తనదైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలను ఇరగదీశాడు. డ్యాన్సులు కూడా చక్కగా చేశాడు. ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశానికి ముందు వదిన మంచితనాన్ని అర్థం చేసుకునే సన్నివేశంలో లాగే చివరగా వదినను కాపాడుకునే సన్నివేశంలో నాని నటన ఆకట్టుకుంటుంది. చక్కగా సాగిపోతున్న సినిమా ఒక దశలో బలహీన పడుతుందా? అని అనుమానం కలిగే సమయానికి నాని తన సహజధోరణిలో విజృంభించి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ప్రథమార్థంలో వచ్చే నాని, అతని మిడిల్‌క్లాస్ జీవితం తాలూకు సన్నివేశాలు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఉద్యోగం లేకుండా జులాయిలా తిరుగుతున్న మిడిల్‌క్లాస్ యువకుడిగా, అటు తర్వాత వదినకు చేదోడు వాదోడుగా వుండే పాత్రలో నాని పూర్తిగా ఒదిగిపోయాడు. ఫస్ట్ఫాలో నాని కుదిరినప్పుడల్లా తన నటనతో లాక్కొచ్చాడు. కథానాయిక సాయి పల్లవికి పెర్ఫార్మెన్స్ చేసేంత స్కోప్ లేనప్పటికీ తన పాత్రలో బాగానే నటించింది. నానితో పాటల్లో చేసే డాన్సుతో ఆకట్టుకుంది. వదినగా భూమిక చావ్లా రీ ఎంట్రీ అదిరింది. దర్శకుడు ఆమె పాత్రను చక్కగా తీర్చిదిద్దాడు. ఆర్‌టిఓ ఆఫీసర్‌గా చాలా హుందాగా కనిపించింది. ట్రావెల్స్ అధినేత శివగా విజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. సీనియర్ నరేష్, ఆమని, రాజీవ్‌కనకాల, నాని స్నేహితుడిగా నటించి ప్రియదర్శితో పాటు పోసాని కృష్ణ మురళి, వెనె్నల కిషోర్ తదితరులు తమకున్న పరిధి మేరకు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగానికొస్తే..దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఏ మాత్రం కొత్తదనం కనిపించలేదు. ‘ఏవండోయ్ నాని గారూ..’అనే ఒక్క పాట మినహా ఏవీ అంత క్యాచీగా లేవు. ఈ పాటలో నానితో సాయి పల్లవి వేసిన సిగ్నేచర్ స్టెప్ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతంలోనూ దేవిశ్రీ ముద్ర కనిపించలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఫర్వాలేదు. వరంగల్, లక్నవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని సమీర్‌రెడ్డి తన కెమెరాలో ఎంతో అందంగా బంధించాడు. ‘్ఫదా’ తర్వాత మరోసారి తెలంగాణ ఇంటీరియర్స్‌ని కనువిందుగా చూపించిన చిత్రమిది. పాటల చిత్రీకరణలో ఈ అందం తొణికిసలాడింది. నిర్మాణ విలువలు బావున్నాయి.
మొత్తం మీద రోటీన్‌కథలో కొత్తమలుపులేం లేవు. ద్వితీయార్థంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడివుంటే బావుండేది. క్లైమాక్స్‌లో హీరో, విలన్‌ల మధ్య పోరు రసవత్తరంగా మలచలేకపోవడం వల్ల ఈ ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’ ఫర్వాలేదనిపించాడు.

-ఎం.డి అబ్దుల్