రివ్యూ

మిస్టరీ థ్రిల్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క క్షణం ** ఫర్వాలేదు
తారాగణం:
అల్లు శిరీష్, సురభి, సీరత్‌కపూర్ అవసరాల శ్రీనివాస్, దాసరి అరుణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్,
ప్రవీణ్, సత్య తదితరులు.
సంగీతం: మణిశర్మ
కెమెరా: శ్యామ్ కె. నాయుడు
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: చక్రి చిగురుపాటి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ ఆనంద్

** ** *** *****************************

మె గా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి హీరోగా నిలదొక్కుకునేందుకు శక్తిమేర కృషి చేస్తూనే వున్నాడు. ‘శ్రీరస్తు-శుభమస్తు’ చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న అతడు కాస్త గ్యాప్ తీసుకొని ‘ఒక్క క్షణం’ అనే ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి హర్రర్ చిత్రాన్ని రూపొందించిన వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకే రీతిన సాగుతుంటే? ఒకరి ప్రస్తుతం మరొకరికి భవిష్యత్తు అయితే? ఈ వ్యక్తి తాలూకు అనుభవాలన్నీ వెనక వున్న వ్యక్తికి సైతం ఎదురవుతోంటే అనే పాయింట్ కొత్తగా వుంది. ఈ పాయింట్ చుట్టే అల్లుకున్న మిస్టరీ థ్రిల్లర్ ఈ చిత్రం. ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకే విధంగా ఉండటం అనే కానె్సప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉందా? లేదా?, దర్శకుడు వి.ఐ ఆనంద్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఆకట్టుకుందా? లేదా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
అనుకున్న పనిని సాధించే వరకు నిద్రపోడు జీవా (అల్లు శిరీష్). అతడి తల్లిదండ్రులు (కాశీ విశ్వనాథ్ - రోహిణి) కూడా అతడికి సపోర్ట్ చేస్తుంటారు. షాపింగ్ కోసమని ఓసారి వాళ్ల కుటుంబం బయటికి వెళతారు. అక్కడ జీవా జ్యోత్స్న (సురభి)ని చూస్తాడు. అలా ఒకరినొకరు చూసుకున్న వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. జ్యోత్స్న ఇంటికి ఎదురుగా శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్), అతడి భార్య స్వాతి (సీరత్ కపూర్) ఉంటారు. జ్యోత్స్నకి ప్రజలను రీడ్ చేయడం అలవాటు. ఈ క్రమంలో ఆమె శ్రీనివాస్ దంపతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుంటుంది. ఈ క్రమంలో భాగంగా జీవాకు తన జీవితం శ్రీనివాస్ జీవితం ఒకేలా ఉందని తెలుస్తుంది. అదే విధంగా స్వాతి, జ్యోత్స్న జీవితాలు కూడా ఒకే రకంగా ఉన్నట్లు అర్థమవుతుంది. అసలు ఇలా ఉండటం వల్ల ఏం జరిగింది? ఇంతకీ స్వాతికి ఏమయింది? ఆమెను చూసి జ్యోత్స్న ఎందుకు భయపడుతుంది? అనేదే అసలు కథ.
ఇన్ని కోట్ల జనాభాలో ఎక్కడో ఓ చోటా రెండు జీవితాలు మ్యాచ్ అవుతాయన్న సైన్స్ సిద్ధాంతం ఈ కథకు ఆధారంగా మలిచారు. సమాంతర జీవితాలు అనే పాయింట్‌ను తీసుకున్న దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచాడు. జాన్ ఎఫ్.డి కెనడీ, అబ్రహాం లింకన్‌ల జీవితాల మధ్య సారూప్యత ఉందన్నది చూపిస్తూ శ్రీనివాస్-జీవాల కథను అల్లుకున్నారు. తన ప్రతీ సినిమాను డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించే దర్శకుడు వి.ఐ ఆనంద్ ఈసారి ప్యారలల్ లైఫ్ అనే సైన్స్ ఫిక్షన్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. కథలో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరపై ఆవిష్కరించగలిగాడు. క్లిష్టమైన అంశాన్ని నిజమైన పరిశోధనల్లో పొందు పరిచిన సహజమైన, ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఆకట్టుకుంది. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో బలహీనత కనిపించింది. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్లు అనిపించింది. మొదటి యాభై నిమిషాలు పాత్రల పరిచయం.. ఏం జరగబోతోంది? అన్న దానికి కేటాయించాడు దర్శకుడు. ఇంటర్వెల్‌కి ముందే సమాంతర జీవితాల గురించి చెబుతాడు దర్శకుడు. దాంతో కథపై ఆసక్తికలుగుతుంది. స్వాతి హత్యతో కథ మరింత ఆసక్తిరేపుతుంది. ద్వితీయార్థంలో హీరో పోరాటాలు చూడవచ్చు. విధిని ఎదిరించి తన ప్రేమకోసం ఏం చేశాడు? అనేదే ముఖ్యం. చివరి అరగంట చిత్రం ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, ట్విస్టులు ఆసక్తిని కలిగిస్తాయి.
నటీనటుల విషయానికొస్తే అల్లు శిరీష్ నటన, డాన్సుల్లో చాలా ప్రతిభ కనబరిచాడు. అటు జోవిల్‌గానూ, ఇటు సీరియస్ గానూ రెండు రకాలుగా ఆకట్టుకున్నాడు. ఓ ప్రేమికుడుగా అల్లరి చేసిన శిరీష్ తర్వాత ప్రేమను కాపాడుకోవాల్సినప్పుడు అంతే సిన్సియారిటీ చూపించాడు. ‘శ్రీరస్తు-శుభమస్తు’ చిత్రంతో ఆకట్టుకున్న శిరీష్ ఈసారి నటనకు ప్రాధాన్యమున్న ఉన్న పాత్రను ఎంచుకున్నాడు. లవ్, రొమాంటిక్ సన్నివేశాల్లో ఫర్వాలేదనిపించినా, ఎమోషనల్ సీన్స్‌లో మరింత జాగ్రత్త పడాల్సింది. తల్లి క్యారెక్టర్‌లో రోహిణి చేసిన ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కథానాయికలుగా నటించిన సురభి, సీరత్‌కపూర్ క్యారెక్టర్స్ రెండూ చిత్రానికి కీలకమే. సీరత్ కన్నా సురభి ఎంతో చలాకీగా నటించింది. అభినయంతో పాటు అందంతోనూ అలరించింది. తన పాత్రకు న్యాయం చేసింది. అవసరాల శ్రీనివాస్ పాత్ర నిడివి చిన్నది. అయినా ఉన్నంతలో చేశాడు. అవసరాల శ్రీనివాస్ అంటే కామెడీ అనుకుంటారు. తను కూడా సీరియల్ పాత్రలోనే కనిపిస్తాడు. భార్యపై ప్రేమ ఉన్నా, పరిస్థితులు తన విలన్‌ని చేస్తే ఏం చేయాలో తెలియక సతమతమయ్యే పాత్రలో అతడి నటన బావుంది. ఇతర పాత్రల్లో నటించిన కాశీ విశ్వనాథ్, ప్రవీణ్, అతిథి పాత్రలో నటించిన దాసరి అరుణ్, కారు మంచి రఘు, సత్య తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే మణిశర్మ పాటల్లో ఏ మాత్రం కొత్తదనం లేదు. అయిత్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చిత్రానికి ప్లస్ అయింది. శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణం బావుంది. ముఖ్యంగా ఇండోర్ స్టేడియాల్లో కెమెరా పనితనం హైలైట్‌గా కనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాలో స్పష్టత ఉండేలా చేసింది. నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తం మీద ఇంతవరకు తెలుగుతెరపై చూడని ప్యారలల్ లైఫ్ అనే కథాంశంతో రూపొందిన ఈ ‘ఒక్క క్షణం’ ఉత్కంఠభరితంగా సాగి ఫర్వాలేదనిపిస్తుంది.

-రతన్