రివ్యూ

భిన్నమైన ప్రయత్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2 కంట్రీస్ ** ఫర్వాలేదు
తారాగణం:
సునీల్, మనీషారాజ్, సంజన రాజా రవీంద్ర, పృథ్వీ, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రమోహన్, సీనియర్ నరేష్, రాజ్యలక్ష్మి,
కృష్ణ్భగవాన్, దేవ్‌గిల్, షాయాజీ షిండే, సితార, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, చమ్మక్ చంద్ర, రచ్చరవి, శేషు, ఝాన్సీ తదితరులు

మాటలు: శ్రీ్ధర్ సీపాన
కళ: ఎ.ఎస్ ప్రకాష్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: సి. రాంప్రసాద్
నిర్మాణం: మహాలక్ష్మీ ఆర్ట్స్
నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.శంకర్

** ** ** ** *** ** * * * *

హాస్య నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన సునీల్ అటు తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు. సునీల్‌చిత్రమంటే కాసేపు హాయిగా నవ్వుకోవచ్చని ప్రతీ ఒక్కరూ థియేటర్‌లో అడుగుపెడతారు. అందుకు తగ్గట్టుగానే అతడి కథల ఎంపిక ఉంటుంది. అయితే గత కొంత కాలంగా సునీల్ విజయం కోసం తపిస్తున్నాడు. ఈ మధ్య అతడి చిత్రాలేవీ సంతృప్తినివ్వలేక పోతున్నాయి. ఇటీవలే ‘ఉంగరాల రాంబాబు’గా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తాకొట్టాడు. హాస్య నటుడిగా అలరించిన సునీల్‌ను ప్రేక్షకులు హీరోగా జీర్ణించుకోలేపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన అతడు కథానాయకుడిగా కూడా తనదైన టైమింగ్‌తో హాస్యాన్ని పండించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ నవ్వులు ఏ వర్గాన్నీ హాస్యంలో ముంచెత్తలేకపోతున్నాయి. కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ప్రారంభంలో మంచి విజయాలనే చవిచూసినా, తర్వాత ఆశించిన మేర సక్సెస్‌లను అందుకోలేకపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు హీరోగా సక్సెస్ సాధించాలనే ప్రయత్నం మాత్రం మానుకోలేదు. హాస్య నటుడిగా మంచి ఫామ్‌లో ఉండగానే హీరోగా మారిన అతడు ఆశించిన స్థాయిలో నిలదొక్కులేకపోతున్నాడు. కథానాయకుడిగా ఒకటి రెండు విజయాలు దక్కినా.. వరుస పరాజయాలు సునీల్ కెరీర్‌ని సందిగ్ధంలో పడేశాయి. మనశ్శాంతి లేకుండా చేశాయి. హీరోగా చేస్తే చేశాడు కానీ కామెడీ చేయడం లేదనే కారణం మీద తన చిత్రాలని ప్రేక్షకులు ఆదరించడం లేదనే ఆలోచన అయితే సునీల్‌కి వచ్చింది. అందుకే గత కొన్ని చిత్రాల్లో కామెడీ డోస్‌ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అవేవీ అంతగా వర్కవుట్ కావడం లేదు. తాజాగా సునీల్ మలయాళ సినిమాకు రీమేక్‌గా రూపొందిన ‘2 కంట్రీస్’తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందు కొచ్చాడు. ‘జై బోలో తెలంగాణ’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. చాలా గ్యాప్ తర్వాత ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ‘2 కంట్రీస్’తో సునీల్ సక్సెస్ సాధించాడా? ఈ చిత్రం ద్వారా దర్శకుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా? మలయాళంలో విజయాన్ని సాధిం చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం...
వెంకటాపురంలో నివసించే ఉల్లాస్ కుమార్ (సునీల్) డబ్బు కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పే రకం. అదే డబ్బు పిచ్చితో ఎన్నో మోసాలు చేస్తూ గడిపేస్తుంటాడు. అందుకోసం తన కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులను కూడా ఇబ్బందులకు గురి చేయడానికి వెనుకాడడు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఈజీమనీ కోసం నానా పాట్లు పడుతుంటాడు. అదే డబ్బు కోసం వెంకటాపురంలో పేరు మోసిన వడ్డీ వ్యాపారి పటేల్ (షాయా జీ షిండే) వద్ద తీసుకున్న అప్పును తీర్చలేక అతడి కూతురుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అయితే అదే సమయంలో ఫారిన్‌లో సెటిల్ అయిన తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనీషారాజ్)తో పరిచయమవుతుంది. లయ కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ సంబంధాన్ని వదిలేసి స్నేహితురాలిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతాడు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకా రం జరుగుతుంది. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ కుమార్ అయితే తన అలవాట్లకు అడ్డు ఉండదనే ఆలోచనతో అతడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత లయ గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, ఆమెను మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకున్న ఉల్లాస్ ఆమెను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఈ క్రమం లో కథ విచిత్ర మలుపు తిరుగుతుంది. ఉల్లాస్, లయకు మధ్య విభేధాలు వచ్చి వ్యవహారం విడాకుల వరకు దారితీస్తుంది. తర్వాత తన తప్పు తెలుసుకున్న ఉల్లాస్ లయతోనే కలిసి బతకాలనుకుంటాడు. అలా జరిగిందా? మరి వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? తెలుసుకోవాలంటే ‘2 కంట్రీస్’కు వెళ్లాల్సిందే.. మలయాళంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు ఎన్.శంకర్ చేసిన ప్రయత్నం మెచ్చుకోతగిందే. అయితే, కథానాయకుడి పాత్రను పోషించిన సునీల్ మాత్రం ఈ క్యారెక్టర్‌లో లీనం కాలేకపోయాడు. రొటీన్ కామెడీతో సాగిన ఈ చిత్రంలో సునీల్ అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే అది అంతగా పండలేదు. ఒక దశలో సునీల్ కామెడీ తీవ్ర నిరాశకు గురిచేసింది. దర్శకుడు ఎంచుకున్న ఈ ‘2 కంట్రీస్’ కథాపరంగా బాగున్నప్పటికీ.. వినోదం పాళ్లు లేక పోవడంతో కొంత లోటు కనిపించింది. సునీల్ కామెడీలో వినోదానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. ద్వేషాన్ని ప్రేమతో జయించడమే ఈ కథ. తనని మోసం చేశాడని తెలిశాక భర్తపై ద్వేషం పెంచుకుంటుంది లయ. అలాంటి భార్య మనసును భర్త తన ప్రేమతో ఎలా జయించాడు అన్న దాని చుట్టూ కథను తీర్చిదిద్దారు. మలయాళంలో విజయవంతమైన చిత్రానికి రీమేక్ తెరకెక్కిన ఈ కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. పంచ్‌లు, ప్రాసలతో సంభాషణలు ఆకట్టకుంటా య. సినిమా మేకింగ్ అదిరింది. నిర్మాణ విలువలు అంతే స్థాయిలో వున్నాయి. అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో రిచ్‌గా వుండి చిత్రానికి అందాన్ని తెచ్చిపెట్టాయి. చాలా మంది హాస్యనటులు ఉన్నప్పటికీ హాస్యం అంతంత మాత్రంగానే ఉంది. సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి అస్సలు సంబంధం ఉండదు. కొన్ని క్యారెక్టర్‌లు ఎందుకు ఎంటరవుతున్నాయో.. ఎందుకు వెళుతున్నాయో ఒక పట్టాన అర్థం కావు. కథ కీలకమైన మలుపు తిరిగి హీరోయిన్ పాత్ర ఏమిటో పూర్తిగా తెలిసిపోయాక కూడా ఆమె క్యారెక్టర్‌ను సిల్లీగా చూపించడంతో కొంత అసహనం కలిగింది. ఎన్.శంకర్ గత చిత్రాల్లో ఎక్కడా అసహజంగా ఉండే సన్నివేశాలు కనిపించవు. అతి కామెడీకి కూడా చోటుండదు. ఎందుకనో మరి..ఈ చిత్రంలో అలాంటివి అక్కడక్కడా తొంగి చూస్తాయ.
నటీనటుల విషయానికొస్తే.. హీరోగా నిరూపించుకునేందుకు సునీల్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ ‘2 కంట్రీస్’లోనూ అదే ప్రయత్నం చేశాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే సెంటిమెంట్ సన్నివేశాల్లో మాత్రం బాగానే ఆకట్టుకున్నాడు. రెండున్నర గంటల చిత్రంలో సునీల్ కొద్దిసేపు నవ్వించిపోతే ఎంజాయ్ చేయొచ్చు. కానీ కనిపించినంత సేపు అతడితో కామెడీ అంటే కష్టమే మరి! కామెడీ కోసం చేయాల్సినవన్నీ సునీల్ ఈ చిత్రంలో చేసేశాడు. తన మార్క్ రియాక్షన్స్, మేనరిజమ్స్ అన్నీ వాడేశాడు. అయినా..నవ్వురాదు. సినిమా అంతా ఎలాగోలా కానిచ్చినా ఈ కథకి అత్యంత కీలకమై క్లైమాక్స్‌లోని మెలోడ్రామా దగ్గర మాత్రం చేతులెత్తాశాడు. చాలా కాలం తర్వాత సునీల్ పూర్తిగా ఫైట్లకి దూరంగా వున్నాడు. ఎక్కడా కమర్షియల్ హీరో అనిపించుకునే ప్రయత్నం చేయలేదు. తనకున్న ఇమేజ్‌కి తగ్గట్టుగానే ప్రయత్నించాడు. అయితే తన ఇమేజ్‌కి తగ్గ కథ కాకపోయేసరికి సునీల్ ఎన్ని చేసినా ఫలితం లేకుండా పోయిం ది. కథానాయిక మనీషా అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయిలానే కనిపించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అందం పరంగా మంచి మార్కు ల్నే కొట్టేసింది. లాయర్‌గా కనిపించిన ఝాన్సీ, ఇతర పాత్రల్లో నటించిన సీనియర్ నరేష్, రాజా రవీంద్ర, సితార, సిజ్జు, సంజన, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, షాయాజీషిండే ఉన్నంతలో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ తన కామెడీతో అలరించాడు. సునీల్ స్నేహితుడుగా కనిపించిన శ్రీనివాసరెడ్డి కనిపించింది కొద్దిసేపే అయినా, తన పాత్రకు న్యాయం చేశాడు. సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంది. గోపీ సుందర్ అందించిన పాటలు పెద్దగా లేనప్పటికీ నేపథ్య సంగీతం మాత్రం బావుంది. కెమెరామెన్ సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయిం ది. అమెరికాలోని అందమైన ప్రదేశాలను తన కెమెరాలో బంధించి సినిమాకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. శ్రీ్ధర్ సీపాన మాటల్లో పంచ్‌లు, ప్రసాలే. ఇక నిర్మాణ విలువలు చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సింది.
ఎమోషనల్ డ్రామాలు సమర్ధవంతమైన రీతిలో తెరకెక్కించడంలో దర్శకుడు ఎన్.శంకర్‌కు పేరుం ది. అలాంటి దర్శకుడు తనకి అంతగా టచ్ లేని కామెడీ జోనర్‌లోకి అడుగుపెట్టడం మామూలు విషయం కాదు, గట్స్ కావాలి. ఈ సినిమాతో తన శైలికి పూర్తి భిన్నమైన ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎన్.శంకర్. కథను తక్కువ సమయంలో మంచి సన్నివేశాలతో, హెల్తీ కామెడీతో తెరకెక్కించడంలో దర్శకుడి శ్రమ కనిపిస్తుంది.

-ఎం.డి అబ్దుల్