రివ్యూ

కోనేటిరాయడు కొండదిగి వస్తే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ చిలుకూరి బాలాజీ ** ఫర్వాలేదు
తారాగణం: సాయికుమార్, ఎస్.పి. బాలు, సుమన్, అశోక్‌కుమార్, సమీర్, భానుశ్రీ మెహ్రా
స్క్రీన్‌ప్లే: అజయ్‌శాంతి,
ఎడిటర్: కె.రవీంద్రబాబు
కెమెరా: శ్రీనివాస్ కూనపరెడ్డి
సంగీతం: అర్జున్
రచన, నిర్మాణం, దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్

*** ** ** **

తెలుగు చిత్రసీమలో ఈ మధ్య భక్తి చిత్రాలు బాగా తగ్గిపోయాయి. ఈ సినిమాలను చూసేందుకు జనాలు కూడా అంతగా ఆసక్తి చూపిస్తున్నారా? అన్న ప్రశ్న బలం గా వుంది. అందుకు భక్తి సినిమాలు తీయడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇక తాజా గా శ్రీ వెంకటేశ్వరస్వామిపై ‘శ్రీ చిలుకూరు బాలా జీ’ అనే మరో భక్తి సినిమా వచ్చింది. ఫిల్మీడియా బ్యానర్‌లో అల్లాణి శ్రీ్ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ భక్తిరస చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథలోకి.. మాధవ (సాయికుమార్) ఒక నాస్తికుడు. దేవుడు లేడని నమ్మే మనిషి. తిరుమల వెళ్లడానికి ఆర్థిక సహాయం కోసం వచ్చిన ఒక భక్తుడికి దేవుడు లేడని చెబుతాడు. ఆ సమయంలో మాధవ భార్య (్భనుశ్రీ మెహ్రా) ఆ భక్తునికి సహాయం చేస్తుంది. కొంతకాలం తరువాత మాధవ నాస్తికుడి నుండి దేవుడు ఉన్నాడని నమ్మి భక్తునిగా మారతాడు. ప్రతి ఏటా తిరుమల వస్తానని దేవునికి మాట ఇస్తాడు. ఒకసారి నడక దారిన తిరుమల వెళ్లిన మాధవకు మొదట ఆర్థిక సహాయం అడిగిన భక్తుడు ఎదురవుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? మాధవ దేవుణ్ణి ఎందుకు నమ్ముతాడు? తన స్వగ్రామమైన చిలుకూరులో వెంకటేశ్వరుని ఆల యం ఎందుకు నిర్మిస్తాడు? చిలుకూరి బాలాజీ మహిమలు ఏమిటి? కోనేటిరాయడు కొండదిగి వస్తే ఏం జరిగిందన్నదే మిగతా కథ.
మాధవ పాత్రలో సాయికుమార్ చక్కటి నటన కనబరిచాడు. అతని భార్య పాత్రలో భానుశ్రీ మెహా అందర్నీ ఆకట్టుకుంది. సాంప్రదాయం, భక్తిగల స్ర్తి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. అతిథి పాత్రలో కనిపించిన బాలసుబ్రహ్మణ్యం మెప్పించాడు. ఉన్నది చిన్న పాత్రే అయినా సినిమాకు కీలకం కావడంతో ఆయన చేసిన ఎపిసోడ్ బాగా పనిచేసింది. నారదునిగా నటించిన అశోక్‌కుమార్‌కు ఇలాంటి పాత్రలు కొట్టినపిండే. అవలీలగా కానిచ్చేసి భక్తుల మనసుల్ని గెలుచుకున్నాడు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ సినిమాను రూపొందించిన విధానం అందిరికీ నచ్చేలా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. పాత్రలు, సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో సినిమా ఆసక్తిగా నడిచింది. సినిమా నిడివి తక్కువగా ఉండడం, కథను అర్థం అయ్యే విధంగా సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఇలాంటి చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. గతంలో వచ్చిన ఆయన చిత్రాలు మనకు ఈ విషయానే్న తెలియజేస్తాయి. నటుడు భానుచందర్ వృద్ధుడి పాత్రలో చక్కటి నటన కనబరిచారు. సాయికుమార్ దేవుడు ఉన్నాడని నమ్మే సన్నివేశం బాగుంది. దేవుణ్ణి పూర్తిగా వ్యతిరేకించే సాయికుమార్ సడెన్‌గా దేవునికి భక్తుడు అవుతాడు. అతనికి దేవుడు ఉన్నాడని ఒక సన్నివేశం ద్వారా కనువిప్పు కలుగుతుంది. కానీ అలా కాకుండా, ఎందుకు అతను దేవుణ్ణి నమ్మాడు? దేవుడు ఉన్నాడనే నిజం తెలుసుకోవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బావుండేది.
ఇక సాంకేతిక విభాగం గురించి చెప్పాలంటే.. దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ ఎంచుకున్న కథ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనకు తెరరూపం. తను అనుకున్నది అనుకున్నట్లు ప్రేక్షకులకు చూపించడంలో సఫలమయ్యారు. ఈ చిత్రంలో ముఖ్యంగా స్క్రీన్‌ప్లే గురించి చెప్పుకోవాలి. అజయ్‌శాంతి అందించిన స్క్రీన్‌ప్లే ఆద్యంతం ఎంతో సాఫీగా సాగి ఆకట్టుకుంది. చిన్న కథకు చక్కటి స్క్రీన్‌ప్లేని అందించి మంచి మార్కుల్ని కొట్టేశారు. ఇక దేవుడు ఉన్నాడు, దేవుని గొప్పతనం గురించి చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. కూనపరెడ్డి కెమెరా వర్క్ సూపర్. ముఖ్యంగా పై లోకంలో చిత్రీకరించిన సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అనవసరమైన సన్నివేశాలు లేకుండా ఎడిటర్ కె.రవీంద్రబాబు జాగ్రత్తపడ్డాడు. అర్జున్ అందించిన సంగీతం బాగుంది. సుద్దాల అశోక్‌తేజ (హే..శ్రీనివాసా..రా..రా!), వీరేంద్ర కాపర్తి (కదిలింది పాదం..), జొన్నవిత్తుల, డా.రాణీ పులోమాజాదేవి రాసిన పాటల్లో సాహిత్యం బాగుంది. తిరుమల వెళ్లలేని చాలా మంది భక్తులకు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించవచ్చని, తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వరుడు భక్తుల కోరికలు తీరుస్తూ వారిని మంచి మార్గంలో నడిపిస్తున్నాడనే సందేశం ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మంచి భక్తిరస చిత్రం చూడాలనుకొనేవారు ఈ సినిమాను ఏ మాత్రం మిస్ కావొద్దు. అలాగే చిలుకూరు బాలాజీ దేవాలయం విశిష్టత.. దాని చరిత్ర తెలుసుకునే అంశాలు ఉన్నాయి.

-త్రివేది