రివ్యూ

అనుష్క విశ్వరూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాగమతి *** బాగుంది
తారాగణం:
అనుష్క, ఉన్నిముకుందన్, జయరామ్, ఆశాశరత్, మురళీశర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శీను, విద్యుల్లేఖా రామన్,
నిర్మాణం : యు.వి.క్రియేషన్స్
సంగీతం : థమన్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ : రవీందర్
కెమెరా : ఆర్.మది
నిర్మాతలు : వంశీ-ప్రమోద్.
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.అశోక్

*******************

చెంచల అనే ఐఏఎస్ ఆఫీసర్‌ను విచారణ నిమిత్తం భాగమతి బంగ్లాకి తరలిస్తారు.
ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి బీభత్సం
సృష్టిస్తుంది. ఇంతకీ ఆ భాగమతి ఎవరు? ఆమె చెంచలను ఎందుకు ఆవహించింది? అసలు నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్ అయిన చెంచల ప్రియుడినే ఎందుకు
హత్య చేసింది? చెంచలను తీసుకెళ్లిన భాగమతి బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా? ఆమెను భయపెట్టి, చిత్రహింసలకు గురిచేసిందెవరు? ప్రాణధార ప్రాజెక్టు వెనకున్న అలు కథేంటి? మచ్చలేని వ్యక్తిగా ప్రజల్లో పేరున్న మంత్రి ఈశ్వరప్రసాద్‌కు సిబిఐకి వున్న లింకేమిటి? ఈ సమస్యలనుంచి చెంచల ఎలా బయటపడింది?
అనుష్క... ఈ తరం కథానాయికల్లో నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలంటే దర్శక నిర్మాతలకు వెంటనే గుర్తొచ్చే పేరు. ఓ పక్క తన స్టామినాను నిరూపించే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలను పోషిస్తూనే మరోపక్క గ్లామర్ పాత్రలనూ సైతం వదలడంలేదు. ‘అరుంధతి’తో మొదలైన ఆమె విజృంభణ కొనసాగుతూనే వుంది. కథానాయిక ప్రాధాన్యం వున్న పాత్రలంటే అవి అనుష్క మాత్రమే చేయగలదన్న గట్టి నమ్మకాన్ని అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు పరిశ్రమలోనూ కలిగించింది. ‘బాహుబలి’ చిత్రాలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. దేవసేనగా ‘బాహుబలి’లో తనదైన శైలిలో అలరించింది. ‘అరుంధతి’ క్రేజ్‌తో రచయితలు ఆమె కోసమే కథలు రాయడం, పాత్రల్ని సృష్టించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుష్క కీలకపాత్రలో నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద స్టార్ హీరోలకు సమానంగా భారీ వసూళ్లను సాధిస్తుండటం, కథానాయికగా అనుష్క క్రేజ్ పెరగడంతో ఆమెను ప్రధాన భూమికగా చేసుకుంటూ సినిమాలు తెరకెక్కించడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు చిత్ర సీమలో స్టార్ హీరోయిన్స్‌లో అనుష్క ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి, బాహుబలిలో దేవసేన పాత్రల్లో అనుష్క మెరుపులు కురిపించింది. అందుకే ఇప్పు డు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలంటే అనుష్క కే ప్రాధాన్యం ఇస్తున్నారు దర్శక నిర్మాతలు.
తాజాగా అనుష్క ‘్భగమతి’గా ప్రేక్షకుల్ని మెప్పించేందుకు వచ్చింది. ‘పిల్లజమిందార్’ ‘సుకుమారుడు’ లాంటి క్లాస్ చిత్రాలను తెరకెక్కించిన అశోక్ తొలిసారిగా తన పంథాని మార్చి చేసిన సినిమా ‘్భగమతి’. అప్పుడెప్పుడో ఈ చిత్రానికి పునాదులు పడ్డాయి. కేవలం అనుష్క కోసమే దర్శక, నిర్మాతలు ఇంతకాలం వేచి చూసారు. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలకు ముందు ప్రచార చిత్రాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
మరి తొలిసారిగా తన పంథాన్ని మార్చి అనుష్కను భాగమతిగా చూపించిన దర్శకుడు అశోక్ సక్సెస్ సాధించాడా? భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
కేంద్రమంత్రి ఈశ్వర్ ప్రసాద్ (జయరామ్) నిజాయితీకి పెట్టింది పేరు. అందరి అభిమానాన్ని చూరగొనే రాజకీయ నాయకుడుగా ఎదుగుతాడు. అతని ఎదుగుదలను, ప్రజల్లో వున్న పలుకుబడిని చూసి ఓర్వలేని రాజకీయ ప్రత్యర్థులు ఎలాగైనా అతడిని అడ్డుకోవాలని చూస్తారు. అందుకోసం అతడు అవినీతిపరుడని నిరూపించాలని ఆ బాధ్యతను సిబిఐ జాయింట్ డైరెక్టర్ వైష్ణవి నటరాజన్ (ఆశాశరత్)కు అప్పగిస్తారు. ఎలాగైనా రాజకీయంగా అతడిని తుంగలోకి తొక్కేయాలన్నది వీరి ప్రయత్నం. ఈశ్వరప్రసాద్‌ను ఇరికించేందుకు సిబిఐ డైరెక్టర్ వైష్ణవి, ఆయన దగ్గర రెండుసార్లు సెక్రటరీగా పనిచేసిన చెంచల ఐఎఎస్ (అనుష్క)ను విచారించాలనుకుంటుంది. తన ప్రియుడిని కాల్చిచంపిన కేసులో జైల్లో వున్న చెంచలను ప్రజల మధ్య విచారించడం సరికాదని, ఊరికి దూరంగా ఎవరూ పసిగట్టని ప్రాంతం లో వున్న భాగమతి బంగ్లాను ఎంచుకోవాలని నిర్ణయిస్తారు. సివిల్స్‌లో టాపర్ అయిన చెంచల నిజాయితీ ఐఎఎస్ ఆఫీసర్. ప్రజలకు తనవంతు సహా యం చేయాలని తపన పడుతూ వుంటుంది. మంత్రి ఈశ్వరప్రసాద్ వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తూ ఓరోజు ప్రాణధార ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన నిరసన తెలపడానికి వచ్చిన శక్తి (ఉన్నిముకుందన్) మంచితనం నచ్చి అతడిని ప్రేమించడం మొదలుపెడుతుంది. అనుకోని సందర్భంలో తను ప్రేమించిన శక్తినే హత్య చేసిన చెంచల జైలుకు వెళుతుంది. అలా కస్టడీలో వున్న ఆమెను పోలీసులు రహస్య విచారణకు భాగమతి బంగ్లాకు తీసుకెళతారు. చెంచల ఆ బంగ్లాలోకి ప్రవేశించగానే బంగ్లాలోని భాగమతి ఆత్మ ఆమెను ఆవహించి బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ భాగమతి ఎవరు? ఆమె చెంచలను ఎందుకు ఆవహించింది? అసలు నిజాయితీగల ఐఎఎస్ ఆఫీసర్ అయిన చెంచల ప్రియుడినే ఎందుకు హత్య చేసింది? చెంచలను తీసుకెళ్లిన భాగమతి బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా? ఆమెను భయపెట్టి, చిత్రహింసలకు గురిచేసిందెవరు? ప్రాణధార ప్రాజెక్టు వెనకున్న అలు కథేంటి? మచ్చలేని వ్యక్తిగా ప్రజల్లో పేరున్న మంత్రి ఈశ్వరప్రసాద్‌కు సిబిఐకి వున్న లింకేమిటి? ఈ సమస్యలనుంచి చెంచల ఎలా బయటపడింది? అన్నదే మిగతా కథ.
భాగమతి సినిమా హారర్‌తో ఆట్టుకునే పొలిటికల్ థ్రిల్లర్. ‘ఎవడుపడితే వాడు వచ్చిపోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా... భాగమతి అడ్డా’ అం టూ ఈ సినిమాపై అంచనాలు పెంచేసిన అనుష్క ఇన్ని కోట్ల ఖరీదైన చిత్రాన్ని తన భుజాలపై మోసి విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కంటికి కనిపించేదంతా నిజంకాదు, వింటున్నదంతా వాస్తవం కాదు. రీడ్ బిట్వీన్ ది లైన్స్ అనేది భాగమతి థియరీ. పొలిటికల్ నేపథ్యమున్న హారర్ చిత్రంగా మొదలయ్యే ఈ సినిమా అనూహ్య మలుపులతో మరోరకంగా ముగుస్తుంది. ప్రచార చిత్రాలతో సగటు ప్రేక్షకుడికి ఇదొక హారర్ సినిమాలా అనిపిస్తుంది. కానీ ఇది ట్రైలర్‌లో చూపించినట్టుగా హారర్ సినిమా కాదు. భాగమతి కథ అంతకన్నా కాదు. చెంచల కథనే ప్రధానాంశంగా నడిపించాడు దర్శకుడు. మంచితనం ముసుగులో కోటానుకోట్లు కొల్లగొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలనుకునే ఓ కుటిల రాజకీయ నాయకుడి నేర సామ్రాజ్యం చుట్టూ దర్శకుడు కథ అల్లుకుని దానికి చారిత్రక నేపథ్యం వున్న భాగమతి నేపథ్యాన్ని జోడించి హారర్ సినిమా అనే భ్రమను కలిగించే ప్రయత్నం చేసారు. సినిమా మొత్తం రాజకీయ నేపథ్యంలో సాగి పొలిటికల్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. భాగమతి బంగ్లాకు కథ షిఫ్ట్ అయిన తర్వాత వచ్చే నాలుగైదు సన్నివేశాలు నిజంగా హారర్ సినిమా చూస్తున్నామా? అనే భావనను కలిగిస్తాయి. భాగమతి బంగ్లా నుంచి కథను నడిపించిన దర్శకుడు ఎక్కువ భాగం ఆ బంగ్లాను చూపించడానికి సమయం తీసుకున్నాడు. దాంతో కొంత సాగదీత అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో చెంచల కాస్త భాగమతిగా మారిపోయిందని చూపించడంతో కథ ఆసక్తికర మలుపు తీసుకుంటుంది. ఒక దశలో ద్వితీయార్థం ముగింపులో వచ్చే సన్నివేశాల్లో చెంచలను విలన్‌గా చూపించే ప్రయ త్నం చేయడం, ఆ తర్వాత మళ్లీ వెంటనే ఓ ట్విస్ట్ ఇచ్చి కథని సుఖాంతం చేయడంతో క్లయమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భాగమతి చిత్రంలోని గొప్పతనమంతా ఆ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చిదిన సాంకేతిక నిపుణుల ప్రతిభలోనే దాగివుంది. భాగమతి కోటని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన కళా దర్శకుడు రవీందర్, తన కెమెరాతో అభూత కల్పనకి వాస్తవికతని చేకూర్చిన సినిమాటోగ్రాఫర్ మధి, వీటిని మించి తన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ చిత్రానికి ప్రాణం పోసిన థమన్.. అసలు సిసలైన కథానాయకులు సాంకేతికంగా అత్యున్నత శ్రేణిలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతల రాజీపడని ధోరణి కలసివచ్చింది. అనుష్క నటనే చిత్రానికి ప్రధాన బలం. చెంచలగా, భాగమతిగా విశ్వరూపానే్న ప్రదర్శించింది. ఐఏఎస్ అధికారిగా పాత్రకు తగినట్టుగా ఎంతో హుందాగా నటించింది. ఈ రెండు పాత్రల విషయంలో ఆమె తీసుకున్న జాగ్రత్తలు, వైవిధ్యం చూపిన విధానం ఆమె అనుభవానికి అద్దం పట్టాయి. అరుంధతి, రుద్రమదేవిగా చరిత్ర సృష్టించిన అనుష్క భాగమతిగా మరోసారి అదేస్థాయి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. భాగమతిగా రౌద్రరసాన్ని అద్భుతంగా పలికించింది. భాగమతి గెటప్‌లో మరోసారి అరుంధతి సినిమాని గుర్తుచేసింది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు కథకు ప్రధాన ఆధారంగా నిలిచిన ఆమె తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, నటనతో ఆద్యంతం కట్టిపడేసింది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో తన హావభావాలతో ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగేలా చేసి భాగమతిగా ఆకట్టుకునే తన ఆహార్యంతో బాడీ లాంగ్వేజ్‌తో పూర్తిస్థాయి నటనను కనబర్చి అదరగొట్టేలా చేసింది. నీటిపారుదల శాఖ మంత్రిగా జయరామ్, ప్రేమికుడిగా ఉన్ని ముకుందన్, సిబిఐ అధికారిని వైష్ణవీ నటరాజన్‌గా మలయాళ నటి ఆశా శరత్, సిఐ సంపత్‌గా మురళీశర్మ తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు. కానిస్టేబుల్స్ పాత్రల్లో విద్యుల్లేఖా రామన్, ధన్‌రాజ్, ప్రభాస్ శీను తమ నటనలతో ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. ముఖ్యంగా ధన్‌రాజ్‌కు ఇది పేరు తెచ్చే పాత్రే. నిర్మాణ విలువ బావున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఊహించని ట్విస్టులతో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని నడిపించిన తీరు బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. రవీంద్ర సెట్‌వర్క్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి అనుష్క అన్నీ తానై నడిపించిన భాగమతిలో మరోసారి తన నట విశ్వరూపానే్న ప్రదర్శించింది.

-ఎం.డి.అబ్దుల్