రివ్యూ

‘ఛలో’ నవ్వుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు ** ఛలో
**
తారాగణం:
నాగశౌర్య, రష్మిక మండన
సీనియర్ నరేష్, సత్య, వెనె్నల కిషోర్,
రఘుబాబు, పోసాని కృష్ణమురళి,
ప్రవీణ్, పవిత్ర తదితరులు.
సంగీతం: మహతి స్వర సాగర్
కెమెరా: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావ్
నిర్మాణం: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉష మల్పూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వెంకీ కుడుముల
**
యువ కథానాయకుడు నాగశౌర్య మంచి కుటుంబ కథా చిత్రాలను ఎంచుకుంటున్నాడు. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తో విజయాన్ని రుచి చూసిన అతడు ఆ దారిలోనే పయనిస్తూ అటు తర్వాత ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘జాదూగాడు’, ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలు చేసుకుంటూ కెరీర్‌ని ఆశాజనకంగా మలుచుకుంటున్నాడు. ఈ చిత్రాలన్నీ వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్లో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచాయి. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికీ తననుకున్న స్థానాన్ని మాత్రం ఈ చిత్రాలు ఇవ్వలేకపోయాయి. క్లాస్ హిట్స్‌తో ప్రేక్షకుల్ని మెప్పించిన నాగశౌర్య మధ్యలో మాస్ హీరోయిజం కోసం ప్రయత్నించి కొంచెం తడబడ్డాడు. ఇది గ్రహించిన అతడు మళ్లీ తన స్టయిల్‌లోకి మారి లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌పై దృష్టిసారించాడు. దాదాపు ఏడాది విరామం తర్వాత స్వంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌ను స్థాపించి వెంకీ కుడుముల దర్వకత్వంలో తాజాగా ‘్ఛలో’ అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. లవ్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం నాగశౌర్యకు ఎలాంటి సక్సెస్‌ని అందించిందో, చిత్రం ప్రారంభం నుండి పాజిటివ్ క్రేజ్‌ను తెచ్చుకున్న ఈ ‘్ఛలో’ ఏ స్థాయిలో ఉందో చూడాలంటే కథలోకి తొంగిచూద్దాం..
చిన్నప్పటి నుంచి గొడవలంటే హరి (నాగశౌర్య)కు ఎంతో ఇష్టం. ఆ గొడవల్లో తనకు దెబ్బలు తగిలినా సరే ఆనందపడుతుంటాడు. ఎప్పుడూ ఏదో గొడవ పడుతూనే కాలం గడుపుతుంటాడు. చిన్నప్పుడు హరి ఏడుపు ఆపడం లేదనీ, వాళ్ల నాన్న (సీనియర్ నరేష్) ఇతరులను కొట్టు కొట్టు అంటూ చూపిస్తూ కొడుతూ ఉంటే హరి నవ్వుల్లో మునుగుతూ ఉంటాడు. అలా మొదలైన హరి నవ్వు స్కూల్లో, వీధుల్లో కొనసాగిస్తూనే ఉంటాడు. ఈ నవ్వే చివరికి తండ్రికి తలనొప్పిగా మారుతుంది. తన కొడుకు గొడవలకు దూరంగా ఉండాలంటే గొడవలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో పెడితే మారతాడని అనుకుంటాడు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో తిరుప్పురు అనే గ్రామంలో నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయేప్పుడు తిరుప్పురు ఊరు మధ్యలోంచి సరిహద్దు వెళ్తుంది. మొదట సరిహద్దు గీయడానికి ఊరి పెద్దలు ఒప్పుకోరు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ఊరు తమిళ, తెలుగు భాగాలుగా విడిపోతుంది. అప్పటి నుంచీ ఆ ఊరిలో అటువైపు వారు ఇటు రారు.. ఇటువైపు వారు అటు పోరు. ఆ రెండు ఊళ్లకు అస్సలు పడదు. తెలుగు వాళ్లు, తమిళుల మధ్య పోరు సాగుతూ ఉంటుంది. హరి ఈ ఊరి కళాశాలలో చేరుతాడు. అతను తమిళ వ్యక్తి అనుకొని తమిళ బ్యాచ్ అతడిని వాళ్ల టీమ్‌లో చేర్చుకుంటుంది. అక్కడే కార్తీక (రష్మిక)ను చూసి ఇష్టపడతాడు. ఆమెలోనూ హరిలో వున్న లక్షణాలే వుంటాయి. అయితే కార్తీక ఓ తమిళ అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమించాలంటే ఆ ఇంట్లో వాళ్లకు నచ్చాలి. అది జరిగే పనికాదని తెలిసి.. ఆ రెండు ఊళ్లను కలపాలని అనుకుంటాడు. మరి ఆ రెండు ఊళ్లు కలిశాయా? వీళ్ల పెళ్లి జరిగిందా? ఆ ఊళ్ల వెనుక ఉన్న పగ ఏంటి? ఆ ఊరు హరి జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాకు ‘్ఛలో’ అనాల్సిందే.
రెండు ఊర్ల మధ్య వైరం.. దాంట్లో చిక్కుకున్న ప్రేమజంట. ఎనభై కాలం నాటి సెట్టింగ్ ఇది. కానీ యువ దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొటీన్ సెటప్‌కి తెలివైన స్క్రీన్‌ప్లే జత చేశాడు. కడుపుబ్బ నవ్వించే హాస్యంతో నింపేసి ఈ కథలోని రొటీన్ ఫీలింగ్‌ని కూడా మాయం చేయగలిగాడు. ఎక్కడా యాక్షన్ పరంగా హద్దులు దాటకుండా దర్శకుడు వెంకీ కుడుముల ప్రేమకథను కామెడీతో నడిపించాడు. కథ మొదలవడమే ఫన్ టోన్‌లో ప్రారంభమవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ని విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అతడిని తిరుప్పురం పంపిస్తారు. దాంతో కథ జోరందుకుంటుంది. కాలేజ్‌లో తెలుగు, తమిళ విద్యార్థుల మధ్య జరిగే వార్, తెలుగువాడు అని తెలియక హీరో దగ్గరైపోయే ఓ క్యారెక్టర్ (సత్య) అంతా వినోదాత్మకంగా సాగుతుంటుంది. మొత్తంగా చూస్తే ‘్ఛలో’ కథ చాలా చిన్న లైన్. రెండు ఊళ్లను కలపడం చాలా సినిమాల్లో చూశాం. అయితే కథ ఎలా ఉందన్నది పక్కన పెడితే దాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో పాత్రను చాలా విభిన్నంగా రాసుకొన్నాడు దర్శకుడు. దాని చుట్టూనే ఫన్ జనరేట్ చేశాడు. కళాశాల సన్నివేశాలు కొత్తగా అనిపించి నవ్వుల్లో ముంచెత్తుతాయి. హీరో, హీరోయిన్‌ల మధ్య సాగిన లవ్‌ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. తొలి అర్ధ భాగంలో పెద్దగా కథ లేకపోయినా, కామెడీ..పాటలతో నడిపించాడు. రఘుబాబు, సత్యల కామెడీ ట్రాక్.. కళాశాలలో స్లిప్‌లు రాసే సన్నివేశాలు కుర్రకారును బాగా అలరిస్తాయి. ద్వితీయార్ధంలోనే హీరో అసలు ట్రాక్ మొదలవుతుంది. ఒక లక్ష్యం అన్నది అప్పుడే ఏర్పడుతుంది. అది ఆ రెండు ఊళ్లను కలపడం. కథను మరీ సీరియస్‌గా నడపకుండా వెనె్నల కిషోర్ పాత్రను ప్రవేశపెట్టాడు దర్శకుడు. దీంతో వినోదం పాళ్లు పెరిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. తన లవర్ తనని వదిలేసి వెళ్లిపోయిందని, ఇప్పుడు అలాంటి బాధనే మరో లవర్‌కి ఇచ్చి రివెంజ్ తీర్చుకోవాలనే క్యారెక్టర్ వెనె్నల కిషోర్‌ది. ‘నినె్నవరో మోసం చేస్తే నా మీద రివెంజ్ తీర్చుకోవడమేంటి?’ అని అడిగితే ‘ఒక దోమ కుట్టిందని ఆల్ అవుట్ పెట్టి దోమలన్నిటినీ చంపేయట్లేదా.. ఇదీ అంతే!’ అంటూ లాజిక్కులు మాట్లాడుతూ వెనె్నల కిషోర్ సెకండాఫ్‌నే సేవ్ చేసే పెర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. ‘పట్టుదల వుంటే కానిది లేదు’ అంటే చేతిలోని వాటర్ బాటిల్‌లో నీళ్లు కింద ఒలకబోసి ‘నీ పట్టుదలతో ఈ నీళ్లని మళ్లీ బాటిల్‌లోకి ఎక్కించు’ లాంటి పంచ్‌లతో వెనె్నల కిషోర్ చెలరేగిపోయి తనకు తిరుగులేదనిపించుకున్నాడు. ఈ కథకి బేస్ లవ్‌స్టోరీ కానుక ఆ పార్ట్‌ని ఇంత తేలికగా తీసుకుని వుండాల్సింది కాదు. ప్రేమకథ అతంగా మెప్పించకపోయినప్పటికీ నాగశౌర్య, రష్మిక జంట సూపర్ అనిపించింది. విరామం ట్విస్ట్ ఊహించగలిగిందే అయినా కానీ మిస్‌లీడ్ చేస్తూ ఇచ్చిన బిల్డప్ చక్కగా కుదిరింది. దర్శకుడు వెంకీ కుడుముల కొద్దిగా కొత్తగా అనిపించే కథాంశాన్ని ఎంచుకుని దానికి పుష్కలంగా కమర్షియల్ హంగులను దట్టించి రాసుకున్న కథనమే ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్. దర్శకుడు ఎంతో తెలివిగా సినిమాని నడిపించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. హీరో దగ్గర్నుండి కథలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ముఖ్య పాత్రలోనూ వినోదాన్ని పండించాడు. సినిమా ఆరంభాన్ని హీరో పాత్ర చిత్రీకరణతో ఆసక్తిగా మొదలుపెట్టి మధ్య మధ్యలో సత్య, వైవా హర్ష, సుదర్శన్ వంటి హాస్యనటులతో తెలుగు, తమిళ వ్యక్తుల మధ్య నడిచే సరదా సరదా హాస్యాన్ని అందించి విరామానికి థ్రిల్ చేసే ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ఆకట్టుకున్నాడు.
నటీనటుల విషయానికొస్తే హరి పాత్రలో హీరో నాగశౌర్య సహజంగా ఎంతో చక్కటి నటన కనబరిచాడు. నాగశౌర్య ఇలాంటి క్యారెక్టర్ గతంలో ఏ చిత్రంలోనూ చేయలేదు. కథానాయిక రష్మికకు మంచి క్యారెక్టర్ లభించింది. దానిని ఆమె సమర్ధవంతంగా పోషించింది. రష్మికకు తెలుగులో తొలి సినిమానే అయినా తన నటన, క్యూట్ లుక్స్‌తో అలరించింది. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ ఒదిగిపోయాడు. తల్లి పాత్రలో ప్రగతి తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. కాలేజీ లెక్చరర్‌గా పోసాని కృష్ణమురళి, ప్రిన్సిపాల్‌గా రఘుబాబు, స్టూడెంట్స్‌గా వైవా హర్ష, శీను, సత్య ప్రేక్షకులకు నవ్వులు తెప్పించారు. ఊరి పెద్దలుగా తమిళ నటులు జి.ఎం కుమార్, మైమి గోపి, అచ్యుత్ కుమార్, రాకెట్ రాఘవ వారి పాత్రలకు ఉన్నంతలో పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా మణిశర్మ తనయుడిగా మహతి మ్యూజిక్ పరంగా మంచి మార్కుల్ని కొట్టేశాడు. పాటలు వినడానికే కాదు, చూడడానికి బాగున్నాయి. ముఖ్యంగా ‘చూసీ చూడంగానే..’ పాట బాగా ఆకట్టుకుంటుంది, నేపథ్య సంగీతం కూడా అలరించే స్థాయిలోనే వుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందాలు విరజిమ్మింది. యువ దర్శకుడు వెంకీ కుడుములలో మంచి హాస్య చతురత వుంది. చక్కని సంభాషణలతో ఆద్యంతం ప్రేక్షకుల్లో నవ్వులు కురిపించాడు. కోటగిరి ఎడిటింగ్ బాగుంది. ఉష మల్పూరి ఎక్కడా రాజీ పడకుండా పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తం మీద హాయిగా పసందైన వినోదాన్ని ఆస్వాదించాలంటే ‘ఛలో’ సినిమాకి.

-రతన్