రివ్యూ

మనసుకు నచ్చలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* మనసుకు నచ్చింది
*
తారాగణం:
సందీప్‌కిషన్, అమైరా దస్తూర్,
త్రిదా చౌదరి, అదిత్ అరుణ్,
ప్రియదర్శి, బేబీ జాన్వీ తదితరులు.
కెమెరా: రవి యాదవ్
సంగీతం: రధన్
నిర్మాణం: ఆనంది ఆర్ట్స్,
ఇందిరా ప్రొడక్షన్స్
నిర్మాత: పి.కిరణ్, సంజయ్ స్వరూప్
రచన, దర్శకత్వం:
మంజుల ఘట్టమనేని
*
తెలుగు చిత్రసీమలో ఇందిరా ప్రొడక్షన్ బ్యానర్‌పై పలు విజయవంతమైన సినిమాలను అందించిన మంజుల ఘట్టమనేని నటిగా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ‘షో’ చిత్రం ద్వారా నటిగా వెండితెరకు పరిచయమైన మంజుల మొదటి చిత్రంతోనే జాతీయ గుర్తింపును తెచ్చుకున్నారు. తొలిసారిగా మెగాఫోన్ పట్టి రూపొందించిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. యువతరం నటుడు సందీప్ కిషన్ హీరో. అతడు విజయం కోసం ఎంతగానో తహతహలాడుతున్నాడు. సందీప్‌కు సక్సెస్ తప్పని సరి. మరి ఇలాంటి తరుణంలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు వాయిస్ ఓవర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ద్వారా తొలిసారి దర్శకత్వం వహించిన మంజుల ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించింది? సందీప్ కిషన్‌ను విజయం వరించిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుల్లా పెరిగే సూరజ్ (సందీప్ కిషన్), నిత్య (అమైరా దస్తూర్) బావ మరదళ్లు. ఒకే ఫ్యామిలీలో కలిసి పెరుగుతారు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దలు వీళ్లిద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలనుకుంటారు. అయితే వాళ్లు మాత్రం తమ మధ్య ఉన్నది స్నేహం తప్ప ప్రేమకాదని, మేం ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటాం. మా జీవిత భాగస్వాములను మేమే వెతుక్కుంటాం అంటూ పెళ్లిపీటల మీద నుంచి గోవాకు చెక్కేస్తారు. అలా వెళ్లిన వాళ్లు తమ ఫ్రెండ్ శరత్ (ప్రియదర్శి) సహాయంతో ఓ గెస్ట్‌హౌజ్‌లో ఉంటారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ (త్రిదా చౌదరి), నిత్యకు అభయ్ (అదిత్ అరుణ్) పరిచయమవుతారు. వాళ్ల మధ్య ప్రేమ పుడుతుంది. అయితే నిత్య మాత్రం తన మసులో ఉన్నది సూరజ్ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్పగలిగిందా? పెద్దలు చేస్తున్న పెళ్లి ఇష్టం లేక పెళ్లిపీటల మీద నుంచి పారిపోయి వచ్చిన వాళ్లు ఎవరికి నచ్చిన భాగస్వాములను వారు తెచ్చుకోగలిగారా? అన్నదే క్లైమాక్స్.
టాలీవుడ్‌లో ప్రేమ నేపథ్యంలో వచ్చిన ఇలాంటి రొటీన్ కథలు అనేకం. ఇద్దరు స్నేహితులు ఎందుకు ప్రేమించుకోకూడదు? ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అనే పాయింట్ పాతదే. ఇలాంటివి చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే. ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు ఉన్న స్నేహితులు.. తమకు నచ్చిన దారుల్లో తమ జీవితాన్ని ఆస్వాదించడం.. ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం స్థూలంగా ఇదే కథ. అయితే ఇలాంటి కథ చుట్టూ దర్శకురాలు ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని పండించాలని చేసిన ప్రయత్నం కుదరలేదు. కథకు ప్రకృతి అనే కోణాన్ని జత చేయడం బాగానే వుంది. అయితే వాటికి సంబంధించిన సన్నివేశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాల్సింది పోయి.. బోర్ కొట్టేలా సాగి ఇబ్బంది అనిపిస్తాయి. ఆయా సన్నివేశాల్లో ఎక్కడా కొత్తదనం కనిపించకపోగా, ప్రేక్షకుడిని నీరసపడేలా చేస్తాయి. కొన్ని సన్నివేశాలైతే సుదీర్ఘంగా సాగి తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. క్లయిమాక్స్‌లో అయితే పాత ఛాయలే ఎక్కువగా కనిపిస్తాయి. పాత్రలు తప్ప.. కథ బలంగా లేకపోవడం, సన్నివేశాల్లో గాఢత లేకపోవడం చిత్రానికి ప్రధానంగా కనిపించే బలహీనతలే. ద్వితీయార్థంలో సాగే కథ ముక్కోణపు ప్రేమకథగా మారుతుంది. ఎవరికి మనసుకు నచ్చింది వాళ్లు చేయండి.. అని చెప్పడం ఈ కథ ముఖ్య ఉద్దేశం. అయితే దర్శకురాలు కూడా తనకు నచ్చిన కథ, తనకు నచ్చినట్టుగా తెరకెక్కించారు. అయితే ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా? అనేది మాత్రం ఆమె పూర్తిగా మరచినట్టున్నారు. హీరో హీరోయిన్లు ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండి చివరికి ప్రేమలో పడటం, ఆ ప్రేమను తెలుసుకోవడం అనే అంశాలు చుట్టూ అల్లుకున్న కథ పూర్తిగా గాడితప్పిపోయింది. మనం ఇలాంటి అంశాలు చాలా సినిమాల్లో చూడటం వల్ల కొత్తగా అనిపించవు. డ్రామా, రొమాన్స్‌కు మంచి అవకాశమే ఉన్నా, వాటిని సరిగా పండించలేకపోయారు దర్శకురాలు. ఫలితంగానే సినిమాలో అసలైన ప్రేమకథ ఏ మాత్రం మనసుకు నచ్చకుండా పోయింది. కథానాయకుడు సందీప్ కిషన్ మంచి నటుడు. అతడికి అలవాటైన యూత్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించాడు. అయితే అతడిని అనుకున్న రీతిలో ఉపయోగించుకోలేదు. హీరోయిన్‌లిద్దరూ అందంగా కనిపించారు. అయితే బికినీలో ఎక్స్‌పోజింగ్ చేసిన త్రిదా చౌదరికి నటించడానికి ఏం లేదు. అమైరా దస్తూర్‌కు నటించే అవకాశం దక్కింది. మంజుల కూతురు జాహ్నవి తళక్కున మెరిసి మురిపించింది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్ మాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ చిత్రంలో మిస్ అయ్యాయి. నాజర్, అదిత్ అరుణ్, సంజయ్, అనితా చౌదరిల పాత్రలు అతిథి పాత్రలే. వీళ్లంతా ఉన్నా, లేనట్టుగానే నటించారు. సాంకేతికంగా చూస్తే రధన్ సంగీతంలో పాటలు, సాహిత్యం ఫర్వాలేదనిపించాయి. రవి యాదవ్ సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తన కెమెరాలో గోవా అందాల్ని చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా సముద్రాన్ని చూసి తీరాల్సిందే. ఎడిటింగ్ ఫర్వాలేదు. మొదటి అర్ధ్భాగం కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. కెమెరా, సంగీతం, నిర్మాణ విలువలు చిత్రానికి బాలాలుగానే వున్నా, కథ, కథనం మరీ వీక్ అయ్యాయి. దర్శకురాలు మంజుల ఎంచుకున్న కథలో ఏ మాత్రం నవ్వతలేదు. దాన్ని తెరకెక్కించిన విధానం కూడా అంతే!

-ఉషశ్రీ తాల్క