రివ్యూ

మంచి ప్రయోగమే..కానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** అ!
**
తారాగణం:
కాజల్, నిత్యామీన్,
ఈషా రెబ్బ, రెజీనా,
శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి,
మురళీశర్మ, ప్రియదర్శి తదితరులు.
ఎడిటింగ్: గౌతమ్ నెరుసు
కెమెరా: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని
దర్శకత్వం:ప్రశాంత్ వర్మ
**
తెలుగులో కొత్త తరహా సినిమాలు రావా? అనే ప్రేక్షకులకు ఓ కొత్త తరహా అందించే ప్రయత్నం చేశాడు హీరో నాని. హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్న నాని ఈ సినిమాతో నిర్మాతగా మారి చేసిన మొదటి ప్రయత్నం ‘అ!’. వాల్‌పోస్టర్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. క్రేజీ హీరోయిన్స్ కాజల్, రెజీనా, ఈషారెబ్బ, నిత్యామీనన్ లాంటి హీరోయిన్స్ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాలు రెగ్యులర్‌గా చూసే సినిమా లవర్స్‌కు ఈ చిత్రం చూస్తే ఇతర సినిమాలు గుర్తొచ్చే అవకాశం లేకపోలేదు. ఎస్.జె. సూర్య ఇసై, క్రిస్ట్ఫర్ నోలన్ ‘ఇస్సెప్షన్’, డిస్నీవారి ‘ఇన్‌సైడ్ ఔట్’ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. అయితే తెలుగులో మాత్రం తప్పకుండా ‘అ!’ ఒక ప్రయోగమే అని చెప్పక తప్పదు. మరి ‘అ!’ అంటే ఏమిటి.. ఇంతమంది హీరోయిన్స్ ఎందుకున్నారు.. వాళ్ల కథా కమామీషు ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే!
ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. మనిషిలో చాలా భిన్న కోణాలుంటాయి. వాటిని సమాజానికి భయపడో.. లేక కుటుంబ పరిధులను దృష్టిలో ఉంచుకొనో మనిషి తనలోని ఎమోషన్స్‌ని లోపలే దాచుకుని.. పైకి మాత్రం ఒకే ఫీలింగ్‌తో కనిపిస్తాడు. అయితే అతనిలో భిన్నమైన పార్శ్వాలు స్పందిస్తే ఎలా వుంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తెరకెక్కించిన సినిమా ‘అ!’. నలభీమ.. ఓ రెస్టారెంట్‌లో చెఫ్.. తనకు ఏ రెసిపీ (వంటలు) చేయడం రాదు.. తాను మంచి వంటలు చేసాడని రుజువు చేసుకుంటే తప్పకుండా జాబ్ వస్తుంది.. అప్పుడు అతగాడికి వంటలు రావన్న విషయం తెలుసుకున్న చేప.. అతనితో వంటలు చేయిస్తూ వుంటుంది. అదే రెస్టారెంట్‌లో మీర (రెజీనా).. ఓ సర్వీస్ గర్ల్.. ఆ హోటల్‌లో గేట్ కీపర్ శివ (శ్రీనివాస్ అవసరాల)- ఇలా రకరకాల పాత్రలు కథలోకి వస్తుంటాయి. అయితే వీటన్నింటికీ లింక్ ఎక్కడ ఉంది.. ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్లు సతమతమవుతుంటారు. వాళ్ల మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతూ, విముక్తికోసం మాస్ మార్డర్స్ చేయాలనుకుంటుంది. అసలు రాధ, క్రిష్, నలభీమ... వీళ్లంతా ఎవరు. ఒకరికొకరికి మధ్యన సంబంధం ఏంటి? కాలి ఎవర్ని చంపాలనుకుంది. చివరికి వీళ్ళందరి కథ ఎలా ముగిసింది? మరి వాళ్ల సమస్యలకు పరిష్కారం దొరికిందా? అన్నది అసలు కథ...
ఆరంభం నుండి చూపించిన అనేక పాత్రలకి, వాటి చర్యలకి, సన్నివేశాలకి, మాటలకి జస్టిఫై చేసేలా వున్న ఈ ముగింపు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాకి ప్రధాన బలం క్లైమాక్స్. ఏ మాత్రం ఊహకందని ఈ ముగింపు చూశాక సినిమా అర్థమైన ప్రేక్షకుడు ఎవరైనా దర్శకుడ్ని మెచ్చుకోకుండా ఉండడు. మొదటి అర్థ్భాగం మొత్తాన్ని పాత్రల పరిచయానికే వాడుకున్న దర్శకుడు, ముఖ్యమైన నిత్యామీనన్, ఈషా రెబ్బ, కాజల్ అగర్వాల్, రెజీనా వంటి పాత్రల్ని చాలా ఆసక్తికరంగా పరిచయం చేశాడు. ముఖ్యంగా కాజల్, రెజీనా పాత్రలు తీవ్రంగా, మురళీశర్మ, ప్రియదర్శి పాత్రల్లో మంచి ఫన్ మూమెంట్స్ దొరుకుతాయి. చేప (నాని), బోన్సాయ్ చెట్టు (రవితేజ)ల మధ్యన జరిగే సంభాషణలు నవ్వించాయి. నాని, రవితేజల వాయిస్‌ఓవర్ ఆకట్టుకుంటుంది. నిత్యామీనన్, ఈషా రెబ్బ రోల్స్ చిన్నవే అయినా.. వారి క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ప్రియదర్శి పాత్ర హాలీవుడ్ చిత్రం ‘రటాటౌలి’లోని ప్రధాన పాత్రను తలపిస్తుంది. రెజీనా రోల్ చేయడానికి ధైర్యం కావాలి. ఆమె తప్ప మరెవరూ కూడా ఆ పాత్రను అంత కాన్ఫిడెంట్‌గా చేయలేకపోయేవారేమో! మురళీశర్మ రోల్ సినిమాకు చాలా కీలకం కానీ అది అర్థమవ్వడం కాస్త కష్టం. ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని ఆసక్తికరంగా ముగించి.. రెండో భాగంలో ప్రేమ, కొన్ని సోషల్ ఎలిమెంట్స్, హర్రర్ వంటి జానర్లను సమపాళ్లలో మిక్స్ చేసిన దర్శకుడు ఎండింగ్ మాత్రం ఊహించని రీతిలో ముగించాడు.
మార్క్ కె రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరొక పెద్ద బలం. కీలకమైన ప్రతి సన్నివేశాన్ని ఎఫెక్టివ్‌గా తయారుచేశారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, దాన్ని అమలుపరిచిన విధానం బాగుంది. పేపర్‌మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెరమీద సాధ్యమైనంతవరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం మెచ్చుకోవచ్చు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా మొత్తాన్ని సింగిల్ లొకేషన్‌లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా ద్వితీయార్థంలో ఇంకాస్త అర్థమయ్యే రీతిలో చెప్పి ఉంటే బాగుండేది. కొత్త తరహా సినిమాలు మనం ఎందుకు చేయకూడదు అన్న నాని ప్రయత్నం బాగుంది. నిర్మాతగా నాని కొత్త తరహా ప్రయత్నానికి కావలసిన ఏర్పాట్లు బాగా చేసాడు.. నిర్మాణ విలువలు బాగున్నాయి. ద్వితీయార్థంలో ముగింపు ముందు జరిగే కొన్ని సన్నివేశాలు కొంత కన్ఫ్యూజన్‌కు గురిచేస్తాయి. కొత్తదనాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఫలితంతో సంబంధం లేకుండా ఒకడుగు ముందుకేసి నాని చేసిన ఈ సినిమా కొత్తదనాన్ని కోరుకునేవారికి నచ్చినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కానె్సప్ట్ ఆధారంగా తీయడంతో అందరికీ నచ్చాలని లేదు.
తెలుగు సినిమాల్లో ఇది ఖచ్చితంగా ఒక ప్రయోగమని చెప్పాలి. దర్శకుడు తన ఊహని ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో ఇంకాస్త నింపాదిగా, అర్థవంతంగా వివరించి ఉంటే సినిమాని కేవలం ఒక జోనర్ ప్రేక్షకులకే కాకుండా అందరికీ అర్థం అయి ఉండేది. మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్‌కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండి వుంటే ఇంకా బాగుండేది.

-శ్రీ