రివ్యూ

ఏ ‘మంత్రం’ పని చేయలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఏ మంత్రం వేసావె..
*
తారాగణం:
విజయ్ దేవరకొండ,
శివానీ సింగ్ తదితరులు.
సంగీతం: అబ్దస్ సమద్
సినిమాటోగ్రఫీ: శివారెడ్డి
నిర్మాణం: గోలీసోడా ఫిలిమ్స్
ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల
నిర్మాత, దర్శకత్వం : శ్రీ్ధర్ మర్రి
*
పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మంచి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకు అర్జున్‌రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందించడంతో రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమాతో ఆయన క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మొట్టమొదటి చిత్రం ‘ఏ మంత్రం వేసావే’ దాదాపు నాలుగేళ్ల తర్వాత విడుదల అయిన సినిమా ఇది. శ్రీ్ధర్ మర్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎవరు ఎవరిపై మంత్రం వేసారో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
నిఖిల్ (విజయ్ దేవరకొండ) ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఎప్పుడూ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అంటూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను కూడా బాధపెడుతుంటాడు. అలాంటి అతను సోషల్ మీడియా ద్వారా రాగమాలిక (శివానీ సింగ్) అనే అమ్మాయిని ఇష్టపడి ఆమెకు దగ్గరవ్వాలనుకుంటాడు. కానీ రాగమాలిక మాత్రం నిఖిల్ మెంటాలిటీని అంచనా వేసి తనని కలవాలంటే ఒక గేమ్ ఆడాలని అతనికి ఛాలెంజ్ విసురుతుంది. మరి ఆ గేమ్ ఏంటి, నిఖిల్ దాన్ని ఎలా ఆడాడు, చివరికి ఆమెను చేరుకున్నాడా లేదా, అసలు రాగమాలిక, నిఖిల్‌కు అలాంటి ఛాలెంజ్ ఎందుకు విసిరింది అనేదే అసలు కథ. హీరోగా విజయ్ దేవరకొండ పరిచయ చిత్రం కావడంతో నటన విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. విజయ్ నటన, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్ ఏ విషయంలోనూ ప్రత్యేకత చూపలేదు. అసలు సన్నివేశానికి సంబంధం లేకుండా విజయ్ హావభావాలు చూడ్డానికి ఇబ్బందిపడేలా చేస్తాయి. సోషల్ మీడియాకు, ఆన్‌లైన్ వీడియో గేమ్స్‌కు అడిక్ట్ అయిన కుర్రాడిగా అతని నటన బాగుంది. ముఖ్యంగా హీరోయిన్ కోసం వెతికే సందర్భాల్లో అతని ప్రయత్నాలు, పెర్ఫారెన్స్ ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్‌గా నటించిన శివానీ సింగ్ గ్లామర్ డాల్ తరహాలో సినిమాకి గ్లామర్ అద్దడానికి తప్పితే ఎందుకూ ఉపయోగపడలేదు. పైగా ఈమె ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ పెద్దగా కనిపించలేదు. ఇక మిగతా ముఖ్యపాత్రలు పోషించిన నటీనటులకు ఈ సినిమాలో ఎలాంటి క్యారక్టర్ పోషించారనే విషయంలో క్లారిటీ వారికైనా ఉందో లేదో వాళ్లకే తెలియాలి. దర్శకుడు శ్రీ్ధర్ మర్రి నేటి సోషల్ మీడియా, గాడ్జెట్స్ అనేవి యువత జీవితాలను ఎలా పెడదోవ పట్టిస్తున్నాయి, వాళ్లను సమాజం నుండి ఎలా దూరం చేస్తున్నాయి అనే అంశాన్ని తీసుకుని సినిమా చేయాలనుకోవడం అభినందించదగిన విషయమే కానీ దాన్ని సరైన రీతిలో తెరకెక్కించలేక పోవడంతో సినిమా అయోమయంగా మారింది. సమాజానికి అవసరమైనదే అయినా ఆసక్తికరమైన కథనం, సన్నివేశాలు క్వాలిటీ టేకింగ్ లేకపోవడంతో అది ప్రేక్షకుల్ని సరైన రీతిలో తాకలేకపోయింది. అబ్దస్ సమద్ సంగీతం గురించి, శివారెడ్డి సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిందేమీ లేదు. ఈ ఇద్దరి పనితనం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారిందే తప్ప సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటల సంగీతం ఆకట్టుకోలేకపోయింది. ద్వితీయార్థంలో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. విజయ్ దేవరకొండను ‘పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి’ లాంటి సినిమాల్లో చూసిన తరువాత ఈ చిత్రంలో చూడడం కొంత నిరుత్సాహంగానే అనిపిస్తుంది. మంచి పెర్ఫార్మర్ అయినప్పటికీ బలమైన పాత్రను, కదిలించే సన్నివేశాలను రాయకపోవడంతో అతను కూడా సినిమాను కాపాడలేకపోయాడు. సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా సరైన కథనం, ఆలోచింపజేసే సీన్లు లేకపోవడంతో అది బలంగా ప్రేక్షకుడ్ని చేరుకోలేక పోయింది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు కూడా కొంత తక్కువ స్థాయిలోనే ఉంది. కొందరు నటీనటులకు డబ్బింగ్ సరిగా కుదరలేదు. పెర్ఫార్మెన్స్ ఇబ్బందికరంగా కూడా అనిపించింది. సినిమా సెకండాఫ్ అయితే మరీ నాటకీయంగా ఉంది తప్ప ఎక్కడా రియాలిటీ కనిపించదు. దర్శకుడు చాలాచోట్ల ప్రేక్షకుల గురించి ఆలోచించకుండా ఎక్కువ స్వేచ్ఛను వాడేసుకుని, తనకు వీలైనట్టు సన్నివేశాలను, మలుపుల్ని రాసేసుకోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ రెండూ రొటీన్‌గా, సులభంగా ఊహించదగినవిగా ఉండటంతో పెద్దగా ఆసక్తి కలగదు. ఇక మధ్యలో వచ్చే పాటలు అస్సలు ఆకట్టుకోలేక పోయాయి. విజయ్ హిట్ సినిమాలను చూసి ఆ స్థాయి కంటెంట్, పెర్ఫార్మెన్స్ ఆశించి కనుక ఈ చిత్రానికి వెళితే నిరుత్సాహం తప్పదు. చాలా కాలం క్రితమే పూర్తయి ఇప్పుడు విడుదలైన ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కానె్సప్ట్, విజయ్ నటన మినహా పెద్దగా ఆకట్టుకునే వేరే అంశాలేవీ లేవు.

-త్రివేది