రివ్యూ

ఆనందమే లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* ఆనందం
*
తారాగణం:
అరుణ్, ధామస్ మాథ్యూ,
సిద్ధి, రోషన్, , అన్ను ఆంటోనీ,
విశాఖ్ నాయర్, అనార్కలీ,
రాజేష్ శర్మ, షెరామేథ్యూ,
కొట్టాయం ప్రదీప్, ధీరూ మహాజన్,
రేష్మా నాయర్, నివాన్ పాల్
సంగీతం: సచిన్ వారియర్
నిర్మాత: ఎ.గురురాజ్
దర్శకత్వం: గణేష్ రాజ్
*
ఉత్తమ గ్రంధంగా పేర్కొనడానికి దానికున్న పేజీలు ప్రమాణం కాదు. అలాగే ‘మంచి’ సినిమాకు ఓ పెద్ద చాంతాడు సైజు కథా వుండనక్కరలేదు. ఉండే చిన్న పాయింటే చిత్రాన్ని మొత్తం ఆకర్షణీయం చేయచ్చు. కానీ ‘ఆనందం’లో ఉన్నది చిన్నపాటి సరదాల సంగతుల ఇతివృత్తమైనా దాన్ని తెరకందించడంలో పూర్తిస్థాయి మెళకువలు పాటించనందువల్ల ప్రేక్షకులకు సంపూర్ణానందం పంచలేకపోయింది.
వివరాల్లోకి వెళితే... ముప్ఫై ముగ్గురు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఇండస్ట్రియల్ విజిట్‌కెళ్లినపుడు, అందులోని ఏడుగురి ప్రాణస్నేహితుల మధ్య జరిగిన మార్పులు తదితరాలు చూపడమే ఇందులో కథ. వారిలో నాయకత్వ లక్షణాలు కల అరుణ్ టీమ్ లీడర్‌గా వుంటాడు. తనకు పాశ్చాత్య సంగీతం, నృత్యం వగైరాలు ఇష్టం లేకపోయినా తన గర్ల్‌ఫ్రెండ్ దేవిక వద్ద తనకున్న ఇంప్రెషన్ చెడకూడదని, దానే్న పట్టుకు పాకులాడే గౌతమ్, అందరి దృష్టి తనపై ఉన్నా, తను మాత్రం ఐ లవ్ యు ప్రపోజల్ తెస్తే వారితో అప్పటినుంచి స్నేహాన్ని మానివేసే తత్వంగల దియా, దియా అంటే తన కిష్టమైనా, ఆమె అంతట ఆమె ఇష్టపడితేనే ప్రేమిద్దామన్న తలంపుతో ఉండే అక్షయ్... తదితరులు మిగతా ముఖ్య బృందం ఆ స్నేహితుల్లో. మరి వారి పరిస్థితుల్లో ఏమైనా ఈ ఇండస్ట్రియల్ విజిట్ మార్పు తెచ్చిందా? అన్నది మిగతా కథ. వాస్తవానికి ఈ విజిట్ ఉన్న నాల్గు రోజులే సినిమా నడకకు కాన్వాస్. ఇంత పరిమితమైన పరిధిలో- అదీ ఇంకా పరిపక్వ మనఃస్థితి రాని కళాశాల విద్యార్థుల మధ్య భావోద్వేగాలు పండించడం దర్శకునికి కత్తిమీద సామే. ఈ ప్రక్రియలో సగమే సఫలకృతుడయ్యాడు దర్శకుడు. ఎందుకంటే పాత్రల పరిచయం, ఉద్దేశ వివరణ, ట్రెజర్‌హంట్ అంటూ దాదాపు ప్రథమార్థం అనాసక్తిగా గడిచిపోయింది. చిత్రంలో ఆసక్తి రేకెత్తించే సంఘటనలు ఆరంభమయినది ద్వితీయార్థంలోనే అయితే పారిశ్రామిక విహారంలో వారికి కావాల్సిన విషయ వివరణ అంశాలకంటే ఆ టూర్‌లో ఆఖరి మజిలీగా పెట్టుకున్న ‘గోవా’ ప్రాంత పర్యటనపైనే సినిమా మొత్తం ఆధారపడడం అనౌచిత్యంగా అనిపించింది. కానీ సినిమాకు కావాల్సిన హుషారునీ, సన్నివేశాల కల్పనకు కాస్త స్వాతంత్య్రం కలిగించేది ఇదే కనుక దర్శకుడికి ఇలా చేయక తప్పలేదేమోననీ అనిపించింది. విద్యార్థినీ, విద్యార్థుల మధ్య కలుపుగోలుతనం ఎక్కువగానే సమాజంలో కనపడుతున్నా, ఈ మాదిరి సన్నిహితత్వం గమనిస్తే భవిష్యత్‌లో ఏ తల్లిదండ్రులూ తమ పిల్లల్ని పారిశ్రామిక విహారాలకి పంపే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి కానీ పంపరేమోనన్న భావన కూడా ఈ సినిమా చూసిన తర్వాత కలిగితే ఆశ్చర్యపడనక్కరలేదు. అయితే మనుషులమధ్య ఉండే కొన్ని కొన్ని సున్నితమైన బంధాలు దూరమైతే వాటి ప్రభావం పిల్లలమీద ఎలా ఉంటుందో అన్నదానితోపాటు, అవి అలా ఉన్నా, మన జీవనంలో అవి ఇబ్బంది పెట్టకుండా ఎలా చూసుకోవాలో, చేసుకోవాలో అన్నదాన్నీ దియా తండ్రి ద్వారా చెప్పించడం బావుంది. అదెలాగంటే ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండే దియా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయారు అని చెప్తుంది. దాని పర్యవసానంగా జరిగిన మరో జత సంఘటన ద్వారా అంతర్ముఖురాలై స్నేహితులతో కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనడానికి ఇష్టపడదు. అపుడు ఆమె తండ్రి ఫోన్ చేసి, ‘నాకూ, మీ అమ్మకీ పనె్నండేళ్ల వయసు తేడా ఉంది. అందువల్ల మా అభిప్రాయాల్లో తరచూ భేదాలొచ్చి విడిపోవాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ మేం మంచి స్నేహితులం’ అని చెప్పి, ఇవి నీ జీవితం సరదాగా గడపటానికి ఇవి ప్రతిబంధకాలుగా తీసుకోకూడదు అని హితవు పలుకుతాడు. నటీనటులందరూ కొత్తవాళ్లే అయినా అందరూ ఆరితేరినవారిలాగా నటించారు. చివరల్లో అక్షయ్ అన్నగా ‘ప్రేమమ్’లో ఆకట్టుకున్న నివాన్ పాల్ కనపడ్డారు. సినిమా మొత్తం పర్యాటక ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది కనుక, మైసూర్, హంపి, గోవా ప్రాంతాల అందాన్ని ఛాయాగ్రాహకుడు ఆనంద్ సి.చంద్రన్ వీలైన మేరకు బాగా చూపగలిగాడు. సచిన్ వారియర్ స్వరాల్లో మలయాళ (ఈ చిత్రం ఇదే పేరుతో 2016లో మలయాళంలో వచ్చినదానికి అనువాద రూపం) ఘుమఘుమలే అధికంగా కనపడ్డాయి. నివాన్ పాల్‌పై చిత్రీకరించిన ఆఖరి పాటలో ఆ ఛాయలు మరీ అధికంగా వ్యక్తమయ్యాయి. కాలేజీ నేపథ్యంలో అదీ వారు సాధారణంగా జరిపే పర్యటన కేంద్రంగా కథనల్లుకోవడం వైవిధ్యంగా ఉన్నా, ఆ వెరైటీకి ఆసక్తికర చిత్రణ జోడించి వుండే పేరు (ఆనందం)కు తగ్గ ఫలితాలు సాధించగలిగి వుండేదేమోననిపించింది.

-అనే్వషి