రివ్యూ

ఊహించిన ఊరమాసే ( **సరైనోడు) ** ఫర్వాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
అల్లు అర్జున్, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ త్రెస,
జయప్రకాష్, సాయికుమార్,
సుమన్, బ్రహ్మానందం
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మాటలు: ఎం.రత్నం
నిర్మాత: అల్లు అరవింద్
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను

బన్నీ సినిమా మీద సహజంగానే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా డ్యాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్, ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి పాళ్లుంటాయి కనుక. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విలన్ ఎపిసోడ్స్ ఒకటైతే, ఎమోషనల్ పాళ్లూ ఎక్కువే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. జత కుదిరిన బోయపాటి, బన్నీల నుంచి ఎలాంటి హైహీట్ సినిమా రాబోతుందోనని ఆడియన్స్‌లోనూ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పటివరకూ నందమూరి హీరోలతో సింహా, లెజెండ్, దమ్మువంటి పవర్‌ఫుల్ సబ్జెక్టులు చేసిన బోయపాటి, ఫస్ట్‌టైమ్ మెగా కాంపౌండ్‌లో హీరో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ చిత్రాన్ని చేశాడు. గీత ఆర్ట్స్‌పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు హీరోయిన్లు. ఊరమాస్‌గా ట్రైలర్లతో అదరగొట్టిన సరైనోడు ఎలా ఉన్నాడో తెలుసుకుందాం.
**
బోయపాటి గత చిత్రాలు బలమైన కథ, కథనాలతో ఆకట్టుకున్నా -సరైనోడులో ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలనే స్టోరీలా వండుకున్నాడు. కథలోకెళ్తే.. చీఫ్ సెక్రటరీ ఉమాపతి (జయప్రకాష్) చిన్న కొడుకు గణ (అల్లు అర్జున్) మిలటరీలో కొన్నాళ్ళు పని చేస్తాడు. సోల్యర్‌గాకంటే సొసైటీలోనే తనకు పనెక్కువుందని భావించి -సిటీలో జరిగే అన్యాయాలకు కారణమైన శత్రువుల పనిపట్టడమే పనిగా పెట్టుకుంటాడు. రోజుకు రెండు గొడవలు లేనిదే గణకి నిద్ర పట్టదు. గణ ఊరమాసు గొడవలు తండ్రికి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. కొడుక్కి పెళ్లి చేస్తేనైనా బాగుపడతాడని సగటు తండ్రిలానే భావించిన ఉమాపతి -అతని స్నేహితుడు జెపి (సాయికుమార్) కూతుర్ని చూసి రమ్మని బాబాయ్ శ్రీపతి (శ్రీకాంత్)తో గణను ఊరిపి పంపుతాడు. ఊరికి వెళ్ళే దారిలో అందమైన అమ్మాయి, పైగా ఆ ఏరియా ఎమ్మెల్యే హన్సితరెడ్డి (కేథరిన్)ని చూసి ప్రేమలో పడతాడు గణ. కానీ తండ్రి చెప్పిన మాట వినాలి కనుక, జెపి ఊరికి వెళతాడు. అక్కడ సాయికుమార్‌కి, ముఖ్యమంత్రి కొడుకైన వైరం ధనుష్ (ఆది పినిశెట్టి)కి ఊరి పొలాల విషయంలో తగాదా ఉంటుంది. సాయికుమార్‌ని తన దారిలోకి తెచ్చుకునేందుకు అతని కూతురు జాను (రకుల్‌ప్రీత్)ని కిడ్నాప్ చేస్తాడు ధనుష్. జానుని చూసుకోవడానికి వచ్చిన గణకు ఈ విషయం తెలిసి ధనుష్ మనుషులతో తలపడతాడు. జానుని విడిపిస్తాడు. ఇది తెలుసుకున్న ధనుష్, సాయికుమార్‌తోపాటు అతని బంధువుల్ని, అనుచరుల్ని చంపేస్తాడు. జాను తప్పించుకొని గణ దగ్గరికి వస్తుంది. దీంతో గణ, ధనుష్‌ల మధ్య వైరం ముదురుతుంది. అది ఎలా ముగిసిందనేదే మిగతా కథ.
నిజానికి కథాబలం లేని సినిమా ఇది. సన్నివేశాలనే సినిమాగా వండుకున్నాడు బోయపాటి. హీరో దూకుడుకి అర్థం లేకపోవడం, విచక్షణారహితంగా అందర్నీ చంపుకుపోవడమే పనిగా పెట్టుకున్నట్టు విలన్‌ను చూపడం.. ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. కామెడీ సీన్లు, లవ్ సన్నివేశాలు, విసుగు తెప్పించే యాక్షన్ సీక్వెన్స్‌లు బన్నీ కోసం భరించాలన్నట్టు సినిమా చూడక తప్పదు. ఎక్స్‌పోజింగ్‌తో ఆకట్టుకునే ఎమ్మెల్యేని ప్రేమించేయడం, ఆమెచుట్టూ తిరిగి పాటలు పాడటంలాంటి కొన్ని సన్నివేశాలు ఊరమాస్ నిర్వచనానికి ప్రతీకలని సరిపెట్టుకోవాలి. విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి బాగానే ఆకట్టుకున్నాడు. విలన్‌కూ ఓ క్యారెక్టర్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయగలిగాడు. డీసెంట్ లుక్‌లో ఆది నటన బావుంది. అల్లు అర్జున్ కొత్తగా కనిపించాడు. మాస్ లుక్, బాడీని బాగా డెవలప్ చేసినా, ఎమోషనల్ సీన్స్‌కు హెర్క్యులస్ ఫిజిక్ వర్కవుట్ కాలేదు. రకుల్‌ప్రీత్, కేథరిన్‌లను తెరనిండా గ్లామర్ ఆరబోసేలా (పాటల్లో మాత్రమే) ప్రయత్నించారు. తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే అప్పుడప్పుడు నవ్వించడానికి ట్రైచేశాడు బ్రహ్మానందం.
టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే.. రిషి పంజాబీ ఫొటోగ్రఫీ అద్భుతంగా వుంది. ప్రతి సీన్‌ని చక్కగా చూపించాడు. ముఖ్యంగా డ్యూయెట్ సాంగ్ చిత్రీకరణ బావుంది. థమన్ మ్యూజిక్ రెగ్యులర్ ఫార్మాట్‌లానే ఉంది. మూడు పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. రీరికార్డింగ్ ఫర్వాలేదు. సినిమాకి పెద్ద మైనస్ -స్లోమోషన్ సీన్లు. మొదటినుంచి చివరి వరకూ స్లో యాక్షన్ మోషన్‌తో విసుగు తెప్పించారు. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే -సరైనోడు అనిపించుకోలేకపోయాడు. యాక్షన్ లోడెడ్ సినిమా కనుక మాస్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. బోయపాటి తెరకెక్కించిన విధానం బన్సీ స్టయిల్‌కి సరిపోయింది. కథ, కథనాలను పకడ్బంధీగా వర్కవుట్ చేసుకునివుంటే, కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది. గొడవల్లో బిజీగావుండే హీరో ఆటవిడుపుగా ఎమ్మెల్యేని చూసి లవ్‌లో పడడం, ఆమెను ఒప్పించడానికి పాటలు, ఆమె విసుక్కోకుండా భరించడం, మధ్యలో కొన్ని కామెడీ సీన్లు ఇలా ఫస్ట్‌హాఫ్‌ను లాగించేశారు. సెకండాఫ్‌లో విలన్ ధనుష్‌ని గణ ఎదుర్కోవడం, అతని ఎత్తులకు హీరో పైఎత్తులు.. క్లైమాక్స్‌లో భారీ ఫైట్‌లో విలన్‌ని మట్టుబెట్టడం లాంటి ఫక్తు కమర్షియల్ ఫార్మాట్‌నే దర్శకుడు నమ్ముకున్నాడు. ఊరమాస్ ప్రచారాన్ని జస్టిఫై చేయడానికికే -అల్లు అర్జున్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి దర్శకుడు ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది మాస్‌కు మాత్రమే మసాలా చిత్రం.

-త్రివేది