రివ్యూ

విసిగించే యాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు
==========
*ఆచారి అమెరికా యాత్ర

తారాగణం:
మంచు విష్ణు, ప్రగ్యాజైశ్వాల్,
బ్రహ్మానందం, పోసాని,
ప్రదీప్‌రావత్, పృథ్వీ,
కోట శ్రీనివాసరావు తదితరులు.

సంగీతం: థమన్
ఛాయాగ్రహణం: సిద్దార్థ్,
నిర్మాతలు: కీర్తిచౌదరి-కిట్టు,
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి,
డార్లింగ్ స్వామి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
జి.నాగేశ్వరరెడ్డి

దశాబ్ద కాలానికి పైగా హీరోగా కొనసాగుతున్న మంచు విష్ణు కెరీర్‌లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎంటర్‌టైనర్ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందుకే మంచు విష్ణు కూడా ఆ తరహా సినిమాలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక దేనికైనారెడీ, ‘ఈడో రకం ఆడో రకం’లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందించిన నాగేశ్వరరెడ్డితో సినిమా చేశాడు విష్ణు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన మూడో సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. మరి ఈ ఆచారి అమెరికా యాత్ర సాఫీగా సాగిందా లేదా అన్నది తెలియాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే..
కృష్ణమాచారి (మంచు విష్ణు) ఒక పంతులు. అతను తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)తో కలిసి ఒక ఇంట్లో హోమం చేయించడానికి వెళ్తాడు. అమెరికానుంచి వచ్చిన ఆ ఇంటి పెద్ద మనవరాలు రేణుక (ప్రగ్యాజైశ్వాల్)ను అతను ఇష్టపడతాడు. కొన్ని పరిణామాల తర్వాత రేణుక కూడా అతడిని ఇష్టపడుతుంది. ఐతే హోమం ముగిసే సమయంలో ఆ ఇంటి పెద్ద హఠాత్తుగా చనిపోతాడు. ఆ తరువాత రేణుక అమెరికా వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ అమెరికా వెళ్లాలని ప్లాన్‌చేసి ఆమెకోసం కృష్ణమాచారి తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం)కి మాయమాటలు చెప్పి అందరినీ అమెరికా తీసుకెళతాడు. అక్కడ తన ప్రేమను దక్కించుకోవడం కోసం కృష్ణమాచారి ఏం చేశాడు? అతని వలన అప్పలాచారి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు కృష్ణమాచారి, రేణుకల ప్రేమకు అడ్డుపడింది ఎవరు అనేదే ఈ సినిమా.
మంచు విష్ణు సినిమాల్లో ‘్ఢ’.., ‘దూసుకెళ్తా’.., ‘దేనికైనా రెడీ’.., ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాలు వినోదమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీటిలో మూడు సినిమాల్లో బ్రహ్మానందం కీలక పాత్రలు చేశాడు. మంచు విష్ణుతో ఆయన కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని బాగానే నవ్వించారు. నాగేశ్వరరెడ్డికి కామెడీ డీల్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుంది. ఈ ముగ్గురూ కలిసి చేసిన మరో కామెడీ ప్రయత్నం ‘ఆచారి అమెరికా యాత్ర’. మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. కొత్తగా ఏమీచేయలేదు. తనకు అలవాటైన తరహాలోనే నటించాడు. అతడి పాత్ర ‘దేనికైనా రెడీ’ని గుర్తుకు తెస్తుంది. బ్రహ్మానందం సైతం అంతే. పేలవమైన పాత్రలో పెద్దగా నటించే స్కోప్ లేకపోయింది. సరైన సన్నివేశాలు లేక కామెడీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్ నటన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె గ్లామర్ ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రల్లో కనిపించిన అనూప్ సింగ్ ఠాకూర్, ప్రదీప్‌రావత్, పృథ్వీ, పోసాని, ప్రవీణ్, ప్రభాస్‌శీను వీళ్లెవ్వరూ నవ్వించలేకపోయారు. ఇక టెక్నికల్ విషయాల గురించి చెప్పాలంటే.. థమన్ పాటలు.. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తాయి. పాటలైతే మరీ దారుణం. ద్వితీయార్థంలో వచ్చే ఒక మెలోడీ కొంచెం వినసొంపుగా ఉంది. సిద్దార్థ్ ఛాయాగ్రహణం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు ఓకే. అమెరికా నేపథ్యం కాబట్టి సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్లే అనిపిస్తుంది. ‘తప్పించుకోవడానికి అది పులి పిల్లకాదు.. ఆడపిల్ల’..లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. నాగేశ్వరరెడ్డి తరహా కామెడీని ఆశించినవారికీ పెద్ద నిరాశే మిగిలింది. టైటిల్‌కోసమే అమెరికా నేపథ్యాన్ని ఎంచుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. పైగా దానివల్ల సినిమాకు ఏ ప్రత్యేకతా చేకూరలేదు. పాత తరహా కామెడీ ఫార్ములానే నమ్ముకుని వచ్చిన ఈ ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఏమీ అందించదు. తాత, మనవరాళ్లు ఎమోషనల్ ట్రాక్, బ్రహ్మానందం కామెడీ మినహా అదే పాత, బలహీనమైన కథాకథనాలు, కొద్దిగా కూడ ఆకట్టుకోలేకపోయిన సెకండాఫ్, ఎక్కడా కూడ పెద్దగా నవ్వించలేకపోయిన కమెడియన్ల పెర్ఫార్మెన్స్ వంటి బలహీనతలు కలిసి సినిమాను బోర్ కొట్టించేలా తయారుచేశాయి. కాలం చెల్లిన రొమాంటిక్ ట్రాక్ ఓవైపు.. ఏమాత్రం కామెడీ పండని బ్రహ్మానందం ట్రాక్ మరోవైపు.. రెండూ విసిగించేస్తాయి. ద్వితీయార్థంలో అసలు కథేంటో అర్థమైపోయాక ఇక ముగింపుకోసం ఎదురచూడటమే మిగులుతుంది. కథాకథనాల్లో విషయం లేనపుడు ఎలాంటి కాంబినేషన్ అయితే ఏముంది?

-త్రివేది