రివ్యూ

సెంటిమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఫర్వాలేదు
==========

** కణం
తారాగణం:
నాగశౌర్య, సాయిపల్లవి
వెరోనికా అరోరా, గాంధారి నితిన్,
ప్రియదర్శి, సంతాన భారతి,
రేఖ, రవి, స్టంట్ సిల్వా
తదితరులు.

సంగీతం: శామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఎడిటింగ్: ఆంథోనీ
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్,
ఎన్.వి.ఆర్ సినిమాస్
నిర్మాత: అలీరాజా సుభాష్‌కరణ్
దర్శకత్వం: ఏ.ఎల్.విజయ్‌డామా!

హారర్ చిత్రాలను తెరకెక్కించడంలో ఒక్కొక్క దర్శకుడిది ఒక్కొక్కశైలి. ఈ విషయంలో ఎవరి శైలిని తప్పుపట్టలేం. దక్షిణాదిన హారర్ చిత్రాల జోరు ఇంకా సాగుతూనే వుంది. హారర్ కామెడీ చిత్రాలను కొంతమంది తెరకెక్కిస్తే.. మరి కొందరు వాటిని ఎమోషనల్‌గా తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఒకరు భయంతో చిత్రాన్ని రూపొందిస్తే.. మరొకరు అదే భయానికి కాస్త సందేశాన్ని, మరికాస్త సెంటిమెంట్‌తో పాటు, ఎమోషన్‌ను కూడా జోడిస్తారు. ఈ రెండో కోవకు చెందిన దర్శకుడే ఏ.ఎల్ విజయ్. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలు చూస్తే అది మనకు అర్ధమవుతుంది. ఇలా ఎమోషనల్ హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమే ‘కణం’. తమిళంలో ‘దియా’ అనే పేరుతో ఈ సినిమా రూపొందింది. భ్రూణ హత్యలు అనే అంశంతో సాగిపోయే చిత్రమిది. ప్రతి ఏటా దేశంలో ఎన్నో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. వాటి వల్ల మనం గొప్పగొప్పవారిని కోల్పోయే అవకాశం వుంది. వీటిని ఆధారం చేసుకొని దర్శకుడు విజయ్ రూపొందించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ చిత్రం పలువాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ‘కణం’ కథేంటి? ఈ చిత్రం ఎలాంటి ఆదరణను పొందిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కృష్ణ (నాగశౌర్య), తులసి (సాయిపల్లవి) చదువుకుంటున్న సమయంలోనే ప్రేమలో పడతారు. ఆ ప్రేమ మరో అడుగుముందుకేసి వారిని తొందరపడేలా చేస్తుంది. ఫలితం తులసి గర్భవతి అవుతుంది. తొందరపాటు మూలంగా జరిగిన ఈ సంఘటన తెలిసిన ఇరువురి కుటుంబ పెద్దలు బలవంతంగా తులసికి అబార్షన్ చేయిస్తారు. అందుకు కృష్ణ కూడా ఒప్పుకుంటాడు. అయిదేళ్ల పాటు అటు కృష్ణని, ఇటు తులసిని కలవకుండా దూరంగా ఉంచుతారు. కృష్ణ చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగంలో చేరిన తర్వాత తులసిని ఇచ్చి పెళ్లిచేస్తారు. పెళ్లయిన తర్వాత కూడా తులసి ముభావంగానే ఉంటుంది. ఐదేళ్ల కిందట కడుపులో చనిపోయిన పాప గురించి ఆలోచిస్తుంటుంది. ఆ పాపకు దియా అనే పేరు పెట్టుకుంటుంది. అయితే కృష్ణ రాకతో తులసి జీవితం మళ్లీ ఆనందమయం అవుతుంది. కానీ, దియా అనే పాప వాళ్ల మధ్య ఆత్మ రూపంలో తిరుగుతుంటుంది. తన తల్లిని తనని దూరం చేసిన వాళ్లందరి మీద పగతీర్చుకుంటుంది. ఈ ఆత్మకు కోపం, కసి పెరిగి తనను పిండదశలోనే చంపిన వారిని అందరినీ చంపేస్తుంది. కృష్ణ తండ్రి, తులసి తల్లి, మేనమామ, అబార్షన్ చేసిన డాక్టర్‌ను ప్రమాదం సృష్టించి చంపేస్తుంది. ఆ విషయాన్ని తులసి ఒక దశలో పసిగట్టేస్తుంది. తరువాత దియా చంపబోయేది తన భర్త కృష్ణనే అని తెలుసుకుంటుంది. తనింట్లో తనకు పుట్టని ఓ పాప తిరుగుతోందని, అది ఆత్మ రూపంలో ఒక్కొక్కరిని చంపేస్తోందని తెలుసుకున్న తులసి ఏం చేసింది. దియా నుండి భర్త కృష్ణను ఆమె ఎలా కాపాడుకుంటుంది? దియాకు తన నాన్నపై ఉన్న కోపం తగ్గుతుందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. భ్రూణహత్యలు అనే అంశాన్ని దర్శకుడు మెయిన్ పాయింట్‌గా చెప్పాలనుకోవడం బాగానే వుంది. అయితే ఇలాంటి కథను సినిమాటిక్‌గా చెప్పేముందు దర్శకుడు ఎంతో ఆలోచించాలి. తెరకెక్కించిన విధానంలో తీసుకోవాల్సిన జాగ్రతలు ఎన్నో వుంటాయి. అవి సరిగా పండకపోతే ఇక అంతే.

ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంలో దర్శకుడు మరింత జాగ్రత్త పడాల్సింది. ప్లాట్ నెరేషన్‌తో సినిమా సాగుతుంది. భ్రూణ హత్యలు చేయడం ముమ్మాటికీ తప్పే. అయితే ఆ పాయింట్‌ను చెప్పడానికి ఓ హారర్ ఎలిమెంట్‌ను క్రియేట్ చేసి వరుస హత్యలతో సినిమాను నడిపించడం ఏమంత అతకలేదు. కథనం పరంగా చెప్పుకునేంతగా ఏమీ కనిపించదు. బలమైన ఎమోషన్స్ లేవు. ఇది ఒక ఆత్మకథ. ఇందుకు దర్శకుడు భ్రూణ హత్యలను పాయింట్‌గా తీసుకున్నాడు. ఈ లోకాన్ని చూడకుండానే ఎన్నో పిండాలు బలైపోతున్నాయి. ప్రస్తుతం అబార్షన్ అనేది చాలా చిన్న మాట అయిపోయింది. కానీ, కడుపులో ఉన్న పిండానికి ప్రాణం ఉంటుందని, తల్లిని చూడటానికి తహతహలాడుతుంటుందని అనుకొని దానిపై సినిమా తీయాలన్న దర్శకుడి ఆలోచనను అభినందించకుండా ఉండలేం. అయితే అసలు ఆత్మ ఐదేళ్ల వరకు ఎందుకు ఆగిందనేది సగటు ప్రేక్షకుడికి వచ్చే డౌటు. హారర్ థ్రిల్లర్ జోనర్‌లో చాలా సినిమాలొచ్చాయి. అయితే ఇందులో భయం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు, తల్లి సెంటిమెంట్‌ను కూడా జోడించి ఎమోషనల్‌గా చూపించాడు. ఇంటర్వెల్ అందర్నీ కదిలిస్తుంది. ద్వితీయార్థం ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిస్తుంది. దియా టార్గెట్ ఏంటో తెలిసిన తర్వాత కూడా కథను నడిపించడం మామూలు విషయం కాదు. క్లైమాక్స్ అంతుపట్టని విధంగా రాసుకున్నాడు దర్శకుడు.
ముఖ్యంగా మూడు పాత్రలు కృష్ణ, తులసి, దియాల మధ్య సాగే కథ. నాగశౌర్య, సాయిపల్లవి, వెరోనికా సహా మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు అనుగుణంగా నటించారు. ము ఖ్యంగా చివరి పదినిమిషాల్లో సాయిపల్లవి ఎమోషనల్‌గా నటించిన తీరు బావుంది. తల్లిగా, భార్యగా తన నటనతో కట్టిపడేసింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే నాగశౌర్య ఈసారి సీరియస్ పాత్రలో కనిపిస్తాడు. ఒక రకంగా ఇది తనకి కొత్త ప్రయత్నమే. దియాగా నటించిన పాప వెరోనికా నటన మెప్పిస్తుంది. సాంకేతికంగా సినిమా బావుంది. ముఖ్యంగా శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మార్కులు పడతాయి. ఎడిటింగ్ ఓకే. మొత్తం మీద హారర్ జోనర్‌లో వచ్చిన ఈ ‘కణం’ ఫర్వాలేదనిపిస్తుంది.

-రతన్