రివ్యూ

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*** నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
========================
తారాగణం:
అల్లు అర్జున్,
అను ఇమ్మాన్యుయేల్,
శరత్‌కుమార్, అర్జున్, సాయకుమార్, బొమన్ ఇరానీ,
రావు రమేష్, చారుహాసన్,
వెనె్నల కిషోర్, నదియా,
ప్రదీప్‌రావత్, పోసాని కృష్ణమురళి, అనూప్‌సింగ్ ఠాకూర్ తదితరులు.
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: రాజీవన్
సంగీతం: విశాల్-శేఖర్
సినిమాటోగ్రఫీ : రాజీవ్ రవి
సమర్పణ: కె. నాగబాబు
నిర్మాణం: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
నిర్మాత: లగడపాటి శిరీషా శ్రీ్ధర్
రచన, దర్శకత్వం:
వక్కంతం వంశీ

యువతలో మంచి క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. వరుస విజయాలతో యమజోష్ మీదున్న అతడి నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా ఏదో కొత్తదనం ఉండి తీరుతుందన్న గట్టి నమ్మకం.. ఆశ ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అల్లు అర్జున్ అనగానే స్టైలిష్ స్టార్ అనే విషయం గుర్తుకొస్తుంది. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు తనను తాను వౌల్డ్ చేసుకున్న విధానాన్ని ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. తన నటనతో, డ్యాన్సులతో వెండితెరపై మెరుపులు మెరిపిస్తూ.. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ సాగిపోతున్న అతడి తీరు అందర్నీ ఆకట్టుకునేలా చేస్తోంది. గత ఏడాది ‘దువ్వాడ జగన్నాథమ్’తో అలరించిన బన్నీ ఈసారి ఓ విభిన్న కథాంశంతో పలకరించాడు. అదే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీని తొలిసారి దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రమిది. అల్లు అర్జున్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆర్మీ నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్నప్పుడే చిత్రంపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్, పాటలు వచ్చి ఈ అంచనాలను మరింత పెంచేశాయి. సైనికుడి పాత్ర అంటే మాటలు కాదు.. చేతలు కావాలి. అలాంటి చేతల్ని మరి బన్నీ ఏ మేరకు చూపించాడు? తన జోరును అలాగే కొనసాగించాడా? తొలిసారి మెగాఫోన్ పట్టిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా? ఆరంభం నుండి భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని నిజాయితీగల సోల్జర్ సూర్య (అల్లు అర్జున్) హెడ్ క్వార్టర్స్ నుంచి బోర్డర్‌కి వెళ్లాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఎప్పటికైనా సరిహద్దులకెళ్లి దేశం కోసం యుద్ధం చేయాలనే బలమైన ఆశయం కలిగిన వ్యక్తి అతడు. అందుకోసం నిరంతరం కష్టపడుతుంటాడు. ఎదుటివారు చిన్న తప్పు చేశారని తెలిసినా తట్టుకోలేడు. కోపం వస్తే ఎదుటివారు ఎవరున్నా తనకు అనవసరం అన్న రీతిలో వ్యవహరిస్తుంటాడు. ఆ వ్యవహారంలో గొడవలు పడుతుంటాడు. ఆ గొడవలతోనే కుటుంబానికి దూరమైన సూర్య దేశభక్తిని నరనరానా నింపుకుని సైన్యంలో చేరతాడు. ఓసారి తనకున్న అతికోపం, ఆవేశం కారణంగా సైనిక నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉగ్రవాదిని కాల్చి చంపేస్తాడు. అదే అదనుగా తీసుకున్న కల్నల్ (బొమన్ ఇరానీ) సూర్యను ఆర్మీ నుంచి బయటికి పంపించేస్తాడు. తిరిగి ఆర్మీలోకి రావాలన్నా, బోర్డర్‌కి వెళ్లాలన్నా దేశంలో ప్రముఖ సైక్రియాటిస్ట్ రామకృష్ణంరాజు (అర్జున్) పర్యవేక్షణలో ఉండి, అతడిచేత అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నట్లు సర్ట్ఫికెట్ తీసుకురమ్మని చీఫ్ సూర్యని ఆదేశిస్తాడు. దాంతో సూర్య రగిలిపోతాడు. తన గాడ్‌ఫాదర్ (రావురమేష్)ను సంప్రదిస్తాడు. అందరూ కలిసి వైజాగ్‌లో ఉన్న సైక్రియాస్ట్ వద్దకు వెళ్లి సర్ట్ఫికెట్ తీసుకురమ్మని చెబుతారు. దాంతో వారి సలహా సూచనల మేరకు వైజాగ్ చేరుకుంటాడు సూర్య. అక్కడ అతడికి వర్ష (అను ఇమ్మాన్యుయేల్) పరిచయమవుతుంది. సూర్య ఆమె ప్రేమలో పడతాడు. అలా సర్ట్ఫికెట్ కోసం రామకృష్ణంరాజు వద్దకు వెళ్లిన సూర్య తన ప్రవర్తన ఎలా మార్చుకున్నాడు? అత్యంత కోపంతో తిరిగే అతడు మారాడా? సూర్యను రామకృష్ణంరాజు ఎలా మార్చాడు? విలన్ చల్లా (శరత్‌కుమార్) సూర్య జీవితంలోకి ఎలా ప్రవేశించాడు? ఇంతకీ సూర్య, రామకృష్ణంరాజుల బంధం ఎలాంటిది? అనుకున్న లక్ష్యాన్ని అతడు చేరుకున్నాడా? లేదా? అనేదే సినిమా.
మనం ఇండియాలో ఉండటం కాదు.. మనలో ఇండియా ఉందా? అని ప్రశ్నించుకునేలా దేశభక్తి ప్రధానంగా సాగుతుంది కథ. అర్థవంతమైన కథా, కథనాలతో తెరకెక్కిన చిత్రం సరిహద్దులోనేకాదు.. మనలోనూ మనకు శత్రువులు ఉన్నారని చెబుతుంది. దేశ సరిహద్దులకు వెళ్లి దేశం కోసం నిలవడమే తన కల అనుకున్న ఓ సైనికుడి చుట్టూ పరిస్థితులు ఎలా ప్రభావితం చేశాయన్నది ఆసక్తికరం. ఆర్మీ క్యాంపు నేపథ్యంలో మొదలయ్యే కథలో కథానాయకుడి తీరును చూపిన విధానం, సాగే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
ఆలోచనలో మునిగేలా చేస్తాయి. కథ ఆర్మీ క్యాంపు నుంచి వైజాగ్ చేరాక ఆసక్తికరంగా ఉంటుం ది. ప్రతీ సన్నివేశం సహజత్వానికి అద్దం పడుతుంది. ప్రథమార్థంతో పోలిస్తే, ద్వితీయార్థంలో వచ్చే సన్నివేశాలు ఊహకు అందేలా సాగినా, భావోద్వేగాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దేశభక్తి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలకు థియేటర్‌లో చప్పట్లే చప్పట్లు.. ఈలలే ఈలలు..
తొలిసారి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీలో పరిణతి తెరపై ప్రతీ సన్నివేశంలో కనిపిస్తుంది. రచయితగా, దర్శకుడిగా వంశీకి మంచి మార్కులే పడతాయి. సూపర్‌హిట్ కథలు అందించిన వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే డిఫరెంట్ కానె్సప్ట్‌ను ఎంచుకున్నాడు. బన్నీని అభిమానులకు అంతే డిఫరెంట్ మేకోవర్‌లో చూపించాడు. లుక్ పరంగానే కాదు.. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్ చేసినా రొమాన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సినిమాకు ప్రధాన బలమైన సూర్య పాత్రను దర్శకుడు మలిచినతీరు బావుంది. కోపం, బలం, దేశభక్తి, ప్రేమ వంటి లక్ష్యాలు కలగలిసిన సూర్య పాత్ర స్క్రీన్‌మీద కనపడుతున్నంతసేపూ చూసే వాళ్లలో ఒక రకమైన కసి కనిపిస్తుంది. అంతగా ఆ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాడు దర్శకుడు వంశీ.
ఇక నటీనటుల విషయానికొస్తే.. ఇది అల్లు అర్జున్ వన్‌మెన్ షోగానే చెప్పాలి. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న బన్నీ సోల్జర్ సూర్యగా ప్రతాపానే్న చూపాడు. మాస్ హీరో నుంచి ఆశించే ఫైట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో బన్నీని చూస్తే.. ఓ సినిమాలో పాత్ర కోసం తనను తాను మార్చుకోవడానికి పడ్డ తపన కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా సూర్యగా యాక్షన్ సీన్స్‌ని అదరగొట్టాడు. గమ్యం ఒకటే కాదు.. సాగే ప్రయాణం కూడా బాగుండాలని.. క్యారెక్టర్ కోసం కలను సైతం వదులుకున్న ఓ సైనికుడి పాత్రలో బన్నీ పరకాయ ప్రవేశం చేశాడు. కథానాయకుడి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కోపం వున్న సైనికుడిగా అతడి హావభావాలు బాగుంటాయి. ఫైట్స్, డ్యాన్సుల్లోనూ తన ప్రత్యేకతను మరోసారి చాటాడు. బన్నీ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. రొమాంటిక్ సీన్స్‌లోనూ తన మార్క్ చూపించాడు. అతడు తన నటనలో చూపించిన తీవ్రత సోల్జర్ సూర్య పాత్రను చాలా కాలం పాటు గుర్తుండి పోయేలా చేసింది. మాట్లాడే విధానం, నడక, డ్రెస్సింగ్ సీన్స్, రొమాన్స్, కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలు అన్నింటిలోనూ బన్నీ తన స్టైల్‌ని ప్రదర్శించాడు. ‘దేశానికి శత్రువులు ఎక్కడో తయారవ్వరు మన దేశంలోనే మనం చేసే తప్పుల వలనే తయారవుతారు. వ్యక్తిత్వం వదిలేస్తే ప్రాణాలు వదిలేసినట్లే..’ వంటి సున్నితమైన అంశాలతో సాగిన ఈ చిత్రంలో సూర్యగా బన్నీ ప్రదర్శించిన నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. వర్షగా అను అమ్మాన్యుయేల్ గ్లామర్‌గా కనిపించి నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో భావోద్వేగాలు కూడా పండించింది. చల్లాగా శరత్‌కుమార్, కార్గిల్ పోరాటంలో కాలు కోల్పోయిన సైనికుడు ముస్త్ఫాగా సాయికుమార్, సైక్రియాటిస్ట్ రామకృష్ణంరాజుగా అర్జున్, సూర్య గాడ్‌ఫాదర్‌గా రావురమేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి మెప్పించారు. మరో విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నదియా, బొమన్ ఇరానీ, వెనె్నల కిషోర్, పోసాని కృష్ణమురళి, ప్రదీప్‌రావత్ పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ సినిమాకు న్యూలుక్‌ను తెచ్చింది. ఆర్మీ నేపథ్యాన్ని చూపిన విధానం ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ సంగీతం ప్రధాన ఆకర్షణ. అటు పాటల పరంగా, ఇటు నేపథ్య సంగీతం పరంగానూ చక్కటి ప్రతిభ కనబరిచి బన్నీ ఎనర్జీకి తగ్గట్టు ట్యూన్స్‌తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడీ ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకుని సినిమా స్థాయిని మరింత పెంచారు. ఐయామ్ లవర్ ఆల్‌సో.., దిల్లే ఇండియా పాటలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. ఫైట్‌మాస్టర్ రామ్-లక్ష్మణ్, కెచ్చ, పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ స్టంట్స్ అదిరిపోయేలా వున్నాయి. లగడపాటి శిరీషా శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మొత్తం మీద అల్లు అర్జున్ నట విశ్వరూపం.. వక్కంతం వంశీ కథా, కథనాలు.. ఆర్మీ నేపథ్యం.. భావోద్వేగాలు ఇవి సినిమాకు ప్రధాన బలాలుగా నిలచి కట్టిపడేశాయి. *

--ఎం.డి అబ్దుల్