రివ్యూ

ఆకట్టుకోని ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మెహబూబా

తారాగణం:
ఆకాష్ పూరి, నేహాశెట్టి,
షాయాజీషిండే, మురళీశర్మ,
అశ్విని, కల్సేకర్ తదితరులు.
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖి
సంగీతం: సందీప్ చౌతా
సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ
నిర్మాణం: పూరీ కనెక్ట్స్,
పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
పూరి జగన్నాథ్
మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు పూరీ జగన్నాథ్ తన వరుస పరాజయాలకు ఫులిస్ట్ఫా పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. అందుకే ఆయన తనయుడు ఆకాష్‌ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ నిర్మాణంలో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇండో-పాక్ ప్రేమకథ అంటే ప్రేక్షకులకు కాస్త ఎక్కువ ఆసక్తి ఏర్పడుతుందన్న ఆలోచనతో 1971 యుద్ధ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. అందులోను పూర్వజన్మల నేపథ్యం కూడా ఉండడం విశేషం. ఇక పూరీ జగన్నాథ్ సినిమా, అందులోనూ తన కుమారుడు హీరో కావడంతో ఆయన అభిమానులు సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. మరి ఆ ఆశలను ‘మెహబూబా’ తీర్చగలిగిందా? లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
దేశం మీద ప్రేమతో ఆర్మీలో చేరాలనే ప్రయత్నాల్లో ఉంటాడు రోషన్ (ఆకాష్ పూరి). కానీ అతన్ని గత జన్మ తాలూకు ప్రేమ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలోనే అతను హిమాలయాలకు ట్రెక్కింగ్‌కు వెళ్లగా తన గత జన్మ ప్రేమ గురించి తెలుస్తుంది.
గత జన్మలోని ప్రేయసి ఎక్కడుందో అని వెతుక్కుంటూ తన ప్రేమ జర్నీ మొదలుపెడతాడు. పాకిస్తాన్‌లో అఫ్రిన్ (నేహా శెట్టి)గా పుట్టిందని, ఆమె పాకిస్థాన్‌లో ఉందని, గ్రహించి ఆమెకోసం పాకిస్థాన్ వెళతాడు. అలా పాకిస్థాన్ వెళ్లిన రోషన్ గత జన్మలో కోల్పోయిన ప్రేమను ఈ జన్మలో పొందడానికి ఎలాంటి పోరాటం చేశాడు? అనేదే మిగతా కథ..
బాల నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆకాష్ ఈ చిత్రంలోనూ కథానాయకుడిగా బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ విషయాల్లో అలరించాడు. అయితే.. కథలోని హీరో పాత్ర ప్రకారంగా చూస్తే.. అతని వయసు కుదరలేదు. ఇంకాస్త వయసు పెరిగితే బాగుండేది. నటుడిగా మాత్రం కుర్రోడికి పేరుపెట్టాల్సిన అవసరం లేదు. నేహాశెట్టి చూడ్డానికి అందంగా ఉండి, అభినయం పరంగానూ ఆకట్టుకొన్నప్పటికీ.. ఆకాష్ పక్కన మాత్రం అతనికంటే వయసులో పెద్దదానిలా కనిపించింది. విలన్‌గా నటించిన విషురెడ్డికి చాలా సన్నివేశాల్లో లిప్‌సింక్ కుదరలేదు. లుక్స్‌పరంగా విలనిజం కూడా పెద్దగా ప్రదర్శించలేక పోయాడు. తల్లిదండ్రుల పాత్రలో షాయాజీషిండే, మరళీశర్మ, అశ్విని కల్సేకర్‌లు ఆకట్టుకొన్నారు. ఇక సాంకేతికత విషయానికి వస్తే.. దర్శకుడు పూరి ఎంచుకున్న గత జన్మ ప్రేమకోసం ఈ జన్మలో పోరాడటం అనే కానె్సప్ట్ బాగానే ఉన్నా, ఈసారి ఆయనిచ్చిన కొత్త ట్రీట్‌మెంట్ మాత్రం పెద్దగా వర్కవుట్ కాలేదని చెప్పాలి. ఆకట్టుకోలేని కథనం, ద్వితీయార్థంలో బలహీనమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సినిమా రిజల్ట్స్ తారుమారైంది. కానీ తన కుమారుడు ఆకాష్ పూరిని మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అందుకునే పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారాయన. సాధారణంగా పూరీ జగన్నాథ్ సినిమాలంటే ఆయన శైలి సంభాషణలు, హీరో క్యారెక్టరైజేషన్ కోసం మాత్రం థియేటర్‌కి వస్తారు జనాలు. అలాంటి పూరీ జగన్నాథ్ తన పంథా మార్చుకోవాలని ప్రయత్నించిన ప్రయత్నం బాగున్నా.. ఆ తీరు మాత్రం బాగోలేదు. ‘మెహబూబా’ సినిమా మొత్తానికి ఒక్కటంటే పూరీ జగన్నాథ్ మూమెంట్ లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. సందీప్‌చౌతా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడా బాగానే ఉన్నా పాటల విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జునైద్ సిద్ధిఖీ తన ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సింది. విష్ణుశర్మ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. పూరీ జగన్నాథ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ స్టోరీ లైన్. ఒక యువకుడు తన గత జన్మ ప్రేమను ఈ జన్మలో దక్కించుకోవడానికి పోరాడటం అనే పాయింట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. పూరి రాసుకున్న స్టోరీలైన్ బాగానే ఉన్నా దాన్ని పూర్తిస్థాయి సినిమాగా డెవలప్ చేసేందుకు ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకోలేక పోయింది.ప్రథమార్థంలో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మినహా మిగతా ఏవీకూడా ఎంటర్‌టైన్ చేయలేకపోయాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల గత జన్మ తాలూకు సన్నివేశాలైతే మరీ బోర్‌కొట్టించాయి. ద్వితీయార్థంలో ఎక్కువ రన్‌టైమ్‌ను ఆక్రమించిన ఈ పూర్వజన్మ ట్రాక్ యుద్ధనేపథ్యంలో నడుస్తూ ఏ కోశానా ఆకట్టుకోలేక పోయింది.

-- త్రివేది