రివ్యూ

జీలకర్ర బెల్లం ...మధ్యలో అహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు జీలకర్ర... బెల్లం

తారాగణం:
అభిజీత్, రేష్మ, రఘుబాబు, తదితరులు.
సంగీతం:
వందేమాతరం శ్రీనివాస్
నిర్మాతలు:
ఎ శోభారాణి, ఆళ్ళ నౌరోజీరెడ్డి
రచన, దర్శకత్వం:
విజయ్ శ్రీనివాస్
--

ఎల్‌బిడబ్ల్యూ (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అభిజీత్, రేష్మా జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై కొత్త దర్శకుడు విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జీలకర్ర బెల్లం’. టైటిల్ చూస్తే అచ్చమైన తెలుగు పెళ్ళికి నిర్వచనంలా అనిపిస్తున్న ఈ సినిమా కథా కమామీషు ఏంటంటే..?
కథ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన రాహుల్ (అభిజీత్), రేష్మ (మైథిలి)లు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ప్రేమనుంచి పెళ్లిద్వారా ఒక్కటైన ఈ జంట తమ జీవితం అనునిత్యం సుఖంగా సాగాలని కోరుకుంటూనే చిన్నచిన్న పొరపాట్లు, సమస్యలను ఇగోవల్ల పెద్దవిగా చేసుకుంటూ కలిసి బ్రతకలేక విడిపోవాలన్న నిర్ణయానికి వస్తారు. ఆ సమయంలోనే రాహుల్‌ను మరొక వ్యక్తి చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు. అసలు రాహుల్, మైథిలికి మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తాయి...? రాహుల్‌ను చంపాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరు..? చివరికి రాహుల్, మైథిలిలు తమ పొరపాట్లను తెలుసుకుని ఎలా కలుసుకున్నారు...? అన్నదే అసలు కథ.
ఇప్పటికే ఇలాంటి సమస్యలు సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి నేపథ్యం తీసుకుని చేసిన కథే అయినా దీన్ని సరిగ్గా తెరకెక్కించే విషయంలో దర్శకుడు అయోమయంలో పడ్డాడు. సినిమా చూస్తున్నంతసేపూ మనకు దగ్గరగా ఉన్నట్టే అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే ప్రేమికుల మధ్య సాధారణంగా తలెత్తే రెగ్యులర్ సమస్యలను, వారి ఇగోలతో వాటిని ఎలా పెద్దవి చేసుకుంటారో? ఎలా ఆలోచిస్తే ఆ సమస్యలను అధిగమించి ప్రేక్షకులు మంచి భార్యాభర్తలుగా ఉండగలరో వివరించిన తీరు బాగుంది. ఇక హీరో హీరోయిన్లు అభిజిత్, రేష్మ నటన జస్ట్ ఓకే. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సన్నివేశం, రామాయణ నాటకంతో భార్యాభర్తల బంధాన్ని చెప్పడం ఆకట్టుకున్న అంశాలు. సినిమా మొదటి భాగంలో హీరో హీరోయిన్ల మధ్య నచ్చే ప్రేమ సన్నివేశాలు బోరుకొడతాయి. దర్శకుడు చూపిన ఇద్దరు ప్రేమికులు ఎదుర్కొనే సమస్యలు సహజంగానే ఉన్నా అవి తలెత్తే సందర్భాలు అసహజంగా ఉండి ప్రేక్షకుడికి మిండుగు పడవు. అలాగే సినిమాలో కామెడీ ఉండాలన్న నియమాన్ని సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు తా.రమేష్, ఎమ్మెస్ నారాయణ, హీరో బాస్, అతని సెక్రటరీలతో పండించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టి విసుగు తెప్పించింది. లవ్ వర్సెస్ ఇగో అనే అంశం చుట్టూ తిరిగిన కథలో హీరో హీరోయిన్లు ఇద్దరిలో ప్రేమను చూపినా కూడా, హీరోయిన్ చుట్టూ మాత్రమే ఇగోని తిప్పడం అంత సమర్ధనీయం అనిపించదు. ఇక దర్శకుడు విజయ్ శ్రీనివాస్ తాను ఎంచుకున్న లవ్ వర్సెస్ ఇగో కానె్సప్ట్ చుట్టూ అల్లుకున్న ప్రేమికుల సమస్యలు, వాటిని వారు పెద్దవిగా చేసుకునే విధానాలను బాగానే రాసుకున్నా, దాన్ని తెరకెక్కించే విషయంలో మాత్రం కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఇంటర్వెల్ ముందు కామెడీ, ప్రీ క్లైమాక్స్‌కు ముందు తల్లిదండ్రుల ప్రేమ పేరుతో బోరింగ్ కథనాన్ని నడిపాడు. కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన కొన్ని డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ మైనస్సే. ఇక వందేమాతరం శ్రీనివాస్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అన్నట్టున్నాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సన్నివేశాలు సాగుతుంటాయి. ప్రేమకథతో కథను ప్రారంభించినా కూడా దర్శకుడు కథను చెప్పిన విధానం మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. పెద్దగా ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేసే సన్నివేశాలు లేకపోవడంతో ప్రేమకథలో ఉండాల్సిన ఒక లోతైన అనుభూతి మాత్రం కచ్ఛితంగా లోపించినట్టు అనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ప్రేమ కథలను ఇష్టపడుతూ రొమాంటిక్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకులకు మాత్రం తీవ్ర నిరాశే కలుగుతుంది.

-త్రివేది