రివ్యూ

ఫ్యామిలీ డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* అమ్మమ్మగారిల్లు
*
తారాగణం:
నాగశౌర్య, షామిలి, సుమిత్ర, రావు రమేష్,
శివాజీ రాజా, హేమ, సుధ, రవిప్రకాశ్,
షకలక శంకర్ తదితరులు.
సాహిత్యం: సిరివెనె్నల, భాస్కరభట్ల
కూర్పు: జె.పి
నేపథ్య సంగీతం: సాయికార్తీక్
సంగీతం: కళ్యాణ రమణ
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
నిర్మాణం: స్వాజిత్ మూవీస్
నిర్మాత: రాజేష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సూర్య
*
యువ హీరో నాగశౌర్య గత చిత్రం ‘్ఛలో’ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘అమ్మమ్మగారిల్లు’ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యువతరం హీరోలంటే కేవలం కాలేజీ కథలు, ప్రేమకథలే కాదు.. కుటుంబ కథల్లోనూ చక్కగా ఒదిగిపోతుంటారు. ఆ తరహా సినిమాలతో సక్సెస్‌ని సొంతం చేసుకొన్న కథానాయకులు చాలామందే ఉన్నారు. అందులో ముఖ్యంగా నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో యువహీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నాడు. కుటుంబ కథా చిత్రాలకు ఎప్పటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా కుటుంబ కథలు మళ్లీ మళ్లీ తెరకెక్కడం... వాటిని ప్రేక్షకులు ఆదరించడం వెనుక కారణం.. బంధాలు.. అనుబంధాల గొప్పతనాలే. ప్రతి ప్రేక్షకుడికి వేగంగా కనెక్ట్ అయ్యే విషయాలివి. కాకపోతే వాటి మధ్య సంఘర్షణ సరైన రీతిలో పండేలా చూసుకోవాలి. యువ కథానాయకులు సైతం ఇలాంటి చిత్రాల్లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. నాగశౌర్య కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. వేసవి సెలవులు రాగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది అమ్మమ్మగారి ఊరు. అక్కడ వున్న అనుబంధాలు.. ఈ అనుబంధాల నేపథ్యంలో దర్శకుడు సూర్య తెరకెక్కించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఒకప్పుడు బాలనటిగా ఆకట్టుకున్న షామిలి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. మరి సక్సెస్‌లతో మంచి ఊపుమీదున్న నాగశౌర్యకి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఎప్పటిలాగే కుటుంబ కథలో నాగశౌర్య ఎలా ఒదిగిపోయాడు? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
తూర్పు గొదావరి జిల్లాలో పిఠాపురం అనే పల్లెటూళ్లో ఓ ఉమ్మడి కుటుంబంలో మొదలవుతుంది కథ. ఆ ఊళ్లో రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర)గారిది ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు రవిబాబు (రావు రమేష్) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తికంటే అనుబంధాలు గొప్పవి. ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ కొడుకు వినడు. అలా ఓసారి జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్)పై చేయి జేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటాడు. అల్లుడుకి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో కలత చెందిన చలపతి మరణిస్తాడు. దాంతో కుటుంబం చెల్లాచెదురవుతుంది. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్ కొడుకు సంతోష్ (నాగశౌర్య)కు మాత్రం అమ్మమ్మ అంటే ప్రాణం. అమ్మమ్మతో అనుబంధం ఏర్పరచుకున్న అతడు అందర్నీ కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు? అమ్మమ్మ ముఖంలో సంతోషం ఎలా నింపాడు? అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని ఎవరు పంచారు? ఎప్పుడు పంచారు? తిరిగి వీళ్లంతా ఎలా కలుసుకున్నారు? వీటన్నింటికీ కథానాయకుడు చేసిన పనులేంటి? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.
అదే కుటుంబం.. అవే బంధాలు..తెలిసిన కథే. కానీ, హృదయాల్ని కదిలించే సన్నివేశాలు హత్తుకుంటాయి. చాలా రోజుల తర్వాత మరో స్వచ్ఛమైన కుటుంబ కథను చూసిన అనుభూతికి గురిచేస్తాయి. అమ్మమ్మగారిల్లు అని టైటిల్ చూసిన ప్రతి ఒక్కరికీ కథేంటో అర్థమైపోతుంది. అయితే ఇలా అందరూ ఊహించే కథే అయినా.. సరిగా ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మిన దర్శక నిర్మాతల గురించి మొదట చెప్పుకోవాలి. కొన్ని పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు దర్శకుడు సుందర్ సూర్య. కథలో ఏ మాత్రం కొత్తదనం కనపడకపోయినా.. కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా రావురమేష్, నాగశౌర్య పాత్రలను అల్లిన విధానం బాగుంది. మధ్యలో కథ కాస్త మందగమనంతో సాగడం, సంతోష్, సీత పాత్రల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లో బలం లేకపోవడం, కథలో పెద్ద మలుపులు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కాస్త ఇబ్బందిగా అనిపించాయి. ద్వితీయార్థంలో ‘లాక్ ది ఏజ్’ అనే ఎపిసోడ్ కాసేపునవ్వించి, కాసేపు ఏడిపించేసింది. ఈ విషయంలో దర్శకుడికి మంచి మార్కులే పడతాయి. హీరోకు, హీరోయిన్‌కు అనవసరమైన ఇంట్రడక్షన్ సాంగ్స్ పెట్టకుండా ఉన్న రెండు మూడు పాటలు కూడా అలా కథతో పాటు వచ్చి వెళ్తాయి. రసూల్ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ‘తులం బంగారం కాదు.. గుణం బంగారం కావాలి’ లాంటి డైలాగ్స్ సినిమాలో చాలానే వున్నాయి. ఎప్పటిలాగే నాగశౌర్య అందంగా కనిపించాడు. అమ్మమ్మకు మనవడిగా చక్కగా కుదిరిపోయాడు. అమ్మమ్మ బాధల్ని తీర్చే మంచి మనవడిగా, కుటుంబాన్ని కలిపే వ్యక్తిగా మెప్పించాడు. తన కామెడీ టైమింగ్ కూడా బావుంది. షకలక శంకర్‌తో కలిసి చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ‘ఓయ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన షామిలి ఇనే్నళ్ల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. నాగశౌర్య మరదలి పాత్రలో కనిపించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రావురమేష్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవలసింది ఈయన పాత్ర గురించే. ఇలాంటి పాత్రల్లో నటించడం ఆయనకు కొత్తేంకాదు. కుటుంబ కథలకు రావు రమేష్ ఎంత బలమో ఈ సినిమాతో మరోసారి చాటి చెప్పాడు. ఆవేశపరుడైన ఇంటి పెద్దకొడుకుగా ఏ2 కాంట్రాక్టర్ బాబూరావుగా ఆయన నటన హావభావాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించింది. మిగతా పాత్రల్లో శివాజీరాజా, హేమ, షకలక శంకర్, సుధ, మధుమణి, రవి ప్రకాష్, సుమన్, పోసాని, గౌతంరాజు, సమ్మెట గాంధీ అందరూ తమ పరిధి మేరకు చక్కటి నటనను కనబరిచారు. అయితే దర్శకుడు సుందర్ సూర్య తీర్చిదిద్దిన ఈ సినిమా స్లో నెరేషన్‌లో సాగడం ప్రేక్షకుడికి కాస్త అసహనంగా అనిపిస్తుంది. కళ్యాణ రమణ సంగీతం, సాయికార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తం మీద ఈ ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం నెమ్మదిగా సాగిన రొటీన్ ఫ్యామిలీ డ్రామా!

--రతన్