రివ్యూ

బోర్ కొట్టేసాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* రాజుగాడు
*
తారాగణం:
రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్,
రాజేంద్రప్రసాద్, నాగినీడు,
రావురమేష్, సితార తదితరులు
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: రాజశేఖర్, కథ: మారుతి
ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
నిర్మాత: సుంకర రామబ్రహ్మం
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనరెడ్డి
*
ఉయ్యాలా జంపాలా సినిమాతో తెరకు పరిచయం అయిన రాజ్‌తరుణ్ కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు, సినిమాలతో బిజీగా మారాడు. అయితే ఈమధ్య అతడిని వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దాంతో ఈసారి రాజుగాడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసేందుకు రెడీ అయ్యాడు. అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నూతన దర్శకురాలు సంజనరెడ్డి రూపొందించిన రాజుగాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ రాజుగారు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసాడో తెలియాలంటే కథల్లోకి వెళ్లాల్సిందే..
చిన్నప్పటినుండి తనకు తెలియకుండా తానే దొంగతనం చేసే అలవాటు క్లెప్టోమేనియా అనే జబ్బు ఉన్న రాజు (రాజ్‌తరుణ్) వరుస దొంగతనాలు చేస్తూ ఎప్పుడూ ఇబ్బందుల్లో పడుతూ ఇంట్లో వాళ్లకు కూడా తలనొప్పులు తెస్తాడు. తల్లి (సితార), కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి (రాజేంద్రప్రసాద్), ఎగువ మధ్యతరగతి లైఫ్ స్టైల్.. ఇలా అన్నీ ఉన్నప్పటికీ ఓ మాయదారి రోగం కారణంగా ఎప్పటికప్పుడు అల్లరి పాలవుతూ తల్లిదండ్రుల్ని టెన్షన్ పెడుతుంటాడు రాజు అలియాస్ రాజుగాడు. అలా క్లెప్టోమేనియా మూలాన కష్టాలు పడే రాజు తన్వి (అమైరా దస్తూర్)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ముఖ్యంగా తాను ప్రేమించిన అమ్మాయికి తన వీక్‌నెస్ తెలియకుండా దాయడం కోసం నానా ఇబ్బందులు పడుతుంటాడు. అయితే.. అమైరా తండ్రి నాగినాడు అబద్ధం ఆడినా, తప్పుచేసినా సహించలేడు. ఆ నాగినీడిని ఒప్పించడానికి తల్లిదండ్రులతో కలిసి రాజుగాడు ఏం చేశాడన్నది మిగతా కథ.
వరుసగా ఒకే తరహా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టించేలా చేసాడు రాజ్‌తరుణ్. తన నటనలోకాని, ఆహార్యంలో కానీ ఎలాంటి మార్పు లేకుండా ఇదివరకు అన్ని సినిమాల్లో చేసినట్టుగానే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయనకు పోటీగా రాజ్‌తరుణ్ పండించిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. చాలారోజుల తర్వాత రాజేంద్రప్రసాద్ ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేసిన సినిమా రాజుగాడు. భలే నవ్విస్తాడాయన ఈ చిత్రంలో. అసభ్యతకు తావు లేకుండా ‘అహనాపెళ్లంట’ రేంజ్‌లో నవ్వించాడు రాజేంద్రుడు. అమైరా అందం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజులుగా తెలుగులో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అమైరాకు రాజుగాడు బాగా కలిసొచ్చాడు. రెగ్యులర్ హీరోయిన్ రోలే అయినప్పటికీ తన ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. హీరో పాత్రకు క్లెప్టోమేనియా అనే జబ్బును ఆపాదించి ఎంటర్‌టైన్‌మెంట్ పండిద్దామనుకున్న దర్శకురాలు సంజనరెడ్డి ఆలోచన బాగానే ఉంది. ఆ పాత్ర ద్వారా కొన్నిచోట్ల ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది కూడా. కమెడియన్ పృధ్వి చేసిన కామెడీ అక్కడక్కడా కొన్ని నవ్వుల్ని పూయించగలిగింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
పైన చెప్పినట్టే దర్శకురాలు సంజన మంచి ఎంటర్‌టైనర్‌ను తీద్దామనే ఉద్దేశ్యంతో ఆసక్తికరమైన హీరో పాత్రతో స్టోరీలైన్‌ను రాసుకున్నారు కానీ దానికి అతి ముఖ్యమైన కథనాన్ని మాత్రం పేలవంగా తయారుచేసుకున్నారు. దీంతో అక్కడక్కడా మినహా చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోపీసుందర్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎం.ఆర్.వర్మ తన ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన పాత్రల్ని తొలగించి ముగింపును ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఓకె.
సినిమాలో ప్రధాన లోపం సరైన కథ లేకపోవడమే. దొంగతనం అలవాటును చేర్చి హీరో పాత్రను ఆసక్తికరంగా తయారుచేసిన సంజనరెడ్డి, దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకోవడంలో సఫలం కాలేదు. ఎక్కడెక్కడి సన్నివేశాలని కథనంలోకి బలవంతంగా ఇరికించడం మూలాన సినిమా ఫ్లో దెబ్బతింది.
హీరో పాత్రలోని లోపం ఆధారంగా గతంలో వచ్చిన ‘్భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ లాంటి సినిమాల్లో హీరో పాత్ర ప్రతి సందర్భంలోను ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందివ్వగలిగింది. కానీ ఈ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలలోనే హీరో పాత్ర నవ్వించింది కానీ పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా చివర్లో కొన్ని పాత సినిమాల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన కామెడీ నటుల ట్రాక్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షలా మారింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలైతే చిరాకు తెప్పించాయి. రాజేంద్ర ప్రసాద్ నటన, అక్కడక్కడా పేలిన కొన్ని కామెడీ సీన్స్, హీరో పాత్ర ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా బలమైన సన్నివేశాలు, లోపించిన కథనం. ఎక్కువ మోతాదులో కామెడీ లేకపోవడం, విసిగించిన క్లైమాక్స్ ప్రధాన బలహీనతలుగా ఉన్నాయి. ఆలోచన బాగున్నా ఆచరణ సరిగా లేదని చెప్పాలి.

-రతన్