రివ్యూ

యాక్షన్ థ్రిల్లర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు**ఆఫీసర్
తారాగణం:
నాగార్జున అక్కినేని, మైరా సరీన్,
బేబీ కావ్య, షాయాజీ షిండే,
అజయ్, ఫెరోజ్ అబ్బాసీ తదితరులు.
నిర్మాణం: ఆర్.కంపెనీ ప్రొడక్ట్
ఎడిటర్: అన్వర్ అలీ, ఆర్.కమల్
సంగీతం: రవిశంకర్
కెమెరా: ఎన్.్భరత్ వ్యాస్, రాహుల్ పెన్మత్స
నిర్మాతలు: రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర
రచన, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ
**
వరుస పరాజయాలతో ఉన్న విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ ‘ఆఫీసర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘వర్మలో విషయం తగ్గిపోయింది.. అప్పటి మార్కు అసలే లేకుండా పోయింది..’ అని అందరూ అనుకుంటున్న సమయంలో వర్మ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ‘ఆఫీసర్’ సినిమాను తాను అందరూ మెచ్చుకునేలా తీస్తానని. ఒక పక్క సెనే్సనల్ కాంబినేషన్.. మరో పక్క వర్మ ఛాలెంజ్ అన్ని సినిమాపై అంచనాలను బాగా పెంచాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘శివ’. తెలుగు సినిమాల్లో మైలురాయిలా నిలిచిన చిత్రమిది. ఆ తర్వాత ‘గోవిందా గోవింద’, ‘అంతం’ చిత్రాలు ఈ కాంబినేషన్‌లోనే వచ్చి అలరించాయి. ఈ మధ్య వస్తున్న వర్మ సినిమాలకీ, ‘ఆఫీసర్’కి తేడా ఒక్కటే.. అదే నాగార్జున ఒక్కడే! వర్మ సినిమాలో స్టార్‌ని చూసి చాలా కాలమవుతోంది. ‘శివ’ తర్వాత హీరోగా నాగార్జున ఎన్ని సినిమాలైనా చేసి ఉండొచ్చు. అలాగే వర్మ కూడా చాలా చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండొచ్చు. కానీ, వీరి గురించి చెప్పాల్సి వస్తే ‘శివ’ గురించి ప్రస్తావించకుండా మాట్లాడలేం. అంతటి క్రేజ్‌ని తెచ్చిన చిత్రం అది. మరి అలాంటి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రేక్షకులు కూడా కాస్త ఎక్కువే ఆశిస్తారు. మరి అంచనాలను ‘ఆఫీసర్’ అందుకున్నాడా? ఈసారి నాగ్‌ని వర్మ ఎలా చూపించాడు? వర్మఖాతాలో సక్సెస్ చోటుచేసుకుందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
ముంబైలో అండర్ వరల్డ్‌ను నామరూపాలు లేకుండా చేసిన పోలీస్ ఆఫీసర్ నారాయణ పసారి (ఫెరోజ్ అబ్బాసీ) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. పసారి ఒక చేత్తో మాఫియాను అంతమొందిస్తూనే మరో పక్క డబ్బుల కోసం కాంట్రాక్టు కిల్లింగ్ చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి ఓ బూటకపు ఎన్‌కౌంటర్ చేశాడని డిపార్ట్‌మెంట్ అనుమానపడుతుంది. దాంతో హైకోర్టు నారాయణపై ఓ స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ టీమ్‌కు హైదరాబాద్‌కు చెందిన శివాజీ రావ్ (నాగార్జున)ను పై అధికారిగా నియమిస్తారు. దాని విచారణ చేపట్టడానికి శివాజీ ముంబైకి చేరుకొని కేసును పరిశోధించి ఓ సాక్ష్యాన్ని సేకరిస్తాడు. శివాజీ విచారణలో ఆ ఎన్‌కౌంటర్ బూటకమని తేలుతుంది. దాంతో నారాయణ పసారిని అరెస్ట్ చేస్తారు. అతడు తన అరెస్ట్‌కు కారణమైన శివాజీపై కక్ష పెంచుకుంటాడు. అయితే నారాయణ జైళ్లో ఉండగానే సాక్షిని ఎవరో చంపేస్తారు. దాంతో ఆధారాలు లేకపోవడంతో అతడు నిర్దోషిగా బయటకి వస్తాడు. అదే సమయంలో ఓ అండర్‌వరల్డ్ టీమ్‌ను క్రియేట్ చేసి నగరంలో పేరు మోసిన వ్యక్తులను చంపించేస్తాడు. దాంతో ప్రభుత్వం ఓ స్పెషల్ ఎన్‌కౌంటర్ టీమ్‌ను ఏర్పాటు చేసి దానికి నారాయణను చీఫ్‌ను చేస్తారు. నారాయణ ఎంతో తెలివిగా వ్యవహరించి శివాజీకి, అండర్ వరల్డ్‌టీమ్‌కు సంబంధం ఉందని అందర్నీ నమ్మిస్తాడు. అప్పుడు శివాజీ ఏం చేశాడు? శివాజీకి, నారాయణ పసారికీ జరిగిన సంఘర్షణ ఏంటి? తనపై పడ్డ నింద నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు అనేదే సినిమా.
మాఫియా, అండర్‌వరల్డ్, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన కథను చక్కగా డీల్ చేయగలగడం వర్మకు బాగా తెలిసిన విద్య. ఈ విషయంలో అతడిని మించిన ఘనుడు మరొకరు లేరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ మూడు అంశాలను ఈ చిత్రంలో ఉండేలా చూసుకున్నాడు వర్మ. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ కథను ప్రారంభించాడు. ఫస్ట్ సీన్‌లో.. ఒక ముగ్గురిని ఈడ్చుకుంటూ కాళ్లపై యాసిడ్ పోసి, చిత్ర వధ చేస్తారు. ‘నేను మిమ్మల్ని మామూలుగా చంపను. టార్చర్ పెట్టి చంపుతాను’ అంటాడు విలన్. ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ముందుకెళ్లిన ‘ఆఫీసర్’.. నాగార్జున ఉన్నాడు కనుక ఈసారి వర్మ సినిమా బెటర్‌గా వుంటుందేమో అనే ఆశలకి పాతర వేయడానికి ఎక్కువ టైమ్ తీసుకోలేదు. ఈ సినిమాలో మొదటగా చెప్పుకోవాల్సింది హీరో నాగార్జున గురించి. శివాజీ పాత్రను సమర్థంగా పోషించడానికి నాగార్జున తన వంతు ప్రయత్నం చేశారు. తన నటనతో సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశారు. ఆఫీసర్‌గా చాలా ఫిట్‌గా కనిపిస్తూ నటుడిగా తన డ్యూటీ తాను సక్రమంగా చేసి పాత్రకు న్యాయం చేశారు. ఆయన నటనలో ఎలాంటి లోపం కనిపించదు. నారాయణ పసారి పాత్రలో కనిపించిన ఫెరోజ్ చాలా సహజంగా కనిపించాడు. వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు, సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నాగార్జున కూతురిగా కనిపించిన బేబీ కావ్య చక్కగా నటించింది.
ఆమెకు, నాగార్జున కు మధ్యన నడిచే తండ్రీ కూతుళ్ల తాలూకు ఎమోషనల్ ట్రాక్ బాగుంది. పోలీస్ అధికారిగా నటించిన షాయాజీ షిండే, అజయ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ పాత్రలు తప్ప మిగిలిన పాత్రలకు దర్శకుడు పైపై మెరుగులు దిద్ది వదిలేశాడు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంచుకున్న లైన్ ఆసక్తిగా ఉన్నా, దాన్ని మరింత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. తొలి అర్ధ భాగంలో కథను ఉద్వేగంగా ప్రారంభించి ద్వితీయార్థం మొత్తాన్ని తనకు తోచినట్టు తీసుకుంటూ వెళ్లిపోయాడు. డ్యూటీ నుంచి తొలగించిన విలన్ అనే పోలీసాఫీర్ మళ్లీ డ్యూటీలో చేరడం, హీరోను తన టీమ్‌లో సభ్యుడిగా చేసుకోవడం వంటి అంశాలను ప్రేక్షకులు మెచ్చే విధంగా చూపించలేకపోయాడు. ముఖ్యంగా వర్మ సినిమాల్లో ఉండే క్రైమ్ డ్రామా ఇందులో అస్సలు కనిపించలేదు. సినిమాకు మరో పెద్ద బ్యాక్‌డ్రాప్ ప్రతినాయకుడి పాత్ర. ఆ పాత్ర బలహీనంగా ఉండటమేగాక, అందులో నటించిన నటుడు కూడా ఏ ఒక్క సన్నివేశంలోనూ నాగార్జునకు ధీటుగా నిలబడలేకపోయారు. ఆ పాత్రలో తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న నటుడిని తీసుకుని వుండే బాగుండేది. ఇక చివర్లో హీరో, విలన్‌కి మధ్య ఫైట్ సీన్ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. మాఫియా బ్యాక్ గ్రౌండ్‌లో కథను తయారు చేసుకున్నప్పుడు మాఫియా ప్రభావం ప్రజలమీద ఎంత ఉంది లాంటి అంశాలను చూపెట్టాలి కానీ, సినిమాలో అలాంటి తీవ్రమైన అంశాలేవీ కనిపించవు. ఏవేవో పాత్రలు, ఒక దానితో ఒక దానికి పొంతనలేని సన్నివేశాలు, ఏ మాత్రం సెన్స్ వున్నట్టు అనిపించని సంభాషణలు, మధ్య మధ్యలో తుపాకులు, చెవులు దద్దరిల్లేలా సౌండ్ ఎఫెక్టులు.. ఇలా నడిచిపోతున్న సినిమాలో కొన్ని ముఖ్య ఘట్టాలు కూడా ఎలాంటి ఎఫెక్టులు లేకుండా జరిగిపోతుంటాయి. దర్శకుడిగా వర్మ తన పనిని సగం వరకే చేశాడు. అయితే సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వర్మ సినిమాలు ఎప్పుడూ సాంకేతికంగా చాలా బాగుంటాయి. ఈ సినిమాలో సరికొత్త కెమెరా యాంగిల్స్ చూసే అవకాశం దక్కింది. భరత్ వ్యాస్, రాహుల్ పెనుమత్స కెమెరా పనితనం బాగుంది. తొలి సగభాగంలో స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంది. ద్వితీయార్ధంలో దర్శకుడుగానే కాదు, కథకుడిగానూ ఆకట్టుకోలేకపోయాడు. పాటలకు పెద్దగా ఆస్కారం లేదు. అయినా రెండు పాటలు పెట్టారు. ఈ రెండు పాటల్లోనూ సంగీత దర్శకుడు రవిశంకర్ నిరాశపరచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బిస్వాస్ ఆకట్టుకున్నాడు. మొత్త మీద నెమ్మదిగా సాగే కథనం, పాటలు ప్రేక్షకులకు చికాకు పుట్టిస్తాయి. పోలీసాఫీసర్ అయిన విలన్.. మాఫియాతో చేతులు కలిపి హీరోపై పగ తీర్చుకోవాలని చేసే యత్నాలు సిల్లీగా తోస్తాయి. అయితే పాత్రల ఎంపిక, కెమెరా పనితనంలో వర్మ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ముంబై మహానగరాన్ని తన కెమెరాలో అందంగా బంధించాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువలు సోసోనే. తాను అనుకున్న కథను సిన్సియర్‌గా తెరకెక్కించిన వర్మ.. థ్రిల్లర్ సినిమాకు కావల్సిన వేగాన్ని మాత్రం అందించలేకపోయాడు. మొత్తం మీద కానె్సప్ట్ బాగానే వున్నా దాన్ని సినిమాగా తీయడంలో మాత్రం వర్మ మరింత కసరత్తు చేయాల్సింది. సరిగా లేని కథనమే సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది. చాలా కాలం తర్వాత పోలీస్ పాత్ర ధరించిన నాగార్జున చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ను చూడాలనుకునే వాళ్లకు మాత్రమే తప్ప, మిగతా వర్గాలకు అంతగా నచ్చకపోవచ్చు. ప్చ్..వర్మ!! బ్యాడ్‌లక్ ‘ఆఫీసర్’! *

-ఎం.డి. అబ్దుల్