రివ్యూ

మెప్పించే అభిమన్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు**అభిమన్యుడు
**
తారాగణం:
విశాల్, సమంత
అర్జున్, రోబో శంకర్,
ఢిల్లీ గణేశ్ తదితరులు
కెమెరా: జార్జి సి.విలియమ్స్
సంగీతం: యువన్ శంకర్‌రాజా

ఎడిటర్: రూబెన్
నిర్మాణం: విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ
నిర్మాత: విశాల్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్
**
తమిళంతోపాటు తెలుగులోను హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్న విశాల్, సినిమా సినిమాతో తన ఇమేజ్ పెంచుకుంటూనే ఉన్నాడు. విభిన్నమైన కథా కథనాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విశాల్ ఈసారి ప్రేక్షకులకు మంచి సందేశం అందించే ప్రయత్నం అభిమన్యుడుతో చేశాడు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో ‘ఇరుంబుతిరై’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అభిమన్యుడు పేరుతో తెలుగులో విడుదలైంది. మరి అభిమన్యుడిగా విశాల్ జనాలకు ఏమి చెప్పాడు అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్ కరుణాకర్ (విశాల్) తన కోపం కారణంగా ఆర్మీ నుండి సస్పెండ్ అయి యాంగర్ మేనేజ్‌మెంట్ టెస్ట్ కోసం సైకియాట్రిస్ట్ లత (సమంత)ను కలుస్తాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తరుణంలోనే తన చెల్లి పెళ్లికోసం తీసుకున్న లోన్ తాలూకు డబ్బును అతని తండ్రి అకౌంట్ నుండి హ్యాకర్స్ కొట్టేస్తారు. దాంతో ఆలోచనలోపడ్డ కరుణాకర్ ఆ డబ్బును ఎవరు దోచేశారు అనే విషయాన్ని ఇనె్వస్టిగేట్ చేస్తూ పోగా తనలాగా కొన్ని వేలమంది ప్రజల డబ్బును వైట్ డెవిల్ (అర్జున్) వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా హ్యాక్ చేసి దొంగిలించాడని తెలుస్తుంది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కరుణాకరన్‌కి ఆర్మీ ఇంటిలిజెన్స్ అండగా నిలుస్తుంది. అలా వైట్ డెవిల్ గురించి తెలుసుకున్న విశాల్ అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు, అతన్నుండి ప్రజల డబ్బును ఎలా వెనక్కు రాబట్టాడు అనేదే సినిమా.
కోపిష్టి మిలటరీ ఆఫీసర్‌గా విశాల్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అలాగే తనకంటే పదింతలు తెలివైన శత్రువును ఎదుర్కొనే ధీరుడిగా విశాల్ నటన అతడి కెరీర్ బెస్ట్ అని చెప్పచ్చు. ఫైట్స్ విషయంలో ఎప్పట్లానే సరికొత్తగా అలరించాడు. డాక్టర్ రతీదేవిగా సమంత మరోమారు అందం, అభినయంతో ఆకట్టుకుంది. పాత్ర చిన్నదే అయినప్పటికీ ఎక్కడా అందాల ప్రదర్శనకు తావు లేకుండా నిండైన చీర కట్టుతో అలరించింది సమంత. ఇక సైబర్ నేరస్థుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటన చాలా బాగుంది. ఆయన పాత్రవలనే సినిమాలో తీవ్రత కనబడింది. ఇక ద్వితీయార్థంలో అర్జున్, విశాల్‌కు మధ్య నడిచే ఇంటిలిజెంట్ వార్ తాలూకు సీన్లు కొన్ని ఆసక్తికరంగా సాగుతూ మంచి థ్రిల్ ఇచ్చాయి. విశాల్ తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేయగా సమంత తన స్క్రీన్ ప్రెజన్స్‌తో అలరించారు. సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే రాసుకున్న కథనే చెప్పాలి. దర్శకుడు మిత్రన్ ప్రస్తుతం సమాజానికి అతి పెద్ద ప్రమాదంగా పరిణమించిన సైబర్ క్రైమ్ ఆధారంగా రాసుకున్న కథ స్మార్ట్ ప్రపంచంలో పూర్తిగా టెక్నాలజీమీదే ఆధారపడి బ్రతికే మనుషుల్ని ఆలోచింపజేస్తుంది. వ్యక్తిగత సమాచారం ఎంతో విలువైనది. దాన్ని మనం ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆ నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎలా అక్రమాలకు పాల్పడుతున్నారు, డిజిటల్ టెక్నాలజీలోని లొసుగులేమిటి, మనకి తెలియకుండా మన జీవితాన్ని కొందరు వాళ్లకు కావాల్సిన విధంగా ఎలా మానిటర్ చేస్తున్నారు వంటి అంశాలను చాలా క్షుణ్ణంగా చెబుతూ వాటిని వివరించడానికి కథలో మిత్రన్ రూపొందించిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విఎఫ్‌ఎక్స్ వర్క్ కుదరడంతో హై స్టాండర్డ్స్ వున్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. సైబర్ క్రైమ్‌ను వివరించడానికి తయారుచేసిన విజువల్స్ బాగున్నాయి. జార్జ్ సి.విలియమ్స్ కెమెరా ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా కనిపించింది. యువన్ శంకర్‌రాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటర్ రూబెన్ ఫస్ట్‌హాప్‌లో కొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేయాల్సి ఉంది. ఇక దర్శకుడు మిత్రన్ విషయానికొస్తే పైన చెప్పినట్టు అతను ఎంచుకున్న కథ, సైబర్ సమస్యను వివరించిన తీరు చాలా బాగున్నా బలమైన సన్నివేశాలతో కథనాన్ని తయారుచేసుకుని దాన్ని ఆకట్టుకునే రీతిలో థ్రిల్లింగ్‌గా చూపించడంలో పూర్తిగా సఫలం కాలేకపోయారు. దర్శకుడు కథనాన్ని హీరో పాత్రమీద ఆరంభించిన తీరు బాగానే ఉన్నా, ఆ పాత్రలో క్లారిటీ లోపించడం ఇబ్బందిరకంగా అనిపించింది. మిత్రన్ కథానాయకుడి పాత్రను ఒక తరహాలో కాకుండా కాసేపు ఆవేశపరుడైన సైనికుడిగా, ఇంకాసేపు సామాన్యుడిలా, మరి కాసేపు దేశం వదలి వెళ్లిపోవాలనుకునే స్వార్థపరుడిగా పలు విధాలుగా మారుస్తూ నడపడంతో కథలో తీవ్రత లోపించింది.
‘అభిమన్యుడు’ చిత్రం కానె్సప్ట్ పరంగా చాలా గొప్పగా ఉంది. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎలా మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి అక్రమాలకు పాల్పడుతున్నారు, మనమంతా గొప్పగా ఫీల్ అవుతున్న టెక్నాలజీ మన వినాశనానికే ఎలా కారణమవుతోంది. స్మార్ట్ఫోన్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి వంటి అంశాలను మిత్రన్ వివరించడం, ఆసక్తికరంగా సాగే సినిమా ద్వితీయార్థం, అర్జున్ పాత్ర ఆకట్టుకోగా ముఖ్యమైన సన్నివేశాశాల్లో తీవ్రత లోపించడం, ఫస్ట్ఫా బోర్ కొట్టించడం వంటివి నిరుత్సాహానికి గురిచేశాయి. మొత్తంమీద ఆలోచన గొప్పగా ఆచరణ అంతంతమాత్రంగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఫర్వాలేదనిపిస్తుంది.

-త్రివేది