రివ్యూ

నా నువ్వే * బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
కళ్యాణ్‌రామ్, తమన్నా
సంగీతం: శరత్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
ఎడిటర్:టి.ఎస్.సురేష్
స్క్రీన్‌ప్లే: జయేంద్ర
నిర్మాత: కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి, మహేష్ కోనేరు
దర్శకత్వం: జయేంద్ర.

********************************

దాదాపు ఏడేళ్ల క్రితం సిద్ధార్థ్‌తో చేసిన 180 సినిమాతో దర్శకుడిగా మారిన సీనియర్ యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర రీ ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రం ‘నా నువ్వే’. కళ్యాణ్‌రామ్-తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే వున్నాయి. కళ్యాణ్‌రామ్ మొదటిసారి రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. అసలు నా నువ్వేలో ఎవరు మ్యాజిక్ చేశారన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
మీరా (తమన్నా) ఓ రేడియో జాకీ.. ఎప్పుడూ కలవకుండా కేవలం ఫొటో చూసి వరుణ్ (కళ్యాణ్‌రామ్)ను ప్రేమిస్తుంది. ఇద్దరిమధ్య ఏదో మ్యాజిక్ వుందని, అదే తమని కలపడానికి ప్రయత్నిస్తోందని నమ్ముతుంది మీరా. డెస్టినీ అనేది ఏదీ లేదని కేవలం మనం ప్లాన్ చేసుకున్నది మాత్రమే జరుగుతుందని నమ్ముతాడు వరుణ్. ఇలా భిన్న మనస్తత్వాలు కలిగిన వరుణ్-మీరాల ప్రేమ చివరకు ఫలించిందా లేదా అనేది అసలు కథ.
హీరో కళ్యాణ్‌రామ్ కొత్తగా ట్రై చేసిన క్లాస్ లుక్ బాగుంది. ఆయన సెటిల్డ్ ఫెర్‌ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది. కథానాయిక వైపు నుండి నడిచే ఈ ప్రేమకథలో కథానాయిక పాత్రను చేసిన తమన్నా చాలా బాగా నటించింది. ప్రతి ఫ్రేమ్‌లోను అందంగా కనిపిస్తూ అలరించింది. డెస్టినీని నమ్మి ఏ మాత్రం పరిచయం లేని అబ్బాయిని ప్రేమించే అమ్మాయి పాత్రలో ఆమె ఇమిడిపోయింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో, డ్యాన్సుల్లో తన హావభావాలతో ఆకట్టుకుంది. కళ్యాణ్‌రామ్ సరికొత్తగా కనిపించినా.. ఈ చిత్రంలో తమన్నా అందర్నీ డామినేట్ చేసింది. ఆమె నటన, అందం, డైలాగ్ డెలివరీ, డాన్స్ మూవ్‌మెంట్స్ చాలా బాగున్నప్పటికీ.. వాటి ప్లేస్‌మెంట్ సరిగా లేకపోవడంతో తమన్నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇక కళ్యాణ్‌రామ్ చూడ్డానికి సరికొత్తగా కనిపించినా.. సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో అలరించాలని ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కాకపోతే బెటర్ అనిపించుకున్నాడు.
ఇక టెక్నికల్ విషయాలకి వస్తే.. పి.సి.శ్రీరామ్ కెమెరా మ్యాజిక్ హీరోయిన్‌ను, సన్నివేశాలను అందంగా తయారుచేయగా, శరత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ బాగానే వుంది. పైన చెప్పినట్టు ప్రొడక్షన్ వేల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు జయేంద్ర కథను పేపర్‌మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్‌మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డెస్టినీ పేరుతో సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలావరకు లోపించింది. పైగా రొమాంటిక్ సినిమాలో రొమాన్స్ కూడా లోపించింది. హీరోయిన్ పాత్ర ప్రేమకథకు డెస్టినీని లింక్ చేయడం వంటి అంశాల్లో మాత్రమే ఆయన ప్రతిభ కనబడింది. కానీ సినిమా చూస్తున్నంతసేపూ మెదిలే ప్రశ్న ఒక్కటే.. పి.సి.శ్రీరామ్‌లాంటి సీనియర్ మోస్ట్ టెక్నీషియన్‌ను పెట్టుకొని పాటలకి సీజీ ఎందుకు చేయించారు? పోనీ ఆ సీజీ వర్క్ అయినా బాగుందా అంటే అదీ లేదు. ముఖ్యంగా ‘ప్రేమికా..’ పాటను ఎందుకంత విచిత్రంగా చిత్రీకరించారో అర్థం కాలేదు.
చివరగా.. డెస్టినీ ఆధారంగా ఒక ప్రేమకథను నడపడమనే దర్శకుడు జయేంద్ర ఆలోచన బాగున్నా దాన్ని స్క్రీన్‌మీద ప్రేక్షకుడ్ని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచే విధంగా ప్రొజెక్ట్ చేయలేకపోయారు. మొదటి అర్థ్భాగాన్ని హీరో హీరోయిన్ల పాత్రలను, వాటి స్వభావాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, డెస్టినీ ద్వారా వాళ్లిద్దరూ కలుసుకునేలా చేయడానికి ఖర్చుపెట్టేసిన దర్శకుడు సన్నివేశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రతి సన్నివేశం నామమాత్రంగానే వుంది. ఆరంభం నుండి చివరివరకు కథనం నిదానంగానే సాగింది తప్ప వేగం అందుకోలేదు. ఇక హీరోయిన్ పాత్రను అంత బలంగా రాసుకున్న ఆయన హీరో పాత్రలో మాత్రం క్లారిటీ మైంటెయిన్ చేయలేదు. హీరో ఇంటిలిజెంట్‌గానే కనిపిస్తుంటాడు కానీ కథను, కథనాన్ని మాత్రం నడపలేదు. సినిమా ఆద్యంతం డెస్టినీ చేతుల్లోనే ఉండటంతో ప్రేక్షకులకు ప్రధాన పాత్రలతో ట్రావెల్ చేసే సౌకర్యం లభించక సినిమా కంటెంట్‌తో కనెక్ట్ కాలేకపోయారు. ఇక ముగింపుతో సహా కీలకమైన సన్నివేశాలు చాలా నాటకీయంగా అనిపిస్తాయి.

-శ్రీ