రివ్యూ

సహజత్వానికి దగ్గరగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫర్వాలేదు** ఈ నగరానికి ఏమైంది?
**
తారాగణం:
విశ్వక్‌సేన్ నాయుడు,
సుశాంత్‌రెడ్డి, అభివ్ గోమఠం,
వెంకటేష్, కాకుమాను, అనీషా ఆంబ్రోస్,
సిమ్రన్ చౌదరి తదితరులు

సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవి తేజ గిరిజాల
నిర్మాత: డి.సురేష్‌బాబు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తరుణ్ భాస్కర్

**
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు కొత్త దర్శకుడు తరుణ్‌భాస్కర్. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని రెండో ప్రయత్నంగా ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ముందుకు వచ్చాడు. మీ గ్యాంగ్‌తో థియేటర్‌కి రండి చూస్కుందాం అని ఛాలెంజ్ చేసిన తరుణ్ భాస్కర్ చేసిన ఛాలెంజ్‌ని నిలబెట్టుకున్నాడా లేదా? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
ఒక మంచి షార్ట్ ఫిలిం తీసి.. ఆ షార్ట్ ఫిలిం ద్వారా ఫిలిమ్ మేకర్స్‌గా సినిమా పరిశ్రమలో సెటిల్ అవుదామనుకొంటారు నలుగురు కుర్రాళ్ళు. వివేక్ (విశ్వక్‌సేన్), కౌశిక్ (అభివ్ గోమటం), కార్తీక్ (సాయి సుశాంత్‌రెడ్డి), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను). కానీ ఈ నలుగురు స్నేహితులు ప్లాన్ చేసుకొన్నట్లుగా ఏదీ జరగకపోవడంతో.. వివేక్ ఐటి ఎంప్లాయ్‌గా సెటిలైతే, కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉపేంద్ర ఎడిటర్‌గా, కార్తీక్ ఓ బార్ మేనేజర్‌గా సెటిల్ అవుతారు. అయితే ఎవరికీ తాము చేస్తున్న ఉద్యోగాల్లో సంతృప్తి ఉండదు. ఏదో మిస్ అవుతున్నాం అని ప్రతిక్షణం ఫీల్ అవుతూనే వుంటారు. దానికితోడు వివేక్ లవ్ బ్రేకప్ అవ్వడంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్లి నలుగురి మధ్య కొంత దూరం పెరుగుతుంది. ఈలోపు కార్తీక్‌కి పెళ్లి సెట్ అవ్వడంతో.. మందు సిట్టింగ్‌లో కూర్చున్న వివేక్ అండ్ గ్యాంగ్ ఊహించని విధంగా గోవా చేరుకొంటారు. అనూహ్య పరిణామాల కారణంగా మళ్లీ ఓ షార్ట్ ఫిలిమ్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగేళ్ళ క్రితమే షార్ట్ ఫిలిమ్స్‌ను పక్కన పెట్టేసిన వివేక్ అండ్ టీమ్ మళ్లీ షార్ట్ ఫిలిమ్ తీయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? పోనీ ఈసారి సక్సెస్ అయ్యారా? ఈ నలుగురు స్నేహితులు చివరికి జీవితంలో ఏం సాధించారు? అన్న ప్రశ్నలకు జవాబే ఈ సినిమా. ముఖ్యంగా ప్రధాన పాత్ర వివేక్, అతని స్నేహితుడు కౌశిక్‌ల క్యారెక్టర్స్‌ను చాలా బాగా డిజైన్ చేశారు తరుణ్ భాస్కర్. వివేక్ పాత్రలో సీరియస్‌నెస్‌తో కొంత బాధను కూడా మిక్స్ చేసి చూపిన దర్శకుడు కౌశిక్ పాత్రను మాత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీతో సినిమా మొత్తం ఎంటర్‌టైన్ చేశారు. ఆ పాత్రలో మంచి టైమింగ్‌తో కూడిన అభినవ్ గోమఠం నటన చాలా ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ఫాలో మొదలయ్యే అతని కామెడీ సెకెండాఫ్ గోవా చేరుకొని సినిమా ముగిసే వరకు నవ్విస్తూ సరదాగా సాగిపోయింది. నలుగురు వ్యక్తులు నటించినట్లుగా ఎక్కడా కనిపించదు, అనిపించదు. నలుగురు నిజమైన స్నేహితులమధ్య వాళ్ళకి తెలియకుండానే కెమెరా పెట్టేస్తే ఎలా వుంటుందో అలా సాగుతుంది కథ. అన్నిటికంటే ముఖ్యంగా వివేక్‌తో మందు కొట్టేప్పుడు పక్కనే భయం భయంగా బిక్క మొహం వేసుకొని కూర్చునే సన్నివేశంలో అభినవ్ నటన సినిమాకి హైలెట్‌గా నిలుస్తుంది. అనీషా ఆంబ్రోస్, సిమ్రన్‌లు హీరోయిన్స్‌లా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కాకుండా కథలో భాగమై, కథనానికి ఊతమిచ్చారు. ఇక సపోర్టింగ్ నటులు కూడా అందరు సహజంగా కనిపిస్తారు. అందరు కొత్తవాళ్లే. కానీ వాళ్ళలో నటించారన్న ఫీల్ కనిపించదు. కొన్ని సినిమాలు చూసినపుడు సన్నివేశంతో సంబంధం లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కే విపరీతంగా కనెక్ట్ అయిపోతుంటాం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అందుకు కారణం వివేక్ సాగర్. అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. నికేత్ బొమ్మిరెడ్డి సింపుల్ కెమెరా యాంగిల్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చాలా సరదాగా చూస్తున్న సదరు ప్రేక్షకుడికి మాత్రమే కాదు చాలా సీరియస్‌గా చూస్తున్న విశే్లషకుడికి కూడా రాదు. అసలు లైటింగ్ అనేది అవసరం లేకుండా సినిమా తీయొచ్చా అని ప్రూవ్ చేశాడు. ఎడిటర్ రవితేజ గిరిజాల ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకుడికి కలిగించడానికి గట్టిగా ప్రయత్నించాడు కానీ ఫలితం కాస్తా తేడా కొట్టింది. స్క్రీన్‌ప్లేలో కన్ఫ్యూజన్ ఆడియన్స్‌కి క్లారిటీ ఇవ్వాలి. లేదా వాళ్లని కన్‌ఫ్యూజ్ చేసి ఎంటర్‌టైన్ చేస్తున్నామన్న క్లారిటీ ఎడిటర్‌కి ఉండాలి. ఈ మీమాంసలో ఎక్కడో చిన్న చిన్న తప్పులు దొర్లాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తన రైటింగ్ పవర్ చూపించారు. సాధారణమైన స్టోరీ లైన్‌ను తీసుకున్న ఆయన అందులో కొన్నాళ్లపాటు గుర్తుండిపోయే నాలుగు పాత్రల్ని రాసి, వాటి చుట్టూ సినిమాను నడపడానికి సరిపడే రీతిలో ఫన్నీ కథనాన్ని అల్లుకున్నారు. కానీ కథలో ఇన్‌వాల్వ్ చేయలేకపోయాడు. పైగా కథ, కథనం ‘జిందగీ న మిలేగీ దుబారా, దిల్ చాహతాహై, హ్యాంగోవర్’ చిత్రాలను తలపించడం కూడా ఒక మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒక రచయితగా ఈసారి బొటాబొటీ మార్కులతో పాస్ అయిన తరుణ్ భాస్కర్ ఒక ఫిలిమ్ మేకర్‌గా ఫెయిల్ అవ్వలేదు.
చివరగా తరుణ్ భాస్కర్ సృష్టించిన పాత్రలు అన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండటం, రాసిన సన్నివేశాలు, సంభాషణలు మంచి కామెడీని జనరేట్ చేస్తూ ఇంప్రెస్ చేసేలా ఉండటం, స్నేహితుల మధ్యన అనుబంధాన్ని ఎలివేట్ చేసే కొన్ని మూమెంట్స్, విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠంల పెర్‌ఫార్మెన్స్ వంటి అంశాలతో ఈ సినిమా యువతకు దగ్గరయ్యేదిగా ఉండగా కామెడీ పరంగా ఎలాంటి లోటు లేకుండా ప్రధాన పాత్ర వివేక్ ప్రేమలో పడటం, ప్రేయసితో అతని లవ్ జర్నీ, విడిపోవడం వంటి కీలకమైన అంశాలను సాదాసీదాగా చూపించారు. ప్రథమార్థం కూడా కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగింది. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా రెగ్యులర్ యాక్షన్ ఎంటర్‌టైనర్లను కోరుకునేవారిని, కుటుంబ ప్రేక్షకుల్ని పూర్తిగా సంతృప్తిపరచలేదు. కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపిస్తాయి.

-త్రివేది