రివ్యూ

దారి తప్పేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు
మాస్

తారాగణం:
ధనుష్, కాజల్ అగర్వాల్, రోబో శంకర్, విజయ్ ఏసుదాస్ తదితరులు.
సంగీతం:
అనిరుధ్
నిర్మాతలు:
పద్మాకర్‌రావు వాసిరెడ్డి
రచన, దర్శకత్వం:
బాలాజీ మోహన్
---

ఈ చిత్రంలో ఓ సందర్భంలో నాయకుడిని (్ధనుష్) నాయకి (కాజల్) ‘నిన్ను నేను లవ్ చేయాలంటే అసలు నువ్వెవరో తెలియాలి కదా? నువ్వేం చేస్తుంటావ్’ అని అడుగుతుంది. అందుకు ప్రతిగా ఆ హీరో ‘ఏముంది పొద్దునే్న నిద్రలేస్తాను. వీరణ్ణ (యజమాని) చెప్పిన పనులు (దందాలు) చేసేస్తాను. పావురాల సంగతి చూస్తాను. సాయంత్రం మందు కొడతాను. రాత్రి పడుకుంటాను. మళ్లీ ప్రొద్దున లేస్తాను. యజమాని...’ అంటూ చెప్తాడు. పైన చెప్పిన దాంట్లో ‘పావురాల నాదరిస్తాను’ అన్న ప్లస్ పాయింట్ తప్ప, మిగతావన్నీ మైనస్ పాయింట్లే. ఆ నాయకుడి వ్యక్తిత్వానికి, మరి అలాంటి వ్యక్తిత్వమున్న కథతో తయారైన ‘మాస్’ ఏ వర్గానికైనా ఎలా నచ్చుతుందనుకున్నారో ఎంతగా బుర్ర పగలకొట్టుకున్నా అర్థంగాని విషయం. ఇలాంటి అర్థం (పర్ధంకూడా) లేని చిత్రంలోని కథలోకి తొంగి చూస్తే...
ఆ వూళ్లో తన మాటే వేదంగా నడుపుతూ పోలీసుల్నే హడలెత్తించే మారి (్ధనుష్) వెనకనున్న ఓ గాంగ్‌వార్ హత్య కేసు తిరగదోడదామని ఇన్‌స్పెక్టర్ అర్జున్ (విజయ్ ఏసుదాసు) పూనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను ఎంతవరకూ విజయుడయ్యాడు? అసలీ ‘మారి’ ఎవరు? ఇన్‌స్పెక్టర్ అంతరంగం ఏమిటి? అన్నది మిగతా కథ. అసలు ఇందులో అర్ధంకాని విషయం, ఎంతగా నాయకుడు తప్పుడు దారిలో నడుస్తున్నా ఏదోక దశలో అతను చేసింది తప్పనో లేదా ఇకముందు అవి చేయనని చెప్పో సక్రమ మార్గంలోకి వెళ్లడం చేసి చివరకు మంచిదే విజయం అని మోటివేట్ చేయడం కమర్షియల్ సినిమాల ఒరవడి. వాటన్నిటినీ పూర్వపక్షం చేసేసిందీ చిత్రం. ‘వాడలా చేశాడు. నాకు కోపమొచ్చింది. కత్తితో పొడిచేశాను. వాడప్పుడు చావలేదు, కానీ తర్వాత ఎవరో చంపితే చచ్చిపోయాడు. అలా ఆ హత్య నా ఖాతాలో పడింది. అసలలా ఎవరైనా అంటే కోపంరాదా ఏమిటి?’ అంటాడు హీరో. అసలలా కోపం వస్తే పొడుచుకుంటూపోతే ఈ సమాజంలో సగంమంది హంతకులు, ఇంకో సగంమంది హతులూ అయిపోతారు. అందుకే అలాంటి మనస్తత్వం తప్పని చెప్పాలి. అలాగే ఇనస్పెక్టర్ క్యారెక్టర్ దగ్గరికొస్తే ఎంతటి కుటిల పనులకు వెనుకాడని వ్యకె్తైనా పోలీసు అధికారిగా ఇందులో చేసిన పనులు చేయడం తటస్థిస్తే ఆ వ్యవస్థనే మనం నమ్మలేం. ఆ రకంగా వీలుకాదు కూడా. సినిమా ప్రారంభంలో మారి నేపథ్యం చెప్పడం కోసం అవలంభించిన సుదీర్ఘ వాయిస్‌ఓవర్ చికాకు తెప్పించింది. ఇక మారి.. జైలునుంచి విడుదలైన తర్వాత నడిపిన సెకండాఫ్‌లో ఏంచేయాలో తెలియక ఏమేమో చేసేశాడు బాలాజీమోహన్ (దర్శకుడు). దీనివల్ల సినిమా నిడివి పెరిగింది తప్ప నాణ్యత పెరగలేదు. చివరకు తాను ప్రేమించే పావురాలను మట్టుబెట్టిన విలన్‌పై పోరాడడమే క్లైమేక్స్‌గా ఎంచుకున్నాడు. ఇది కథకు అంతగా బలం ఇవ్వకపోయినా, ఆ పోరాట దృశ్యాలు చిత్రీకరించిన విధానం మాత్రం బాగుంది. ఇంకో నచ్చే విషయం కాజల్ వంటి కాస్ట్లీ హీరోయిన్ ఉందికదా అని అదే పనిగా ధనుష్‌తో డ్యూయెట్లు పెట్టకపోవడం. మరో నావెల్టీ ఏమిటంటే కథానాయకుడు ఎలాంటి అవాంఛిత గుణాలతో భాసిల్లినా, కడకు కన్‌ఫర్మ్‌డ్‌గా నాయిక అతని పంచన చేరిపోతుందనుకున్న ప్రేక్షకుడి ఊహలకు భిన్నంగా ఇందులో ఇద్దరూ కలవకపోవడం. ‘నీకూ నాకూ సెట్టవుదులే’ అని హీరో హీరోయిన్‌తో అనడంతో సినిమా ఎండవుతుంది. నటీనటుల విషయానికి వస్తే ‘మారి’గా ధనుష్ తన కలవాటైన నటనతోపాటు, ఆటోడ్రైవర్ వేషంలో, సిగరెట్ విసరడంలోనూ మామ (రజనీకాంత్)ను అనుకరించిన ప్రయత్నం వగైరా స్పష్టంగా చూడగలం. అయితే గతంలో జాతీయ అవార్డుగ్రహీత కూడా అయిన ఈ నటుడి నుంచి మరింత బాధ్యతాయుత వ్యక్తిత్వమున్న పాత్రలను ఆశించటం ప్రేక్షకుల తప్పేంకాదని గ్రహించాలి. కాజల్‌కి ఇచ్చిన శ్రీదేవి పాత్రకు పరిధి తక్కువ. ఉన్నంతలో బానే నటించింది. ధనుష్ అనుచరుడు శనివారం పాత్రధారి బాగా నటించాడు. అతని పాత్రకిచ్చిన పంచ్ డైలాగులూ బావున్నాయి. ఇన్‌స్పెక్టర్ అర్జున్ పాత్రధారీ తన స్వభావం తెలిసేవరకూ బాగా నటించాడు. అనిరుధ్ బాణీలేం చెప్పుకోతగ్గవిగా లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. అనువాదం (ఈ చిత్రానికి మాతృక అయిన తమిళ చిత్రం ‘మారీ’ గతేడాది జూలైలో విడుదలైంది) విషయంలో ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. డైలాగ్ మాడ్యులేషన్ తమిళ వరసలోనే ఉంది. పాటల పదాలు కూడా యాంత్రికంగా రాసినట్లుంది. ‘నిజమైనా ఋజువులుండాలంటుంది’ అన్న అర్థంలో ఓ పాటలో వాక్యం సాగుతుంది. చెప్పిన అంశం వివాదానికి గురైతే నిజానికి ఋజువులుండాల్సి వుంటుంది. ఏదైనా ఒక చిత్రం మరో భాషలోంచి అనువదించేటపుడు దాంట్లో ఏదైనా ఒక అర్థవంతమైన విషయముండాలి. కానీ కేవలం ధనుష్- కాజల్‌కీ తెలుగు రాష్ట్రాల్లో వున్న సేలబులిటీనే ప్రమాణంగా తెలుగుకి తెచ్చేస్తే కాసులు కురిసేస్తాయి అనుకోడం తప్పుఅని ‘మాస్’ తేల్చేసింది.

-అనే్వషి