రివ్యూ

తేజ్.. ఐ హేట్ యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు* తేజ్..ఐ లవ్‌యూ
*
తారాగణం:
=======
సాయిధరమ్‌తేజ్,
అనుపమ పరమేశ్వరన్,
జయప్రకాష్ రెడ్డి, పవిత్ర లోకేష్,
పృథ్వీ తదితరులు

ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్
సంగీతం: గోపీసుందర్
నిర్మాణం: క్రియేటివ్ కమర్షియల్స్
మూవీ మేకర్స్
నిర్మాత: కె.ఎస్.రామారావు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్
*
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సాయిధరమ్‌తేజ్ ఈసారి మంచి ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్.. ఐ లవ్ యూ’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రం ‘తేజ్’ను వరుస పరాజయాలనుండి కాపాడిందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
తేజ్ (సాయిధరమ్ తేజ్) ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలోని అబ్బాయి. కొన్ని కారణాలవల్ల అతని పెదనాన్న తేజ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తాడు. దాంతో హైదరాబాద్‌లోని తన బాబాయ్ (పృథ్వీ) ఇంటికి వచ్చి తన ఫ్రెండ్స్‌తో కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ క్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్)ని చూసి ఇష్టపడతాడు. కానీ ఓ కారణంగా 15 రోజులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌గా నటించాల్సి వస్తుంది. ఇలా జరుగుతున్న సమయంలో తేజు నందినితో ప్రేమలోపడి ఇద్దరు ఒక్కటయ్యే క్రమంలో నందినికి యాక్సిడెంట్ అవ్వటం ఆమె గతంతోపాటు తేజుని కూడా మర్చిపోవటం జరుగుతుంది. తిరిగి నందినికి గతం గుర్తుకొస్తుందా? తన ప్రేమను బతికించుకోవడానికి తేజ్ ఏం చేశాడు? చివరికి తేజ్ నందిని ఒకటయ్యారా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
సాయిధరమ్ తేజ్‌కు వరుస ఫ్లాపుల కారణంగా డీలా పడ్డట్టున్నాడు. అందుకే.. సినిమా మొత్తంలో ఎక్కడా పెద్ద ఎనర్జిటిక్‌గా కనిపించడు. పైగా సీన్ టు సీన్‌కి కనీసం మీస కట్టులో కూడా కంటిన్యూటీ లేకపోవడం, డాన్సులు, ఫైట్లు పరంగా ఎక్కడా ఎనర్జీ, స్టయిల్ కానీ లేకపోవడం బాధాకరం. అనుపమకి ఉన్న క్యూట్ ఇమేజ్ ఈ సినిమాతో తగ్గిపోయింది. ఇప్పటివరకు అనుపమని చూసి భలే క్యూట్‌గా వుంది అంటూ మెచ్చుకొన్నవాళ్ళందరూ ఈ సినిమాలో ఈమె ఓవర్ యాక్షన్, బాడీలో రిథమ్ లేని డాన్సులు చూసి జీర్ణించుకోవడం కష్టమే. ముఖ్యంగా హీరోని టార్చర్ చేసే సన్నివేశాల్లో తన క్యూట్ హావభావాలతో ఆమె అకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోకి పెద్దమ్మగా చేసిన పవిత్రా లోకేశ్ పాత్ర బాగుంది. మొదటి అర్థ్భాగం కొంత సరదాగా నడవడానికి హీరోకి ఫ్రెండ్‌గా చేసిన వైవా హర్ష సినిమాకి బాగానే ఉపయోగపడ్డాడు. సినిమా బోర్ కొడుతుందన్నప్పుడల్లా హర్ష తన కామెడీ టైమింగ్‌తో కొంతవరకు రిలీఫ్ ఇవ్వగలిగాడు.
ప్రేమకథలను అద్భుతంగా తీయగలడని ప్రేక్షకులు కరుణాకరన్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో దెబ్బతీశాడు. ఈ సినిమాలో సరైన ఎమోషన్, ఫీల్ ఎక్కడా కలగలేదు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వరస్ట్. కామెడీ కోసం రాసుకొన్న లేదా క్రియేట్ చేసిన సన్నివేశాలన్నీ సహనాన్ని పరీక్షిస్తాయే తప్ప సినిమాకి ఏ రకంగా ప్లస్ అవ్వవు. కథకి కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే సీనియర్ ప్రొడ్యూసర్ ఈ కథను ఎలా అంగీకరించారు అన్న అనుమానం కలుగుతుంది. ఇక కరుణాకరన్ దర్శకత్వంతో పాటు గోపీసుందర్ రీరికార్డింగ్ కూడా ప్రేక్షకుల సహనాన్ని పూర్తి స్థాయిలో పరీక్షిస్తుంది. ఒక్క పాట కూడా గుర్తుంచుకొనే రీతిలో లేదు. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకోలేదు. సాంగ్స్ తీయడంలో స్పెషలిస్టు అయిన కరుణాకరన్ ఈ సినిమాలో తన మార్క్‌ను ఎక్కడా చూపించకపోవడం గమనార్హం. ఈ సినిమా విషయంలో ఎడిటింగ్, డిఐ, స్క్రీన్‌ప్లే లాంటి విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
దర్శకుడు ఎ.కరుణాకరన్ తన శైలిలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథను తెరకెక్కించబోయి ఘోరంగా విఫలమయ్యారు. ప్రేమజంట మధ్య ప్రేమ రొమాన్స్ లోపించడం, వాటికితోడు నెమ్మదిగా సాగే కథ, కథనాలు, చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటంతో ఈ సినిమా సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకోదు. గతం మర్చిపోయిన ప్రియురాలు తన ప్రియుడిని మళ్లీ ఎలా కలుసుకుంది లాంటి మంచి పాయింట్ ఉన్నా, దర్శకుడు కరుణాకరన్ సరిగ్గా వాడుకోలేకపోయాడు. మొదటి అర్థ్భాగాన్ని పాత్రలను, వాటి స్వభావాల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, హీరో హీరోయిన్లు కలుసుకోవటానికే ఖర్చుపెట్టేసిన దర్శకుడు సన్నివేశాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. హీరో పాత్రను కూడా ఫేక్ ఎమోషన్‌తో నింపేసి దర్శకుడు కథను బాగా సాగతీశాడు. ఇక ముగింపు సన్నివేశాలు కూడా సహజత్వానికి దూరంగా చాలా నాటకీయంగా రొటీన్‌గా అనిపిస్తాయి. మొత్తం మీద ‘తేజ్.. ఐ హేట్ యూ’ అనుకుండా ఉండలేం!

--త్రివేది