రివ్యూ

పరాజితుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజేత * బాగోలేదు

తారాగణం:
కళ్యాణ్‌దేవ్, మాళవికా నాయర్, మురళీశర్మ, తనికెళ్ల భరణి,
జయప్రకాష్, నాజర్, సత్యం రాజేష్, రాజీవ్ కనకాల,
ప్రగతి, కళ్యాణి నటరాజన్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు..
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
నిర్మాణం: వారాహి చలన చిత్రం
నిర్మాత: సాయి కొర్రపాటి, రజినీ కొర్రపాటి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాకేష్ శశి

**** *** ***** ***************

దర్శకుడు రాకేష్ శశి కథను రాసుకొన్న విధానం బాగుంది. కానీ హీరోకంటే కూడా ఈ సినిమాలో తండ్రి పాత్రను ఎలివేట్ చేయడం అనేది ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రధానాంశం. అయితే.. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. దర్శకుడు తనదైన టేకింగ్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయతే అది అంతగా వర్కవుట్ కాలేదు.

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం మెగా హీరోలదే హవా. ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఉండగా.. తాజాగా మెగా కాంపౌండ్ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘విజేత’. రాకేష్ శశి దర్శకత్వంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తుండటంతో విజేత సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయ. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కళ్యాణ్ తెరంగేట్రానికి కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాకేష్ శశిని దర్శకుడిగా ఎంచుకున్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో కళ్యాణ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ఫిక్స్ అయిన మెగా ఫ్యామిలీ ఓకే చెప్పింది. మరి మెగా అల్లుడు ఎలా విజేతగా నిలిచాడు? తొలి సినిమాతో కళ్యాణ్ ఆకట్టుకున్నాడా? వారి నమ్మకాన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా? అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
శ్రీనివాసరావు (మురళీశర్మ) ఓ మధ్యతరగతి వ్యక్తి. తనకు ఇష్టంగా ఉన్న ఫొటోగ్రఫీ వృత్తిని తన కుటుంబం కోసం త్యాగం చేస్తాడు. కనీసం తన కొడుకు రామ్ (కళ్యాణ్‌దేవ్) అయిన జీవితంలో నచ్చింది చేయాలనీ, పైకి ఎదగాలని కోరుకుంటాడు. కానీ రామ్ మాత్రం కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోడు. ఫ్రెండ్స్‌తో కలిసి జులాయిగా తిరుగుతూ కాలాన్ని వృథా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో.. ఎదురింట్లో ఉండే చైత్ర (మాళవికా నాయర్)ను ప్రేమిస్తూ ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ సమయంలో అనుకోని ఓ సంఘటనతో రామ్ తన బాధ్యత తెలుసుకొని, తండ్రి బాధను అర్ధం చేసుకుంటాడు. అదే సమయంలో రామ్‌కి తన తండ్రి గురించి ఓ నిజం తెలుస్తుంది. దాంతో పూర్తిగా మారిపోయిన రామ్ కుటుంబానికి తోడుగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత రామ్ కుటుంబం కోసం ఏం చేశాడు? వాళ్ల జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? కొడుకుగా రామ్, తండ్రి కలను ఎలా తీర్చాడు? రామ్ చైత్ర చివరకు ఒకటవుతారా? అన్నదే క్లైమాక్స్.
ఇక నటన పరంగా చూసుకుంటే హీరో కళ్యాణ్‌దేవ్ హావ భావాలు.. డైలాగ్ డెలివరీ లాంటి విషయంలో ఇంకా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నటీనటులు వస్తున్న ఈ రోజుల్లో కళ్యాణ్ చాలా మెరుగుపడాలి. కేవలం మెగా ఫ్యామిలీ బ్యాకప్‌తో హీరోగా ఎదగాలనుకుంటే మాత్రం కష్టం. ముఖ్యంగా అతని వాయిస్‌లో బేస్ కుదరలేదు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్ డ్రామాను ఎంచుకున్న కళ్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. ఇక తండ్రి పాత్ర లో మురళీశర్మ వందకి వంద మార్కులు సంపాదించడమే కాదు, సినిమాకి నిజమైన హీరోలా నిలిచాడు. ఆయన పలికించిన ఎమోషన్స్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మురళీశర్మనే. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా అతడు చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించాడు. కొడుకు కోసం ఏదైనా చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో ఆయన నటన చలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం?’, ‘కళ్యాణ వైభోగమే’ చిత్రాలతో నటిగా ప్రేక్షకుల్ని విశేషమైన రీతిలో ఆకట్టుకొన్న మాళవికా నాయర్ పాత్రకు ఈ చిత్రంలో ఓపెనింగ్‌లో ఉన్నం త ప్రాముఖ్యత ఆ తరువాత లేదు. చివరికి ఆమె పాత్ర కేవలం బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్‌గా మారిపోవడం విచిత్రంగా అనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించింది. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్, నోయెల్, కిరిటీ, మహేష్‌ల కామెడీ ఓ మోస్తరుగా ఉంది. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయప్రకాష్, రాజీవ్ కనకాల, సత్యం రాజేష్, పృథ్వీ తదితరులు తమ పాత్రలమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. దర్శకుడు రాకేష్ శశి కథను రాసుకొన్న విధానం బాగుంది. కానీ హీరోకంటే కూడా ఈ సినిమాలో తండ్రి పాత్రను ఎలివేట్ చేయడం అనేది ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే ప్రధానాంశం. అయితే..స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం తడబడ్డాడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. దర్శకుడు తనదైన టేకింగ్‌తో మెప్పించే ప్రయత్నం చేశాడు. తొలి భాగం హీరో ఫ్రెండ్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో పాటు ప్రేమకథతో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థాన్ని పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మలిచాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొక్కొరొకో సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సాంగ్ కూడా మంచి ఫీల్ క్రియేట్ చేస్తుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది గానీ సెకండాఫ్‌లో ఆయన కత్తెరకు ఇంకొంచెం పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సెంథిల్ కుమార్ కెమెరా, సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. చివరగా.. కథాపరంగా సాదాసీదాగా సాగే కథే అయినా దర్శకుడు రాకేష్ శశి కథను తెరకెక్కించే విషయంలో తడబడ్డాడు. కథనం నెమ్మదిగా సాగడం. ఫస్ట్ఫాను అన్నివిధాలా బాగానే నడిపిన ఆయన సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను సాగదీశాడు. కథకు అవసరంలేని కొన్ని కామెడీ సీన్స్‌పెట్టి, ఎమోషనల్ ఫ్లో ను పక్కదారి పట్టించాడు. అలాగే మొదటి భాగంలో లవ్‌ట్రాక్‌ను బాగా రాసుకున్న ఆయన రెండవ భాగంలో మాత్రం ఆ లవ్‌ట్రాక్‌ను గాలికొదిలేశాడు. దాంతో ‘విజేత’ పరాజితుడుగా మిగిలిపోయాడు.

-ఎం.డి. అబ్దుల్