రివ్యూ

మాస్ మసాలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 * బాగోలేదు

తారాగణం:
కార్తికేయ, పాయల్ రాజపుత్, రావు రమేష్, రాంకీ తదితరులు.
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటర్: ప్రవీణ్.కె.ఎల్
నిర్మాత: అశోక్‌రెడ్డి గుమ్మకొండ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ భూపతి

** ** *** ****************

అర్జున్‌రెడ్డి స్ఫూర్తితో చాలావరకు హీరోని రగ్గడ్‌గా ఉండే పాత్రలో నటింప చేయడానికి దర్శకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానికి రివర్స్‌గా హీరోయిన్‌తో రఫ్ వేషాలు వేయించి ఓ రియల్ ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు అజయ్ భూపతి.
కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. రియలిస్టిక్ కథాంశంతో ఈ కథ సాగుతుందని చెప్పాడు దర్శకుడు. మరి ఈ ఆర్‌ఎక్స్ హండ్రడ్ కథ కమామీషు ఏమిటో తెలియాలంటే కథలోకి వెళదాం..
శివ (కార్తికేయ) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే డాడీ (రాంకీ) అన్నీ తానై శివను పెంచుతాడు. శివను చూసుకునే విషయంలో డాడీ పెళ్లికూడా చేసుకోడు. అలా ఆత్రేయపురంలో ఉంటున్న శివ అక్కడే చిన్నా చితక పనులుచేస్తూ ఉంటాడు. ఈలోగా ఆ వూరి ప్రెసిడెంట్ (రావు రమేష్) కూతురు ఇంజనీరింగ్ పూర్తిచేసి ఆ ఊరికి వస్తుంది.. ఇందు (పాయల్ రాజపుత్) మొదటి చూపులోనే శివను ఇష్టపడుతుంది. ఆ తరువాత కావాలని అతన్ని టీజ్ చేస్తూ వెంటపడుతూ ప్రేమలోకి దింపుతుంది. ఆ తరువాత వారి ప్రేమ శారీరకంగా దగ్గరయ్యేలా చేస్తుంది.
ఆ తరువాత ఇందుతో డీప్ లవ్‌లో పడిపోతాడు శివ. ఆ తరువాత పెళ్లిచేసుకుందాం అని ఇందుని ఫోర్స్ చేయగా.. మా నాన్నకి చెప్పి ఒప్పిస్తానని వెళ్తుంది. ఆ తరువాత ఎంతకీ ఇందు రాకపోవడంతో అసలు విషయం తెలుసుకుంటాడు శివ. ఇందుకి పెళ్లిచేసి అమెరికా పంపించేశాడని తెలుసుకుని ప్రేమ పిచ్చోడిలా మారిపోతాడు. అసలు ఇందు ఇతన్నికాదని ఎందుకు పెళ్లిచేసుకుంది? శివని అంతలా ప్రేమించిన ఇందు ఎందుకు అతనికి కనబడకుండా తిరుగుతుంది? ప్రేమకోసం పిచ్చోడిలా మారిన శివ ఏంచేసాడు? లాంటి విషయాలు అసలు కథ.
సాధారణంగా ప్రేమకథ సినిమాల్లో ఎమోషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఎమోషన్స్ చాలా కీలకం. అయితే హీరో విషయంలో మాత్రం ఈ ఎమోషన్స్ కన్ఫ్యూజ్ అయ్యాయి.. ముఖంలో రౌద్రం అనే ఫీలింగ్‌ని వ్యక్తపరచడానికీ, ఏదో చిరాగ్గా ఉన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టడానికి చాలా తేడా ఉంది. ఈ చిన్న విషయంలో కొత్త హీరో ఇబ్బందిపడ్డ విషయం క్లారిటీగా తెలుస్తుంది. అందువల్ల చూసే ప్రేక్షకుడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో కూడా ఒక్క రొమాన్స్ సీన్స్‌లో తప్ప ఫర్వాలేదనిపించుకొన్నాడు కార్తికేయ. ఇక బోల్డ్ క్యారెక్టర్‌లో నటించిన పాయల్ రాజపుత్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో చక్కగా నటించింది. అవలీలగా నటించడంతోపాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈమె పాత్ర కొందరికే కనెక్ట్ అవుతుంది. ఈమె అందాల ఆరబోత విషయంలో చూపని మొహమాటం, రొమాంటిక్ సీన్స్‌లో పడని సిగ్గు కాస్త వైల్డ్ రొమాన్స్ ఇష్టపడే యువత మరియు ఒక సెక్షన్ ఆడియన్స్‌కు మాత్రం నచ్చుతుంది. కార్తికేయ, పాయల్ మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు. వారిమధ్య కెమిస్ట్రీకూడా బాగానే ఆకట్టుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో నటించిన రాంకీ కూడా డాడీ పాత్రలో ఒదిగిపోయారు. ఇక రావురమేష్ ఎప్పటిలాగే తనకు మాత్రమే సాధ్యమైన ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఆ మాడ్యులేషన్‌తో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి ముందుగా చెప్పినట్టు వర్మ శిష్యుడు కావడంతో అనుకోకుండానే వర్మ ప్రభావం పడింది. సినిమాటోగ్రాఫర్ మీద ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది. చాలా సన్నివేశాల్లోపెట్టిన కెమెరా యాంగిల్స్, బ్లాక్ అండ్ ఫ్రేమ్స్ వర్మ సినిమాలను తలపిస్తాయి. సైలెన్సర్‌కి కెమెరా పెట్టడం, మెట్లగుండా కెమెరాను పైకి కిందకి తిప్పడం వంటివి చూస్తే వర్మ గుర్తొస్తాడు. అయితే.. ఈ తరహా సినిమాకి కావాల్సిన రియలిస్టిక్ ఫీల్‌ను మాత్రం తన కెమెరా వర్క్‌తో తీసుకురాలేకపోయాడు రామ్. టింక్ అండ్ డిటి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఇక సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు ఓకే అనిపించాయి. ఫస్ట్ఫాలోనే అయిదు పాటలు వాడేయడంతో సెకండాఫ్‌కి ఒక ఐటెమ్‌సాంగ్ తప్ప మరో పాట మిగల్లేదు. ఫస్ట్ఫాలో స్టోరీ మొత్తం పాటలతోనే ముందుకు సాగడం కొంత ఇబ్బంది కలిగింది. స్మరన్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. విషయం లేని సీన్‌లోకూడా ఆయన తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మంచి హైప్ తెచ్చాడు. ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది కాకపోతే సెకండాఫ్‌లో కత్తెరకి ఇంకొంచెం పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అజయ్‌భూపతి ఈ సినిమా కథను నిజ జీవితం నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకోవడం విశేషం. ఒక్క హీరోయిన్ క్యారెక్టరైజేషన్ తప్ప సినిమాలో ఎక్కడా కొత్తదనం కానీ డిఫరెంట్ డీలింగ్ కానీ కనిపించదు. ముఖ్యంగా ఈ తరహా సినిమాలకు కావాల్సిన ఎమోషన్ అనేది ఎక్కడా కనిపించదు. కథాంశం బాగున్నా కథనం మాత్రం ఈ స్థాయిలో ఉండదు. అవసరానికి మించి మాస్‌మసాలా సన్నివేశాలు ఎక్కువైపోయాయి. పైగా సెకండాఫ్ అక్కడక్కడ బోర్‌కొడుతుంది. ఒక పెయిన్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులముందుకు వచ్చిన దర్శకుడు ఆ కంటెంట్‌ను అంతే గొప్పగా ఎలివేట్ చేయలేకపోయారు.
చివరగా.. ‘ఆర్‌ఎక్స్ 100’ అనేది ఒక రియల్ సంఘటనల స్ఫూర్తితో కథను రాసుకున్న దర్శకుడు దాన్ని అదే స్టైల్‌లో తెరకెక్కించి ఉంటే బాగుండేది. కానీ.. ప్రేక్షకుడికి కనెక్ట్‌అయ్యే అంశాలు, హీరోయిన్ పాత్ర లాంటి అంశాలు, కనెక్టివిటీ కానీ ఎమోషన్ ఉండడంతో ప్రేక్షకులు కథలోకి ఇన్వాల్స్‌కాలేరు. కేవలం హీరోయిన్‌ని లేడీ అర్జున్‌రెడ్డిలా చూపించడం, ఆమె అందాలను మొరటు శృంగార సన్నివేశాలను ఆస్వాదించడంకోసం సినిమా తీసినట్టుంది. దర్శకుడు అజయ్ భూపతి రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్, కూతురితో రావు రమేష్ మాట్లాడే సన్నివేశం ఇలా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సినిమాలో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కరువైంది. మొత్తం మీద పెద్దలకు మాత్రమే అనే విధంగా ఉంది.

-త్రివేది