రివ్యూ

..ప్చ్‌లవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవర్ * బాగోలేదు

తారాగణం:
రాజ్‌తరుణ్, రిద్ధికుమార్ రాజీవ్ కనకాల, శరత్ కేడ్కర్, అజయ్ తదితరులు.
ఎడిటర్: ప్రవీణ్‌పూడి
సంగీతం: అంకిత్ తివారి
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సమర్పణ: శిరీష్
నిర్మాణ సారథ్యం: దిల్‌రాజు
నిర్మాత: హర్షిత్‌రెడ్డి
దర్శకత్వం: అనీష్ కృష్ణ

*** **** ******************

‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో తెలుగు చిత్రసీమలో క్రేజీ హీరోగా మారిన నవతరం హీరో రాజ్‌తరుణ్‌కు వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి కుర్ర హీరోగా యువతరం ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే అలా కెరీర్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఈ మధ్య వరుస పరాజయాలు రాజ్‌తరుణ్‌ను టెన్షన్ పెడుతున్నాయి. దానికి ముఖ్య కారణం.. ఆయన నటనలో ఎలాంటి మార్పులేకపోవడంతో ప్రేక్షకులకు బోర్‌కొట్టేసాడు. తాజాగా ఈ కుర్ర హీరో మరోసారి ‘లవర్’గా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంచేసాడు. ‘అలా ఎలా..’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి లవర్‌గా రాజ్‌తరుణ్ ఏ మేరకు సఫలీకృతం అయ్యాడు? ఈ చిత్రం అయినా అతడిని ప్రేక్షకులకు మరోసారి దగ్గరకు చేర్చిందా? వరుస ఫ్లాపులతో కెరీర్‌ను కష్టాల్లో పడేసుకున్న ఈ క్రేజీ హీరో ‘లవర్’గా సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడా? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
అనంతపురం జిల్లాలో ఉండే మెకానిక్ రాజ్ (రాజ్ తరుణ్) ఓ అనాథ. రాష్ట్రంలోనే ఏకైక బెస్ట్ బైక్ మోడిఫైయింగ్ మెకానిక్‌గా క్రేజ్ తెచ్చుకుంటాడు. అలా బాగా డబ్బు సంపాదించి బ్యాంకాక్ వెల్లడమే ధ్యేయంగా కాలం గడుపుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో జగ్గు (రాజీవ్ కనకాల)ను తన సొంత అన్నగా భావించి వారి కుటుంబ ఆసరాతోనే పెరుగుతాడు. సరిగ్గా బ్యాంకాక్ వెళ్లడానికి సిద్ధమవుతున్న రాజ్ అనుకోని విధంగా హాస్పిటల్‌లో చేరడంతో ఆ డ్రీమ్ ట్రిప్ రద్దవుతుంది. అప్పుడే అదే హాస్పిటల్లో నర్స్‌గా పనిచేస్తున్న చరిత (రిద్ధికుమార్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు రాజ్. ఆమెను ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నంలో ఉండగా, చరిత మాత్రం అతన్ని పట్టించుకోదు. ఆ తర్వాత ఇతని ప్రేమను అర్థం చేసుకున్న చరిత.. రాజ్‌ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అలా వాళ్లిద్దరూ ప్రేమించుకోవడం మొదలయ్యాక.. ఉన్నట్లుండి చరితపై కొందరు రౌడీలు దాడి చేస్తారు, ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ రౌడీలు చరిత వెంట ఎందుకు పడుతున్నారు? చరితకు, లక్ష్మి అనే పాపకు సంబంధం ఏమిటి? రాజ్ వాళ్లనుండి చరితను ఎలా కాపాడుకున్నాడు? లాంటి విషయాలు మిగతా కథ.
రాజ్‌తరుణ్ గత తన సినిమాల్లోకంటే ఈ సినిమాలో కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా కనిపించాడు. ఓ పిలకతో కాస్త కొత్తగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఇన్నాళ్లు లవర్‌బాయ్ ఇమేజ్‌తో ఆకట్టుకున్న రాజ్‌తరుణ్ ఈ సినిమాతో మాస్ కమర్షియల్ హీరోగా అలరించేందుకు తెగతాపత్రయపడ్డాడు. ఇక చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడడానికి ప్రయత్నించాడు కానీ.. మాండలీకం, యాసమీద సరైన పట్టులేకుండా పోయింది. రాజ్‌తరుణ్ తన డైలాగ్ మాడ్యులేషన్‌ను మార్చుకోకపోతే.. ఇక ముందు ముందు కష్టమే. హీరోయన్‌గా నటించిన రిద్ధికుమార్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గ్లామర్‌తో బాగానే ఆకట్టుకుంది. తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెరమీద గ్లామర్‌గా కనిపించి ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరో..హీరోయిన్ని ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు, హీరోయిన్ తల్లికి హీరోకు మధ్య సాగే కేరళ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అన్నాయాన్ని ఎదిరించే చరిత క్యారెక్టర్‌లో రిద్ది మంచి నటన కనబరిచింది. రాజీవ్ కనకాల మరోసారి మంచి పాత్ర చేశారు. ఆయన తన నటనతో ఎమోషనల్ సీన్స్‌కూడా చాలా బాగా పండించారు. ఈ క్యారెక్టర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేరకు బాగాచేసారు. ప్రతినాయకులుగా అజయ్, సుబ్బరాజు రొటీన్ పాత్రల్లో కనిపించారు. మెయిన్ విలన్‌గా నటించిన శరత్ కేడ్కర్‌ది అతిధి పాత్రే. ఆయన తెరమీద కనిపించేది కేవలం రెండు మూడు సన్నివేశాల్లోనే. ఎప్పటిలాగే హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్, ప్రవీణ్, సత్య, రాజాలు తమ కామెడీ టైమింగ్‌తో మ్యానరిజమ్స్‌తో నవ్వించే ప్రయత్నం చేసారు.
‘అలా ఎలా’ చిత్రంతో హిట్‌కొట్టిన దర్శకుడు అనీష్ కృష్ణ ఎందుకు ఇంత సాదాసీదా కథకోసం నాలుగేళ్లు నిరీక్షించాడు? అనేది అర్థంకాని ప్రశ్నలా మిగిలిపోతుంది కదా. కథ-కథనాలు పక్కనపెట్టేస్తే.. కనీసం కథను నడిపించే విధానంలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. రొటీన్ కథే.. చాలా సాదాసీదాగా కమర్షియల్ ఫార్ములాతో సినిమా సాగిపోయింది. ‘అలా ఎలా’తో ఆశ్చర్యపరిచిన అనీష్‌కృష్ణ రెండో సినిమాతో మాత్రం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతరం ఆడియన్స్‌ను తీవ్ర నిరాశపరిచాడు. దర్శకుడు కథను పేపర్‌మీద రాసుకున్నంత అందంగా స్క్రీన్‌మీద ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఆయన కథనంపై ముఖ్యంగా ద్వితీయార్థంపై ఇంకొంచెం శ్రద్ధపెట్టి ఉంటే బాగుండేది. మొదటి భాగం సరదాగా సాగినా.. రెండవ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. దానికి కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలావరకు లోపించినట్లు అనిపిస్తోంది. వినోదం పాళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం వెలితిగా అనిపించింది. క్లయమాక్స్ కూడా అంతంత మాత్రమే. హడావిడిగా ముగించేశాడు. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఒక్కోపాటకు ఒక్కో సంగీత దర్శకుడు పనిచేయటం కొత్త ప్రయోగమనే చెప్పాలి. అయితే ఆ ఐదుగురు సంగీత దర్శకులు పనిచేసిన ఈ చిత్రంలోని పాటలు ఎక్కడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు ప్చ్.. అయిదుగురు సంగీత దర్శకులు ఇచ్చిన బాణీల్లో సాయికార్తీక్ స్వరపరిచిన ‘నాలో చిలిపి కల’ ఒక్కటే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. దిల్‌రాజు ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.
చివరగా.. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రాజ్‌తరుణ్‌కి ఈ ‘లవర్’ మరోసారి నిరాశ కలిగించేదే అవుతుంది తప్ప, ఏరకంగానూ ఉపయోగపడదు. దర్శకుడు రాజ్‌తరుణ్, సత్య, సత్యం రాజేష్ లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్‌లు ఉన్నా వారి టాలెంట్‌ని వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్లు కూడా చేసేదేమీ లేకపోయింది. రాజీవ్ కనకాల క్యారెక్టర్ మంచి ఎమోషనల్‌గా కనెక్ట్‌చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ క్యారెక్టర్‌ను ముగించిన విధానం అంత సంతృప్తికరంగా తోచదు. రాజ్‌తరుణ్, రిద్ధికుమార్ మధ్యసాగే కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ, మిగిలిన సన్నివేశాలను మాత్రం సాగదీశారనిపిస్తుంది. వాటికితోడు నెమ్మదిగాసాగే కథనం, బలమైన భావోద్వేగాలు పండించే సన్నివేశాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకి వస్తున్న ప్రేక్షకుడు మాత్రం ప్చ్..లవర్! అనకుండా ఉండలేడు.

-ఎం.డి. అబ్దుల్