రివ్యూ

‘ఆట’ అర్థం కాదు శివ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగదరా శివ * బాగోలేదు

తారాగణం:
ఉదయ్‌శంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, దీప్తి, చలాకీ చంటి, భద్రం,
చమ్మక్ చంద్ర, జ్వాలాకోటి, సందేశ్, సాహితీ, రమాదేవి తదితరులు.
ఎడిటర్: నవీన్ నూలి,
సంగీతం: వాసుకి వైభవ్
సినిమాటోగ్రఫీ: లవిత్
నిర్మాణం: రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్

** *** **** *********

కమర్షియల్ సినిమాలు ఎక్కువగా వచ్చే సినిమా రంగంలో కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు రావడం అన్నది చాలా అరుదు. అలాంటి చిత్రాలు రావాలంటే ముఖ్యంగా నిర్మాత ధైర్యం చేయాలి. దానికి ఆ కానె్సప్ట్‌ని చక్కగా తెరకెక్కించే దర్శకుడు కావాలి.. ఇలాంటి సినిమాలు తీయడం అన్నది కత్తిమీద సాము వంటిదే... అన్ని బాగా కుదిరినా కూడా ఒక్కోసారి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవచ్చు. ఈ తరహా కానె్సప్ట్‌బేస్డ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే చాలా కష్టమే. అయితే ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయ, లాంటి సాఫ్ట్‌కార్నర్‌లో సినిమాలు తీసి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. తాజాగా ఆయన చేసిన మరో ప్రయత్నం ‘ఆటగదరా శివ’. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. కన్నడలో విశే్లషకుల ప్రశంసలు అందుకొన్న ‘రామ రామరే’ చిత్రానికి ఇది రీమేక్. మరి ఆ శివుడి ఆటేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
వరుస హత్యల కారణంగా పోలీస్ కస్టడీలో ఉన్న బాబ్జీ (ఉదయ్) అనే నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. ఆ శిక్షనుంచి తప్పించుకోవడం కోసం జైల్‌నుంచి పారిపోతాడు బాబ్జీ. అలా బాబ్జి పారిపోతున్న క్రమంలో అదేదారిలో కలుస్తాడు జంగయ్య (దొడ్డన్న). జంగయ్య జీపులో బయలుదేరిందే బాబ్జీకి పడిన ఉరిశిక్షను అమలుచేయడానికి. ఎందుకంటే జంగయ్య ఓ తలారీ. కానీ.. ఒకరి గురించి ఒకరికి తెలియక ఒకే జీపులో ప్రయాణిస్తుంటారు. అలా అనుకోకుండా మొదలైనవారికి ప్రయాణంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కోసం ఊరినుంచి పారిపోతున్న ఆది-దీప్తిల జంట తారసపడుతుంది. వారి ప్రేమకు సపోర్ట్‌గా నిలుస్తాడు బాబ్జీ. ఈ నలుగురు కలిసి చేసిన ప్రయాణం చివరికి ఏ తీరానికి చేరింది? ఈ ప్రయాణ మార్గంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? ఇంతకీ బాబ్జీకి తలారీ జంగయ్య ఉరిశిక్ష వేయగలిగాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
కన్నడలో ప్రముఖ నటుడిగా గుర్తింపుతెచ్చుకున్న దొడ్డన్నకు ఇది మొదటి తెలుగు చిత్రం. ఈ పాత్రలో ఒక స్థాయివరకు బాగానే చేసినా కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన తేలిపోయింది. ఆయన పాత్రకి కాస్ట్యూమ్స్ పరంగా కంటిన్యుటీ మిస్ అయ్యింది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కళ్లల్లో నీరసం, బాడీలాంగ్వేజ్, పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు సరిగ్గా అర్థం చేసుకునేందుకు టైంపట్టేలా కనిపిస్తుంది. ఇక హీరోగా చేసిన ఉదయ్‌శంకర్‌కి తొలి చిత్రం కావడంతో నటనలో పరిణితి కనిపించదు.
ముఖ్యంగా అతడి ముఖంలో కనిపించాల్సిన ఏ ఫీలింగ్‌ని సరిగ్గా బయటపెట్టలేకపోయాడు. అతడి పాత్రవల్ల సినిమాలో క్రియేట్ అవ్వాల్సిన ఎమోషన్, డ్రామా, టెన్షన్ సినిమాలో ఎక్కడా కనిపించవు. ఇక హైపర్ ఆది పంచ్ డైలాగులు కొన్నిచోట్ల నవ్వించగా.. అతడి ప్రియురాలిగా నటించిన దీప్తి పాత్రతో ఆకట్టుకొంది. చలాకీ చంటి, భద్రం తదితరులు నవ్వించడానికి ప్రయత్నించారు. పోలీస్ పాత్రలో ‘కీచక’ఫేమ్ జ్వాలకోటి కాస్త ఓవర్ యాక్షన్ చేసాడు.
ఈ సినిమాకు ప్రధాన పాయింట్ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ఎంచుకున్న కథ, ఆ కథానేపథ్యం.. బతుకు చావులమధ్య సంఘర్షణతో సాగే కథాంశంతో సినిమాలు చాలా అరుదుగా తెరకెక్కుతాయి. పైగా చచ్చేవాడు (ఖైదీ) చంపేవాడు(తలారీ) కలిసి చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ముఖ్యంగా అపారమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న మామూలు మనుషుల మనస్తత్వం, వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయో, నిజ జీవిత అనుభవాల్లోని సంఘటనలు ఎంత నాటకీయంగా ఉంటాయో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ సాధ్యమైనంత వాస్తవికత దృక్పధంతో చూపించే ప్రయత్నం చేశారు. కథాంశం మంచిదే తీసుకున్నప్పటికీ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్, కథ కథనాన్ని మాత్రం చాలా నెమ్మదిగా నడిపించారు. పాత్రల మధ్య ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో ఒక సగటు సినిమాలా మారింది. కన్నడ ‘రామ రామరే’ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయడం అవసరమే అయినప్పటికీ.. ఒరిజినల్ సినిమాలోని సోల్‌ను మిస్ అయ్యారు. దర్శకుడు కథనం మీద ఇంకొంచెం కేర్ తీసుకొని, సినిమాని ఇంకాస్త ఉత్కంఠ భరితంగా మలిచి ఉంటే బాగుండేది. ఇక ప్రధాన పాత్ర బాబ్జీ సినిమా ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్‌వరకు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు తప్ప, అతను సినిమాలో చేసింది ఏమీలేదు. పైగా లోలోపలే బాధపడుతున్నట్లు కనిపిస్తున్నా, అసలు అతను ఎందుకు బాధపడుతున్నాడో తెలియకపోయేసరికి కొంత గందరగోళంగా అనిపిస్తోంది. అసలు అతని ఫ్లాష్‌బ్యాక్ బలంగా చెప్పి ఉంటే కథ ఇంకాస్త ఆసక్తికరంగా సాగేదేమో.
మంచి భావోద్వేగ సన్నివేశాలు, కంటెంట్‌ఉన్నా కూడా వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ముని సురేష్ పిళ్ళై రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా జంగయ్య పాత్ర ద్వారా చెప్పించిన డైలాగ్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ‘ఆటగదరా శివ’ పాట బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మంచి కంటెంట్‌తో కర్మ సిద్ధాంతమనే కథావస్తువుగా తెరకెక్కిన ఆటగదరా శివ.. నటీనటుల పరిణితి లేని నటన, సరైన ఎమోషన్‌ను పండించలేకపోవడం, సినిమాలో నేటివిటీ మిస్ అవ్వడం వంటి కారణాలరీత్యా ప్రేక్షకుడి సహనానికి పరీక్షాపెట్టేలా మారింది. ‘ఆ నలుగురు’వంటి మంచి సినిమాల్ని తీసిన ఆయన ఈ చిత్రాన్ని మాత్రం ఆ స్థాయిలో నిలబెట్టలేకపోయారు. ముందు చెప్పుకున్నట్లు అక్కడక్కడ కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్న మామూలు మనుషుల మనస్తత్వాలు, వారి భావోద్వేగాలు బాగున్నప్పటికీ ఆ కథ ఆసక్తికరంగా సాగకపోవడం అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

-త్రివేది