రివ్యూ

నో హ్యాపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాపీ వెడ్డింగ్ * బాగోలేదు

తారాగణం:

మంత్ అశ్విన్, నిహారిక నరేష్, ప్రగతి మురళీశర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: బాలరెడ్డి
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య

** *** **** *********

ఎం.ఎస్.రాజు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్‌కు కెరీర్ పరంగా పెద్దగా విజయం దక్కలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి. ఇక కేరింత కాస్త ఫర్వాలేదనిపించుకుంది. కానీ కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయింది. తాజాగా మరోసారి ‘హ్యాపీ వెడ్డింగ్’ అంటూ మన ముందుకు వచ్చాడు. సుమంత్ అశ్విన్ హీరోగా, మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ వెడ్డింగ్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
అక్షర (నిహారిక), ఆనంద్ (సుమంత్ అశ్విన్) ప్రేమించుకుంటారు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా సంతోషంగా అంగీకరిస్తారు. దాంతో ఇద్దరికీ ఘనంగా ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. అంతా హ్యాపీగా ఉంది అనుకున్న టైమ్‌లో అక్షర, అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏది తనకు కరెక్ట్ అనే విషయంలో మాత్రం అనవసరంగా తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. ఆ కన్ఫ్యూజన్‌లోనే తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎంటర్ అవుతాడు. దాంతో అక్షర విషయంలో ఆనంద్ టెన్షన్ పడుతుంటాడు. వీరి కథ చివరికి ఎక్కడికి వెళుతుంది, అక్షర ఫైనల్‌గా ఎవరిని పెళ్లి చేసుకుంది అన్నది తెరపై చూడాలి.
సుమంత్ అశ్విన్ హావభావాల వరకూ ఫర్వాలేదు కానీ డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ విషయంలో ఇంకా ఎదగాల్సి ఉంది. మాటల రూపంలో మాత్రం ఆ వైవిధ్యాన్ని తెరపై పండించలేకపోయాడు. నిహారిక మంచి పరిణితి ప్రదర్శించింది. అయితే మేకప్ విషయంలో అమ్మాయి ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. చాలా చోట్ల డల్‌గా చూపించడం కోసం అమ్మాయికి వేసిన మేకప్ బాగోలేదు. చలాకీగా, తుంటరి అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకొంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఫర్వాలేదనిపించుకుంది. దర్శకుడు లక్ష్మణ్ రాసుకున్న సున్నితమైన కథే అయినా బలమైన పాత్రలు, సన్నివేశాలు మాత్రం కనిపించవు. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ ఎప్పటిలాగా తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. అలాగే హీరోకి తండ్రి పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించారు. బామ్మ పాత్రలో కనిపించిన అన్నపూర్ణమ్మ కూడా కొన్నిచోట్ల ద్వందార్థాలతో శృతిమించినప్పటికీ తన మాట విరుపుతో వెటకారంతో బాగానే నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. ముఖ్యంగా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌గా కనిపించిన రాజా కూడా విఫలమైన ప్రేమికుడిగా, వీలైతే ప్రేమించిన అమ్మాయిని మళ్లీ దక్కించుకోవాలనుకునే ఓ సాధారణ ప్రేమికుడిగా బాగా నటించాడు.
దర్శకుడు లక్ష్మణ్ మొదటి అర్థ్భాగాన్ని సరదాగా, కొంచెం ఎమోషనల్‌గా నడిపిన ఆయన, సెకెండాఫ్‌లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతోపాటు కుటుంబ బంధాలను, పెళ్లిపట్ల ఓ సగటు అమ్మాయికి ఉండే అనుమానాలను, భయాలను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమాలో మంచి స్టోరీలైన్ ఉంది కానీ, ఆ లైన్‌ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మాత్రం కథనం లేదు. ఫస్ట్ఫాను బాగానే నడిపిన దర్శకుడు, సెకెండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను సాగదీశారు. కొన్నిచోట్ల కుటుంబ బంధాలను బాగానే ఎలివేట్ చేసినప్పటికీ, లవ్ ట్రాక్‌ను కూడా అంతకన్నా బాగా ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నా దర్శకుడు మాత్రం ఎందుకో లవ్‌ట్రాక్‌ను పూర్తిగా వాడుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉంది, అది కొన్ని అపార్థాలు, తెలియనితనం కారణంగా ఘర్షణలో నలిగిపోతోంది అన్న విషయాన్ని ప్రేక్షకుడికి మాత్రం చేరువ చేయలేకపోయారు. అక్షర పాత్ర చివరివరకు కన్‌ఫ్యూజన్‌తోనే ఉండటం, ఆమెకున్న ఆ ఒక్క బలహీనతతోనే రెండు గంటల సినిమా బోర్ కొట్టింది. సినిమాలో బరువైన భావోద్వేగాల్ని పలికించే సందర్భాల్ని ఏర్పాటుచేయగల స్కోప్ ఉన్నా దర్శకుడు మాత్రం హీరోయిన్ కన్‌ఫ్యూజన్ క్యారెక్టర్ చుట్టూనే సన్నివేశాలు నడిపి సినిమాపై ఆసక్తి నీరుగార్చారు. దర్శకుడు లక్ష్మణ్ కార్య మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ దాన్ని ఆసక్తికరంగా సరిగ్గా ప్రెజెంట్ చేయలేదు. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శక్తికాంత్ కార్తిక్ సమకూర్చిన పాటలు కూడా బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకె. ఎడిటింగ్ బాగుంది కానీ అక్కడక్కడ సాగతీత సీన్స్‌ని తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరగా.. ఓ సగటు అమ్మాయికి పెళ్లిపట్ల ఉండే కన్‌ఫ్యూజన్‌ను, అనుమానాలను, భయాలు గురించి చూపించడం బాగుంది. ఇది ఎక్కువగా అమ్మాయిలకే కనెక్ట్ అవుతుంది తప్ప అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోదు. కన్‌ఫ్యూజన్ పాత్రలో నిహారిక నటనతో, సుమంత్ అశ్విన్ తన లుక్స్‌తో బాగానే ప్రయత్నం చేసినప్పటికీ సినిమా ఎక్కువభాగం ఒకే పాత్రపై సాగడం, సెకెండ్ హాఫ్‌లో కొన్నిచోట్ల ఆసక్తికరంగా సన్నివేశాలు లేకపోవడంతో సినిమా స్థాయి తగ్గింది. ప్రేమకథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే బాగుండేది.

-రతన్