రివ్యూ

రైటైపోదులేరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు

రాజా చెయ్యివేస్తే...

తారాగణం:
నారా రోహిత్, నందమూరి
తారకరత్న, ఇషా తల్వార్,
అవసరాల శ్రీనివాస్, శశాంక్,
రఘు, శివాజీరాజా తదితరులు
సంగీతం:
సాయకార్తీక్
ఛాయాగ్రహణం:
భాస్కర్ సామల
నిర్మాతలు:
రజని కొర్రపాటి
రచన, దర్శకత్వం:
ప్రదీప్ చిలుకూరి
---

ముందు మాట- ఓ డైలాగ్.. ఓ సన్నివేశం చూసేద్దాం. ‘పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని చూశావ్.. అదే పద్మవ్యూహం అభిమన్యుడు పన్నితే ఎలా ఉంటుందో చూస్తావా?’ - అంటాడు హీరో.
ఆ పద్మవ్యూహం ఏమిటో? దాని తీరుతెన్నులేమిటో? ఒక్కసారి కళ్ల ముందు కదలాడి.. ప్రేక్షకుడు సీట్లో కూర్చోలేక ఉత్కంఠతకు లోనవ్వొచ్చు. హార్ట్‌బీట్ పెరిగిపోవచ్చు. ఒళ్లంతా చెమటలు పట్టొచ్చు. జాగ్రత్త. ఆ పద్మవ్యూహంలో ప్రేక్షకుడు చిక్కుకొంటేనే ప్రమాదం.
హీరో తీరు ఇదైతే.. పాపం! విలన్ క్రూరత్వానికి తెగ బిల్డప్ ఇచ్చేశారు. కానీ- ఆఖరి రీలు వరకూ హీరో తెలివి తేటలేమిటో? విలన్ గాంభీర్యం ఏమిటో? బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థంకాదు. హీరో తెలివితేటలు ఆహో ఓహో.. అతగాడు స్క్రిప్ట్ రాస్తే అబ్బో.. సూపర్ -హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ ‘తెగ’ ముచ్చటేస్తుంది అంటూ.. స్క్రీన్‌పై వాళ్లకి వాళ్లే అనేసుకుంటుంటే.. అంతకుమించి ఏదో కొత్తదనాన్ని దర్శకుడు ప్రవేశపెట్టబోతున్నాడని భావించి.. ఆలోచనల తెరల్లోకి వెళ్లే ముందూ.. ఈ కన్‌ఫ్యూజన్‌లోంచి బయట పడేందుకూ కథలోకి వెళ్దాం.
కథ -రాజారాం (నారా రోహిత్)కి డైరెక్టర్ కావాలని ఆశ. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం దేనికని చైత్ర (ఇషా తల్వార్) అనే ఓ సాఫ్ట్‌వేర్‌ని తెగ ప్రేమించేస్తాడు. అట్నుంచీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇద్దరూ ప్రేమలో పీకలోతు మునిగి తేలుతూండగానూ.. డైరెక్టర్‌గా తన ప్లాన్స్ ఏవో వేసుకుంటూండగానూ.. మాణిక్ (తారకరత్న) అనే క్రిమినల్‌ని మర్డర్ చేయాల్సి వస్తుంది. దీంతో తన మేథాసంపత్తినీ.. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ఇత్యాది కరిక్యులర్ యాక్టివిటీస్‌తో విలన్‌ని మట్టుపెట్టాడా? ఇంతకీ క్రిమినల్‌కీ.. రాజారాంకీ మధ్య శత్రుత్వం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలన్నిటినీ క్లైమాక్స్‌లో చూడొచ్చు.
పట్టుమని -నాలుగు పేజీల్లేని ఈ రివేంజ్ డ్రామాని రెండు గంటలపాటు పరుగెత్తించాలంటే -స్క్రీన్‌ప్లేలో వెరైటీ ఉండాలి. అసలు సబ్జెక్ట్‌లో కొత్తదనం గురించి మాట్లాడుకొంటే.. అక్కడక్కడ కొంత సస్పెన్స్‌ని క్రియేట్ చేసి.. మాణిక్‌ని చంపాలన్న ఆలోచన రాజారాంకి ఎందుకు కలిగింది? దీని వెనుక స్టోరీ ఏమిటి? ఊహించుకొంటేనే సూపర్ అనిపించేట్టు దర్శకుడు చెప్పాలని ప్రయత్నించాడు. కానీ కథనం సేమ్ ఓల్డ్ రీతిన నడిచింది.
ఐతే -ఓ రకంగా దర్శకుణ్ణి మెచ్చుకోవాలి. మొదటి సన్నివేశం మొదలుకొని.. ఆయా పాత్రల చిత్రీకరణలోనూ.. పరిచయంలోనూ వెరైటీని జొప్పించాడు. కథని విలన్ కోణంలోంచి చూపించటంతో-ఎంతగా లాజిక్‌లు వెతికించే ప్రేక్షకుడికైనా.. ఇదేదో బాగుందే అనిపిస్తుంది. ఇక్కడ అక్కడ్నించీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు -ప్రతి పాత్రకీ ఓ ఫ్లాష్‌బ్యాక్.. ఇన్ని అంశాల్ని ఒక్కగాటన కట్టటానికీ.. అనుకున్న కథని అనుకున్న రీతిన మలచటానికీ తెగ ఇబ్బంది పడ్డాడు దర్శకుడు.
ఓ అసిస్టింట్ డైరెక్టర్ అద్భుతమైన క్రైం కథ రాసి.. దాన్ని బ్రహ్మాండంగా చిత్రీకరించటం చూసిన.. కథానాయకి ఓ మర్డర్‌కి అతగాడి చేత ప్లాన్ చేయటం అన్నది లాజిక్‌కి దొరకదు. ఏదో సాదాసీదా కుర్రాడు.. మాణిక్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ని ఢీకొనటం అంత థ్రిల్లింగ్ కలిగించలేదు. అదీగాక -రివెంజ్ డ్రామా హీరో పక్షాన కాకండా హీరోయిన్ ‘రివెంజ్’ అనేప్పటికి సగం నీరసం వస్తుంది.
నటనాపరంగా- తారకరత్న మంచి మార్కులు కొట్టేశాడు. మాణిక్ పాత్రకి చక్కగా సూట్ అయ్యాడు. ఎప్పుడూ సీరియస్ పాత్రల్లో వొదిగిపోయే రోహిత్ ఈసారి కమర్షియల్ హీరోగా.. ఫైట్స్ రొమాన్స్‌తోపాటు కామెడీని పండించే పాత్రల్లో కనిపించాలనుకోవటం మంచి పరిణామం. ఐతే- వెయిట్ విషయంలో జాగ్రత్త వహించకపోతే.. కొన్ని కేరెక్టర్లు నప్పవు. ఇషాతల్వార్ చూట్టానికి బానే ఉంది గానీ.. నటనాపరంగా మైనస్‌లే ఎక్కువ. మిగతా పాత్రధారులందరూ ఫర్వాలేదనిపిస్తారు. ‘శ్రీరామ నవమి’ పాట చిత్రీకరణ చూట్టానికి.. వినటానికి సొంపుగా ఉంది. సాయి కార్తీక్ సంగీతం బాగున్నప్పటికీ పాటల ప్లేస్‌మెంట్ సరిగ్గా లేదు. దర్శకుడిగా తనదైన స్టైల్‌ని చూపినప్పటికీ.. కథలో కొత్తదనం లేని కారణంగా చతికిలపడింది.

-ప్రనీల్