రివ్యూ

‘బ్రాండ్’ సెట్ కాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాండ్ బాబు ** ఫర్వాలేదు

తారాగణం: సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళిశర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ తదితరులు.
సంగీతం: జేబీ, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
నిర్మాత: శైలేంద్రబాబు
రచన, స్క్రీన్‌ప్లే: మారుతి
దర్శకత్వం: పి.ప్రభాకర్

** *** **********

బుల్లితెర నటుడిగా, దర్శకుడిగా, భిన్నమైన పాత్రల్లో రాణించిన పి.ప్రభాకర్- బిగ్ స్క్రీన్‌పై దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆయన దర్శకుడిగా పరిచయం అయిన ‘నెక్స్ట్ నువ్వే’ ఆశించిన స్థాయి సక్సెస్ అందుకోలేదు. ఆ తరువాత దర్శకుడిగా మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మారుతి స్క్రిప్ట్ అందిస్తూ.. ఆయన పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం బ్రాండ్ బాబు. మారుతి మార్క్‌లో హీరోకి ఓ వీక్‌నెస్ ఉండడం దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్న అంశాలతో కామెడీని జోడించి తెరకెక్కించారు. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర, ఇషారెబ్బ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శైలేంద్రబాబు నిర్మించారు. మరి ఈ చిత్రంతో బ్రాండ్‌బాబు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్న విషయం తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర)ను చిన్నప్పటినుంచీ బ్రాండ్ ల మధ్య, హైక్లాస్ స్టేటస్‌ల మధ్య పెంచడంతో అతనికి పెద్దగా ఎమోషన్స్, సెంటిమెంట్స్ గురించి తెలియకుండా పెంచుతాడు అతని తండ్రి (మురళీశర్మ). బ్రాండ్ పిచ్చి పీక్‌లో ఉన్న మురళీశర్మ, తన పిచ్చిని తన కొడుక్కి నూరిపోస్తాడు. దాంతో బ్రాండ్‌బాబు తాను చేసుకోబోయే అమ్మాయి స్టేటస్‌వల్ల, తన బ్రాండ్ ఇంకా పెరగాలనుకుంటాడు. అలా బాగా డబ్బున్న అమ్మాయి కోసం వెదుకుతున్న సమయంలో కొన్ని సంఘటనల ఆధారంగా తనని హోమ్ మినిష్టర్ కూతురు (పూజిత పొన్నాడా) ప్రేమిస్తుందని అనుకుంటాడు. ఆ విషయం ఆమెచేతే చెప్పించి, ఆమెను పెళ్లికి ఒప్పించే ప్రయత్నంలో.. ఫోన్‌లో హోమ్ మినిష్టర్ కూతురికి బదులు ఆ ఇంటిలోని పనిమనిషిగా చేసే (ఈషారెబ్బ)ను ప్రేమలో దించే ప్రయత్నంచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బ్రాండ్‌బాబు చేసే ఓ మంచి పనివల్ల ఈషా కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఇక ఈషాతో నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లుచేసుకున్న తర్వాత బ్రాండ్ బాబుకు అసలు విషయం తెలుస్తోంది. తాను ప్రేమించింది హోమ్ మినిష్టర్ కూతురును కాదు, ఆ ఇంటి పనిమనిషిని అని. దాంతో ఈషాతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగే కొన్ని పరిణామాలు తర్వాత బ్రాండ్‌బాబు కుటుంబ పరువు మొత్తం పోతుంది. పోయిన పరువుకోసం బ్రాండ్ బాబు ఫ్యామిలీ ఏం చేసింది? తనవల్ల బాధపడుతున్న బ్రాండ్ బాబు ఫ్యామిలీకోసం ఈషా ఏం చేసింది? అసలు బ్రాండ్ పిచ్చి ఉన్న హీరో మారాడా? హీరో హీరోయిన్లు కలుస్తారా? కలిస్తే బ్రాండ్ పిచ్చి పీక్‌లో ఉన్న హీరో తండ్రి ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా అన్నది మిగతా కథ..
తెలుగులో హీరోగా పరిచయం అయిన కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర బ్రాండ్‌బాబు పాత్రలో చక్కగా నటించాడు. డాన్స్, లుక్ కూడా బాగుంది. పనిమనిషి పాత్రలో హీరోయిన్ ఈషారెబ్బ తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోతో సాగే సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు, ఆమె నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ఇక బ్రాండ్ బాబు ఫాదర్‌గా, బ్రాండ్ పిచ్చి పీక్‌లో ఉన్న పాత్రను పోషించిన మురళీశర్మ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన తన బ్రాండ్ మోజులో ఇటు నవ్విస్తూనే అటు ఎమోషనల్ సన్నివేశాలను కూడా చాలా చక్కగా పండించారు. రైటర్‌గా కనిపించిన కమెడియన్ సత్యం రాజేష్ అక్కడక్కడా నవ్వించగా హీరో అసిస్టెంట్స్‌గా నటించిన వేణు, సాయి కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకుడు మారుతి అందించిన ఈ స్క్రిప్ట్‌లో పెద్ద విషయమేమీ లేదు. రొటీన్ కథతో సాగిపోయింది. దర్శకుడు ప్రభాకర్, మారుతి అందించిన స్క్రిప్ట్‌ను బాగానే తెరకెక్కించినప్పటికీ స్క్రిప్ట్‌లో చాలా లోపాలు ఉండటంవల్ల దర్శకుడు ఆసక్తికరంగా మలచలేకపోయారు. పైగా సన్నివేశాలు ఇంకా బెటర్‌గా తీసుకునే విషయంలో దర్శకుడు ఆసక్తిచూపలేదు. ఇక సంగీత దర్శకుడు జేబీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. అలాగే పాటలు సో సోగా ఉన్నాయి. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎక్కడా బ్యూటి తగ్గకుండా చిత్రీకరించారు. ఉద్ధవ్ ఎస్.బి. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్‌లోని విషయం లేని సీన్లను, ఫ్లోలేని సన్నివేశాలను కొన్ని సాగతీత సీన్స్‌ను కూడా తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత శైలేంద్రబాబు తన తనయుడుకోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రానికి అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. ఆయన పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
దర్శక రచయితలూ మొదటి అర్ధ్భాగాన్ని సినిమా థీమ్‌తోపాటు పాత్రలను, వాటి స్వభావాల్ని పరిచయంచేస్తూ సరదాగా నడిపినా, రెండో భాగం మాత్రం అనవసరమైన సన్నివేశాలతో సినిమాను బోర్‌కొట్టించారు. ఇంటర్వెల్ సీన్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో సెకెండాఫ్‌పై అంచనాలు పెంచిన ఆ అంచనాలు మాత్రం అందుకోలేకపోగా, పసలేని సీన్లతో అనవసరమైన కాలక్షేపం చేశారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, రొమాన్స్ లోపించడం, దానికితోడు చాలా సన్నివేశాలు మరీ నాటకీయంగా ఉండటంతో సినిమా సగటు సినిమాగానే మిగిలిపోయింది

త్రివేది