రివ్యూ

వినోదాల విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

***
గీత గోవిందం

తారాగణం:
=======
విజయ్ దేవరకొండ, రష్మిక, నాగబాబు, సుబ్బరాజు, గిరిబాబు, అన్నపూర్ణ
రాహుల్ రామకృష్ణ, వెనె్నల కిషోర్,
నిత్యామీనన్, అను ఇమ్మాన్యుయేల్
తదితరులు.

ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
ఆర్ట్: రమణ వంక
పాటలు: అనంత్ శ్రీరామ్, శ్రీమణి
కొరియోగ్రఫీ: రఘు, జానీ
రచనా సహకారం: సీతారామ్
సినిమాటోగ్రఫీ: మణికందన్
సంగీతం: గోపీ సుందర్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాణం: జీఏ-2 పిక్చర్స్
నిర్మాతలు: బన్ని వాసు, సత్యగామిడి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
పరశురామ్

యువతరానికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అంటేనే విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాలు అతడిని ఓ స్థాయిలోకి తీసుకెళ్లాయి. ఇక అప్పటి నుంచి అతడు కథల ఎంపికపై దృష్టిసారించాడు. ‘అర్జున్‌రెడ్డి’తో ఊహించని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్న విజయ్ నటనేకాదు, మాటలు, చేతలు, స్టయిల్ అన్నీ ఈ తరానికి విపరీతంగా నచ్చేస్తున్నాయ్. ఆయా చిత్రాల్లోని అతడి పాత్రలు వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ థియేటర్‌లవైపు పరుగులు పెట్టిస్తున్నాయ్. ప్రతి యువకుడు తనను తాను విజయ్ దేవరకొండతో పోల్చుకుంటూ అతడిని ఫాలో అవుతున్నాడు. తన సినిమాలతో యువతరం గుండెలను తాకడమేకాదు, కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరవ్వాలనుకుంటూ తాజాగా ‘గీత గోవిందం’ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ చిత్రానికి దర్శకుడు పరశురామ్. ‘ఆంజనేయులు’, ‘సోలో’, ‘సారొచ్చారు’, ‘శ్రీరస్తు- శుభమస్తు’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఆయనకు ఫ్యామిలీ సినిమాలను చక్కగా తెరకెక్కిస్తాడనే పేరుంది. అలాగే విలువలున్న సినిమాల నిర్మాతగా బన్నివాసును చెప్పుకుంటారు. దానికి తోడు అల్లుఅరవింద్ సమర్పణ..జీఏ-2 పిక్చర్స్ నిర్మాణం... ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాదు, ‘ఇంకేం ఇంకేం కావాలే’ పాటతోనూ, ట్విట్టర్‌లో హీరో, హీరోయిన్ల సరదా సంభాషణలతోనూ విడుదలకు ముందు లీకుల గొడవలతోనూ ఈ ‘గీత గోవిం దం’ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ఇలా అన్ని విధాలా.. విడుదలకు ముందే కావలసినంత ప్రచారం సంపాదించుకున్న ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) పద్ధతిగల యువకుడు. ఓ కాలేజీలో లెక్చరర్. తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. సంప్రదాయబద్ధమైన పద్ధతిలో నడుచుకోవాలి.. తన అమ్మలాగే ఉండాలి అంటూ, తనలో తానే ఊహించుకుంటూ కలలు కంటూ ఉండగా, ఆ కలలో గీత (రష్మిక) ఐటీ ఉద్యోగిని తళక్కున మెరుస్తుంది. అతడిని ఊపిరాడకుండా చేస్తుంది. నిత్యం ఆమే కనిపిస్తూ కలల్లో విహరింపజేస్తుంది. అలాంటి కలల సుందరి ఓ గుడిలో కనిపిస్తుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మనసులో ఫిక్సయిపోతాడు. అదే సమయంలో తన గారాల చెల్లికి పెళ్లి నిశ్చయిమవడంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్. అప్పుడే అతడికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. తను ప్రయాణిస్తున్న బస్సులో కూడా తన కలల సౌందర్యం గీత కనిపిస్తుంది. కనిపించడమేకాదు, తన పక్కనే ఉన్న సీటులోకి వచ్చి కూర్చుంటుంది. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న విజయ్ తన మనసులోని మాటను తనతో చెప్పాలనుకుంటాడు. ప్రేమ విషయాన్ని బయటపెట్టాలనుకుంటాడు. ఆ సమయంలో ఎలా మసలుకోవాలో ఫోన్ ద్వారా స్నేహితుడు (రామకృష్ణ)ను సంప్రదిస్తూ అతడి చెప్పినట్టుగానే నడుచుకునే ప్రయ త్నం చేస్తాడు. ఇక ఐలవ్ యూ చెప్పడానికి ఎంతో దూరం లేదనుకుంటాడు. ఇంతలో ఊహించని సంఘటన కారణంగా చిన్న పొరపాటు.. నిద్రిస్తున్న గీతతో సెల్ఫీ తీసుకునే జోష్‌లో ఉండగా బస్సు కుదుపుకి ఆమెను ముద్దుపెట్టేస్తాడు. అనుకోకుండా జరిగిన ఈ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత, విజయ్‌ను పూర్తిగా అపార్థం చేసుకుంటుంది. ఓ రోగ్‌గా గుర్తించి ఛీ కొడుతుంది. జరిగిన సంఘటనను తన అన్నయ్య (సుబ్బరాజు)కు చెబుతుంది. కోపోద్రిక్తుడైన అన్నయ్య కాకినాడలో విజయ్ కోసం తన అనుచరులతో మాటు వేస్తాడు. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిన విజయ్ బస్సులోంచి దూకి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వస్తాడు. ఇంటి వద్దకు రాగానే మరో ఊహించని సంఘటన.. తన చెల్లెలికి కాబోయే భర్త గీత అన్నయ్యే అని తెలుస్తుంది. అప్పుడు గోవిందం ఏం చేశాడు? తనను ముద్దుపెట్టి బస్సులోంచి పారిపోయిన వ్యక్తి ఇతడే అని గీత అన్నకు చెప్పేస్తుందా? మరి వీరి ప్రేమ ప్రయాణం ఎక్కడికి దారితీసింది? తన ప్రేమలోని సిన్సియారిటీని విజయ్ ఎలా నిరూపించుకున్నాడు? చివరకు గీత, గోవింద్‌ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తే ఎదురైన సంఘటనలేంటి? ఇన్ని పరిణామాల మధ్య వీరి కథ ఎలాంటి మలుపు తిరిగిందనేది ఆసక్తికరమైన క్లయమాక్స్.. తెరపై చూడాల్సిందే.
దర్శకుడు పరశురామ్ రాసుకున్న పకడ్బందీ కథనం, క్యారెక్టర్లను మలుచుకుంటూ వెళ్లిన విధానం ఆద్యంతం చిత్రాన్ని రసవత్తరంగా మార్చివేసింది. ప్రేమకథలు విజయతీరాలకు చేరాలంటే ఎన్నో ఒడిదుడుకులు తప్పవు. వాటినన్నింటినీ బేరీజు వేసుకుంటూ దర్శకుడు చేసిన ఈ ప్రేమ ప్రయాణం అతడి కెరీర్‌లో మరుపురాని మజిలీయే! సినిమా ఆద్యంతం ఎక్కువ ఫ్రేముల్లో హీరో, హీరోయిన్‌లిద్దరు మాత్రమే కనిపిస్తారు. అయినప్పటికీ ప్రేక్షకులకు ఎలాంటి నిరాశ కలగదు. అలా ఇద్దరి మధ్య నడిచే సన్నివేశాలు వారిని వినోదంలో ముంచెత్తుతాయి. కథను ప్రారంభించడానికి నిత్యామీనన్ క్యారెక్టను పరిచయం చేయడం, ఆమెకు విజయ్ కథ చెబుతున్నట్టుగా మొదలుపెట్టడం, మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తళక్కున మెరవడం.. చివర్లో వెనె్నల కిషోర్ రంగప్రవేశం లాంటివన్నీ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి. పాత కథే అయినా.. కథనం, డైలాగ్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తూ మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్ టేకింగ్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డి ఇమేజ్ నుంచి బయటకు తీసుకొచ్చి విభిన్నంగా మలచడంలో దర్శకుడిగానే కాదు, రచయితగానూ సక్సెస్ అయ్యాడు. కామెడీ సన్నివేశాలు లేవుఅన్న ఫీలింగ్ కలగనీయకుండా మెయిన్ క్యారెక్టర్‌లతోనే పసందైన కామెడీని పండించి ప్రేక్షకులకు కనువిందు చేసి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ప్రథమార్థం మొత్తం వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కథ కాస్త నెమ్మదించినా.. వినోదంతో చెడుగుడు ఆడేశాడు. ఇలాంటి కథలను సన్నివేశాల పరంగా భావోద్వేగాలను మేళవించి సినిమా చేయడం కష్టమే. అయితే ఈ విషయంలో దర్శకుడు పరశురామ్ సినిమాను ఆద్యంతం ప్రేక్షకుడు ఎలాంటి బోర్ ఫీలవ్వకుండా చేసిన విధానం భేష్! సమాజంలో భార్యలకు భర్త అవసరమని, భర్తను భార్య అర్థం చేసుకుని నడుచుకుంటే ఆ సంసారం బాగుంటుందనే చక్కటి సందేశాన్ని అంతే చక్కగా చెప్పడంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. తర్వాత ఏం జరుగుతుందనే ఆత్రుత ప్రేక్షకుడిలో అనుక్షణం వ్యక్తమవుతుంది. కథలో మలుపులు.. కథనం పరంగా మెరుపులు..ఎప్పటికప్పు డు కావల్సినంత హాస్యం పండిస్తూ సన్నివేశాల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ముఖ్యంగా కథానాయకుడికి, అతడి స్నేహితులకీ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులను నవ్వుల లోకంలో విహరింపజేస్తాయి. గోవింద్, గీతల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చక్కటి వినోదాన్ని పంచుతాయి. చెప్పుకోదగ్గ కథేమీ కాకపోయినా.. కథనంతోనూ, హాస్యంతో కూడిన సన్నివేశాలతోనూ దర్శకుడు తీర్చిదిద్దిన విధానం వాహ్..! అనిపిస్తుం ది. దానికి తోడు విజయ్ దేవరకొండ, రష్మిక నటన తోడైం ది. దాంతో సినిమా ఆద్యంతం వినోదంలో ముంచెత్తుతూ హృదయాల్ని సుతిమెత్తగా మెలిపెడుతూ హాయిగా సాగింది. మేడమ్..మేడమ్ అంటూ విజయ్ చేసే హంగామా, ప్రతి విషయంలోనూ అనుమాన పడుతూ గోవింద్‌ని తన చుట్టూ తిప్పించుకునే గీత మధ్య సీన్స్ బాగా పేలాయి. ఈ సన్నివేశాలకు థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. విజయ్ గోవింద్ పాత్ర చాలా పద్ధతైన కుర్రాడిగా, గీత పాత్ర కాస్తంత రాలుగాయిగా ఉండటమే బాగా కలిసొచ్చింది. రొమాంటిక్ కామెడీలకు క్యారెక్టరైజేషన్స్ చక్కగా కుదరడం అవసరం కూడా. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా ఎలాంటి బెరుకు లేకుండా సాగిందీ చిత్రం.
నటీనటుల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ మరోసారి తన నటనతో గోవింద్‌గా విశ్వరూపానే్న ప్రదర్శించాడు. అర్జున్‌రెడ్డి క్యారెక్టర్‌కు పూర్తి వ్యతిరేక పాత్రలో జీవించేశాడు. మంచి కామెడీ టైమింగ్‌ని ప్రదర్శించాడు. అర్జున్‌రెడ్డి తర్వాత తనకు సూటైన మరో మంచి పాత్రనే ఎంపిక చేసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే నటనను ప్రదర్శించాడు. సినిమాపై ఈ స్థాయిలో హైప్ క్రియేట్ అవడానికి ముఖ్య కారణం విజయ్ దేవరకొండ. భయస్తుడిలా రష్మిక చుట్టూ మేడమ్.. మేడమ్ అంటూ తిరిగే పాత్రలో అతడి నటన సూపర్బ్. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్‌లోనూ ఫన్ జనరేట్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. అలాగే అతడికి జోడీగా నటించిన రష్మిక కరుకైన అమ్మాయిగా తెగ విజృంభించేసింది. రష్మిక అందం.. అభినయం చూడముచ్చటగా ఉన్నాయి. చాలా వరకు సినిమాలో ఆమె పాత్ర సీరియస్‌గానే కనిపించాల్సి వచ్చినా తన అందంతో ఆకట్టుకుంది. వీరిద్దరి అభినయం ఈ చిత్రానికి ప్రధాన బలం. ‘్ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ గీత క్యారెక్టర్‌కు ప్రాణం పోసింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ను చక్కగా పండించింది. ముఖ్యంగా హీరోని టార్చర్ పెట్టే సన్నివేశాల్లో ఆమె నటన, హీరో మీద కోపం ప్రదర్శించే సమయాన ఆమె కళ్లల్లో పలికించిన హావభావాలు మెచ్చుకోతగినవి. విజయ్ దేవరకొండ తండ్రిగా నాగబాబు నటించారు. అయితే ఆయనకు గొంతు సమస్య ఉండటంతో ఆ పాత్రకి వేరొకరు డబ్బింగ్ చెప్పడం కొంత వెలితి. ఆ ఫీల్ మిస్సయింది. ఇతర పాత్రలో గిరిబాబు- అన్మపూర్ణ తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. విజయ్ స్నేహితులుగా నటించిన రాహుల్ రామకృష్ణ బృందం అడుగడుగునా నవ్వులు కురిపించింది. ముఖ్యంగా రామకృష్ణ, వెనె్నల కిషోర్, అన్నపూర్ణలు కలిసి పతాక సన్నివేశాల్లో కామెడీకి ఆజ్యం పోసి పెద్ద ఫన్‌గా మార్చేసారు. రష్మిక అన్నయ్యగా సుబ్బరాజుకు ఇలాం టి పాత్రలు కొట్టినపిండే. నిత్యామీనన్, అను ఇమ్మాన్యుయేల్ అతిథి ప్రాతల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. అన్ని విభాగాల్లో ఎంతో రిచ్‌గా ఉంది. మణికందన్ కెమెరా పనితనం మెచ్చుకోతగ్గదే. గోపీ సుందర్ సంగీతంలో పాటలు వినసొంపుగా వున్నాయి. ప్రేమకథలు గుర్తుండిపోవడానికి కావాల్సింది ఇదే. ముఖ్యంగా ‘ఇంకేం ఇంకేం కావాలే’, ‘ఏంటీ, ఏంటీ వచ్చిందమ్మా’ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం బావుంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ ఓకె. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునేలా సాగి వినోదాన్ని పంచింది.
*

--ఎం.డి. అబ్దుల్