రివ్యూ

ఆటలో మజాలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటగాళ్లు * బాగోలేదు

తారాగణం:

నారా రోహిత్, జగపతిబాబు, దర్శన బానిక్, బ్రహ్మానందం సుబ్బరాజు తదితరులు
సంగీతం: సాయికార్తిక్
సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి

** *** *** *** ***** ****

భిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్. ఈ ప్రయత్నంలో ఆయనకు సక్సెస్‌ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయినాసరే తన పంథా మాత్రం మార్చడం లేదు. తాజాగా ఆయన జగపతిబాబుతో కలిసి ఓ ఆట ఆడాలని చేసిన ప్రయత్నమే ఆటగాళ్లు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఈ ఆటగాళ్ల ఆట ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే..
సిద్ధార్థ (నారా రోహిత్) టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా మంచి ఇమేజ్ ఉన్న వ్యక్తి. మిడిల్ క్లాస్ అమ్మాయి అయిన అంజలి (దర్శన బానిక్)ని సిన్సియర్‌గా ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. వారి దాంపత్య జీవితం మూడు సంవత్సరాలు హ్యాపీగా సాగిపోయిన తర్వాత అంజలి అనుకోకుండా హత్యకు గురవుతుంది. ఆ హత్య చేసింది సిద్ధార్థ్ అని పోలీసులు అతన్ని అరెస్ట్‌చేసి, కోర్టులో హాజరుపరుస్తారు. అయితే అంజలి హత్య కేసును వాదించడానికి ఎంటర్ అవుతాడు. ద గ్రేట్ క్రిమినల్ లాయర్ వీరేంద్ర (జగపతిబాబు). కేసు వాదనలో సాక్ష్యాలన్నీ అంజలి సిద్ధార్థనే హత్యచేసినట్లు తేలుతుంది. కానీ ప్రాణంగా ప్రేమించిన సిద్ధార్థ అంజలిని హత్యచేసి ఉండడని నమ్మిన వీరేంద్ర సిద్ధార్థను ఆ కేసు నుండి బయటపడేస్తాడు. కానీ ఆ తర్వాతే సిద్ధార్థ గురించి వీరేంద్రకు ఊహించని నిజాలు తెలుస్తాయి. దాంతో ఇద్దరి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు సిద్ధార్థ్ అంజలిని హత్యచేశాడా? లేదా? వీరేంద్ర ఈ కేసుని ఏ విధంగా ఛేదిస్తాడు? చివరికి అంజలిని చంపిన హంతకుడికి శిక్ష పడుతుందా? లేదా? అన్నవి మిగతా సినిమా.
క్రియేటివ్ సినిమా డైరెక్టర్‌గా నటించిన నారా రోహిత్ నటన విషయంలో ఎక్కడా గొప్పగా ఉందని చెప్పలేం. అసలు కొన్ని సన్నివేశాల్లో ఆయన హావభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడంలో ప్రేక్షకుడు ఇబ్బంది పడతాడు. కాకపోతే హీరోగా ఉన్న రోహిత్ ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను ఒప్పుకోవటం సాహసం అనే చెప్పాలి. జగపతిబాబు తన పాత్రకు న్యాయం చేశాడు. కాకపోతే.. ఆయన క్యారెక్టర్‌కు ఉన్నంత ప్రాముఖ్యత హీరోకు లేకపోవడం ఇబ్బంది కలుగుతుంది. న్యాయం కోసం ఎంతటి దూరమైనా వెళ్లే ఓ సీరియస్ క్యారెక్టర్‌ను పోషించిన ఆయన, హీరోకి పోటీగా మైండ్‌గేమ్ ప్లేచేసే క్రిమినల్ లాయర్‌గా ఆయన నటన సినిమాకే హైలెట్. ఇక బ్రహ్మానందం చేత చేయించింది కామెడీ ఎక్కడా పండలేదు సరికదా చిరాకు పుట్టించేలా ఉంది. హీరోయిన్ దర్శన బానిక్ ఉన్నంతలో బాగానే చేసింది. అజయ్, తులసి తదితరులు తమతమ పరిధిమేరకు బాగానే నటించారు. సాయికార్తీక్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక దర్శకుడు పరుచూరి మురళి ఆంధ్రుడులాంటి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో నిజంగా ఆయనేనా అనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కనీస స్థాయిలో ఎమోషన్స్ లేదా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్‌చేసిన ఆడియన్స్ ఆశల్ని తుంగలో తొక్కిపడేశాడు దర్శకుడు పరుచూరి మురళి. సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటికూడా లేదు. దర్శకుడు మంచి స్టోరీ థీమ్ తీసుకున్నప్పటికీ స్లో నేరేషన్‌తో, కన్వీన్స్ కానీ ట్రీట్‌మెంట్‌తో సినిమాను ఆసక్తికరంగా మలచలేకపోయారు. ముఖ్యంగా కథా కథనం ఉండాల్సిన స్థాయిలో ఉండవు. సినిమా నిండా అవసరంలేని సన్నివేశాలే ఎక్కువైపోయాయి. దీనికితోడు బలంలేని కథలో బలహీన పాత్రలను సృష్టించి, అవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అర్థంకాని విధంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా.. నారా రోహిత్ కెరీర్‌లో మరో డిజాస్టర్ అని చెప్పక తప్పదు. పాత్రలో వైవిధ్యం ఉన్నప్పటికీ దాన్ని పండించడంలోనూ.. అసలు కథ ఎంపిక విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ ఆసక్తికరంగా కాకుండా సాగతీత సన్నివేశాలతో కన్విన్స్‌కాని ట్రీట్‌మెంట్‌తో విసుగుతెప్పిస్తుంది. మొత్తంమీద ఈ ‘ఆటగాళ్లు’ చిత్రం ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచడంలో విఫలమైంది.

-త్రివేది