రివ్యూ

లేజీఫెలోస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్లీఫెలోస్ * బాగోలేదు

తారాగణం:

సునీల్, అల్లరి నరేష్, పూర్ణ చిత్రశుక్ల, జయప్రకాష్‌రెడ్డి పోసాని, బ్రహ్మానందం, తదితరులు.
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్‌కుమార్
స్క్రీన్‌ప్లే: భీమనేని శ్రీనివాసరావు
ఎడిటర్: గౌతమ్‌రాజు
నిర్మాతలు: కిరణ్‌రెడ్డి, భరత్‌చౌదరి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

*** *** **** ***

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న అల్లరి నరేష్ ఈసారి తనకు కెరీర్ బెస్ట్ సినిమా సుడిగాడు లాంటి హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావుతో సినిమా చేసాడు. ఈసారి నరేష్‌కు సునీల్ కూడా తోడయ్యాడు. ఇద్దరు కలిసి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నమే ‘సిల్లీఫెలోస్’. పూర్ణ, చిత్ర శుక్ల హీరోయిన్స్‌గా బ్లూప్లానెట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సిల్లీఫెలోస్ ప్రేక్షకులను ఎలా నవ్వించారో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
వీరబాబు (నరేష్) ఓ ట్రైలర్. ఆ ఊరి ఎమ్మెల్యే జాకెట్ జానకిరామ్ (జయప్రకాష్‌రెడ్డి)కి రైట్‌హ్యాండ్‌లా ఉంటాడు. తన గురువులా తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి ఎంఎల్‌ఏగా మారాలనుకుంటాడు వీరబాబు. అయితే ఆ ప్రాంత ఎంఎల్‌ఏ జాకెట్ జానకికి చెడ్డపేరు తెచ్చి, అతనికి రాబోయే మంత్రి పదవిని తాను దక్కించుకోవాలని చూస్తుంటాడు మరో ఎమ్మెల్యే (రాజా రవీంద్ర). ఆ ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే జరిపించే వివాహాలను చెడగొట్టడానికి పెళ్లిచేసుకోబోయే జంటలను తప్పిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న వీరబాబు అప్పటికప్పుడు దొరికిన వాడ్ని తీసుకొచ్చి పెళ్లికొడుకుని చేస్తాడు. ఆ క్రమంలో ఓ జంట మిస్ అవ్వగా.. తన ఫ్రెండ్ సూరిబాబు (సునీల్)కి మాయమాటలు చెప్పి క్లబ్ డాన్సర్ పుష్ప (నందినిరాయ్)తో సూరిబాబు పెళ్లి జరిపించేస్తాడు. దాంతో సూరిబాబు ప్రేమించి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి (పూర్ణ) అతన్ని ఛీకొడుతుంది. పుష్పతో ఎటువంటి సంబంధంలేదని ప్రూవ్ చేస్తేనే మనం ఒకటవుతాం అని కండీషన్ పెడుతుంది. దాంతో పుష్పతో తనకు ఎలాంటి సంబంధంలేదని నిరూపించడానికి సూరిబాబు ఏం ప్లాన్స్‌వేశాడు? ఆ ప్లాన్స్‌ని కూడా వీరబాబు తన ప్రేమకు అనుగుణంగా ఎలా వాడుకున్నాడు? ఆ క్రమంలో వీరబాబు తన లవ్‌లో ఎదురుకానున్న సమస్యలు ఏమిటి? తనూ ప్రేమించిన వాసంతిని చివరికి దక్కించుకున్నాడా? లేదా? లాంటి విషయాలే మిగతా కథ..
వరుస సినిమాలు ప్లాప్‌లు టెన్షన్ పెడుతున్న అల్లరి నరేష్ తన గత సినిమాల్లోకంటే కూడా చాలా ఫ్రెష్‌గా కనిపించాడు. తన హిట్ సినిమాల్లోని కామెడీ టైమింగ్‌ని గుర్తుకుతెస్తూ.. వీరబాబు క్యారెక్టర్‌తో మంచి కామెడీని పండించాడు. ముఖ్యంగా తన అవసరాలకు సునీల్‌ని వాడుకుని అతని బకరాచేసే విధానం ఫన్నీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్ర తాలూకు ఎక్స్‌ప్రెషన్స్ దగ్గర నుంచి మాడ్యులేషన్ వరకు చాలా చక్కగా పలికించాడు. తన పాత్రకి ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనల ద్వారానే నవ్విస్తూ.. సునీల్ తన పాత్రకి పూర్తిన్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన చిత్ర శుక్ల తన గ్లామర్‌తోనే కాకుండా తన నటనతోకూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా కూడా మెప్పించింది. అలాగే గెస్ట్‌రోల్‌లో కనిపించిన పూర్ణ ఉన్నంతలో తన మార్క్ కనబరిచింది. సినిమాలో కీలక పాత్ర అయిన పుష్పగా నటించిన నందినిరాయ్ ట్రాక్ కూడా పర్వాలేదనిపిస్తోంది. ఎమ్మెల్యేగా జేపీ తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్విస్తాడు. పోసాని కూడా ప్రీక్లైమాక్స్‌లో కాసేపు నవ్విస్తాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధిమేరకు బాగానే చేసారు. రీమేక్ చిత్రాల మేకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కామెడీని పండించే ప్రయత్నంచేసినా, ఆయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు. అనీష్ తరుణ్‌కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. మెయిన్‌గా హీరోహీరోయిన్ల మధ్య సాగిన సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగుంది. సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తోంది. నరేష్, సునీల్ కాంబినేషన్‌లో వచ్చి హెడ్డేక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కూడా సినిమాకి అనుగుణంగానే సాగుతుంది. గౌతమ్‌రాజ్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్లస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ, అది అంతగా పండలేదు. కొన్నిచోట్ల బాగానే నవ్వించినా మెయిన్ ప్లాట్‌లోనే లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరీ ఎక్కువ అవ్వడంతో సినిమా ఫలితం దెబ్బతింది. రాసుకున్న కామెడీని, స్క్రీన్‌మీద సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. రెండవ భాగంలో అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు బాగున్నప్పటికీ కథకు అవసరం లేని సీన్స్‌తో కథనం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో కామెడీ మరీ సిల్లీగా అనిపిస్తోంది. ముఖ్యంగా లాజిక్ లేని సీన్స్, ఫేక్ ఎమోషన్స్ కొన్ని సగటు ప్రేక్షకుడికి మింగుడు పడవు.
చివరగా.. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ మరియు సునీల్ కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘సిల్లీఫెలోస్’. ఈ చిత్రంలో చాలాచోట్ల సిల్లీ కామెడీగా సాగుతుంది. కొన్నిచోట్ల బాగానే నవ్వించినప్పటికీ, లాజిక్స్ లేని స్క్రీన్‌ప్లేతో, అసలు కథ విషయంలో కేర్ తీసుకోకపోవడం, విసుగుపుట్టించే పాత్రలతో సినిమా ఫలితం దెబ్బతింది. దీనికితోడు కామెడీకోసం రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయత ఎక్కువ అవ్వడంతో.. ఆ సన్నివేశాల్లో నవ్వు రాకపోగా విసుగు తెప్పించి లేజీఫెలోస్‌గా మారారు.

-త్రివేది