రివ్యూ

యాక్షన్ తగ్గిందయ్యా సామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామి * బాగోలేదు
*
నటీనటులు: చియాన్ విక్రమ్, కీర్తి సురేష్, బాబీ సింహ తదితరులు
ఎడిటింగ్: వెంకటేష్ అనుగురాజ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: శిబూ తమీన్స్
దర్శకత్వం: హరి
*
శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమా నుండి హీరో విక్రమ్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆయనకు విజయం మాత్రం అందని ద్రాక్షగా మిగిలింది. ఇక తన కెరీర్‌లో కమర్షియల్ హీరోగా నిలబెట్టిన సామి సినిమా సీక్వెల్‌నే నమ్ముకున్నాడు. మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సామి సినిమా మరి విక్రమ్ ఆశలను నిలబెట్టిందా.. అసలు ఈ రెండో సామి ఎవరు? అన్న విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
*
మొదటిభాగంలో జరిగిన కథలో హైలెట్స్ చూపిస్తూ ఈ కథ మొదలవుతుంది. సిన్సియర్ పోలీసు ఆఫీసర్ పరశురామ స్వామి (విక్రమ్) కొడుకు రామస్వామి (విక్రమ్) తన తండ్రిని చంపిన భిక్షు (బాబీ సింహా) మీద పగ తీర్చుకోవడం కోసం విజయవాడ వస్తాడు. ఢిల్లీలో ఐఎఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామస్వామికు మినిస్టర్ కూతురు దియా (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. తన తల్లిదండ్రులను చంపిన రావణ్ భిక్షు (బాబీ సింహా) మరియు అతని సోదరులపై రామస్వామి ఎలా పగ తీర్చుకున్నాడన్నది మిగతా కథ.
పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ వయసులో కూడా తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక దియా పాత్రలో కీర్తి సురేష్ తన నటనతో, గ్లామర్‌తో మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో బాబీ సింహ అదరగొట్టాడు. మంచి వేరియేషన్స్‌ను కనబర్చి తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. భువన పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనపడింది తక్కువే అయినా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది.
దర్శకుడు హరి సెకెండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలను బాగా తెరకెక్కించారు. కథనంలో ఎక్కడా వేగం తగ్గకుండా చూసుకున్నారు. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. అసలు విక్రమ్ ఒక్కరా ఇద్దరా అనే కన్ఫ్యూజన్ సృష్టించి మంచి ట్విస్ట్‌తో సెకెండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచేలా చేశాడు. అన్నీ బావున్నా, ఐదోతనం తక్కువైనట్టు తెలీని వెలితి మాత్రం ఆడియన్స్‌ను వెంటాడింది. సీక్వెల్ తీయడంలో దిట్టయిన ఈ దర్శకుడు ఈసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నపుడు కథ పక్కాగా ఉండాలి కాని ఇందులో అసలు కథ మిస్ అయింది. కథ లేనప్పుడైనా కథనంతోనైనా సినిమాను నడిపించాడు అంటే అదీ లేదు. ముఖ్యంగా నాయకుడు - ప్రతినాయకుడి మధ్యన హోరాహోరీ పోరు తప్పదు అనుకునే టైములో ఆ పాత్రలను నీరుగార్చాడు. రొటీన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను బోర్ కొట్టించాడు దర్శకుడు. కామెడీ మరో మైనస్. సూరితో కామెడీ చేయించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. చాలా చోట్ల విసుగు తెప్పించింది.
దర్శకుడు హరి మరో మంచి యాక్షన్ డ్రామాను ప్రేక్షకులకు పరిచయం చేద్దామనుకొని పూర్తిగా నిరాశపరిచాడు. సంగీతం అందించిన దేవిశ్రీప్రసాద్ ఎప్పటిలా కాకుండా అవుట్‌డేట్ సాంగ్స్‌తో సరిపెట్టాడు. చివరిలో వచ్చే ‘పిల్ల నిన్ను చూస్తే..’ సాంగ్ తప్ప మిగతావన్నీ తేలిపోయాయి. పాటలతో నిరాశపర్చిన దేవి నేపథ్యం సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రియన్ ఛాయాగ్రహణం బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. విజయన్, జైల ఎడిటింగ్ ఫర్వాలేదు. శిబూ తమీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సింగం సిరీస్‌తో తన సత్తా చాటుకున్న దర్శకుడు హరి మళ్లీ మరో సూపర్‌హిట్ మూవీకి సీక్వెల్‌గా సామి చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే అదే ఒరిజినల్ ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో విఫలమై నిరాశపరిచాడు. పాతకాలపు కథ, ఆసక్తిలేని కథనం, సందర్భం లేకుండా మధ్య మధ్యలో విసిగించే రొటీన్ కామెడీతో సాగింది. ఒక్క విక్రమ్‌ను చూడాలంటే మాత్రమే సినిమాకు వెళితే బెటర్!