రివ్యూ

ఫెయల్యూర్స్‌కి కొత్త జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాబ్ ** ఫర్వాలేదు
**
తారాగణం: అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్‌రాజ్, జయసుధ, జ్యోతిక, అదితిరావు హైదరి, ఐశ్వర్య రాజేష్, డయానా ఎర్రప్ప, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
రచన: మణిరత్నం -శివ అనంత్
నిర్మాతలు: మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం: మణిరత్నం
**
పోస్టర్ చూసి - కథేమిటో చెప్పేస్తున్న రోజులివి. ఫ్యామిలీ ఫొటో పక్కనబెడితే.. అందులో సాఫ్ట్ విలనెవరో? ఆయా వ్యక్తుల స్వరూప స్వభావాలేమిటో అతి స్పష్టంగా ‘లైక్’ కొట్టేస్తున్న ‘సాఫ్ట్’ ప్రేక్షకుల రోజులివి. ఈ తరుణంలో ‘ట్రైలర్’లోనే పాత్రల పరిచయం.. కథ మొత్తం చెప్పేస్తే జనం ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు?! మణిరత్నం కాబట్టి ఊరుకుంటారు. ‘రోజా’ సున్నితమైన ప్రేమలో తడిపేస్తూ.. తీవ్రవాదాన్ని చెబితేనో.. ‘నాయకుడు’ లాంటి వాణ్ణి హీరోని చేస్తేనో.. ‘బొంబాయి’లో మతాంతరీకరణకు ‘ప్రేమ’ ముసుగు తొడిగి.. ఆనక అదే క్లైమాక్స్‌గా మారిస్తేనో.. -ఇలా మణిరత్నం ఏది చెప్పినా కళ్లప్పగించి చూశాం. అతగాడు నిర్మించే చిత్రాలన్నీ ద్విభాషలవే కాబట్టి -ఆయా నటీనటులనూ మనసులో జీర్ణించుకునే ప్రయత్నం చేశాం. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే- ‘నవాబ్’ ట్రైలర్ చూసిన ఎవరైనా కథని ఇట్టే వాసన పట్టేస్తారు. భావోద్వేగాలకు గురవుతారు. మరో మాఫియా కథ అంటూ ఉప్పొంగి పోతారు. అదీ ట్రైలర్ వరకే. కానీ- మరి మణిరత్నం సినిమాని ఎంతవరకూ లాక్కెళ్లాడో చూద్దాం. ఫస్ట్ రీల్‌లోనే ‘మణిరత్నం’ మార్కు కనిపించటం మొదలుపెట్టింది.
డైరెక్ట్‌గా కథలోకి వెళతాడు దర్శకుడు. భూపతి (ప్రకాష్‌రాజ్) హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఆ హత్యాకాండకు సూత్రధారి ఎవరు? అన్న ప్రశ్న వేసుకొనేలోగానే - భూపతి కొడుకులు ముగ్గురూ తెర మీదికి వస్తారు. తండ్రి భూపతితోనే ఉంటూ అతగాడి వ్యాపార వ్యవహారాలన్నీ చూసే వరద (అరవింద్ స్వామి), దుబాయ్‌లో బిజినెస్‌తో తలమునకలై ఉండే త్యాగు (అరుణ్ విజయ్), సెర్బియాలో అక్రమ ఆయుధ వ్యాపారం చేసే రుద్ర (శింబు). తండ్రిపై జరిగిన హత్యా ప్రయత్నంతో ఈ ముగ్గురిలోనూ సందేహాలు వెల్లువెత్తుతాయి. తనని హత్య చేయటానికి ప్రయత్నించటంలో ముగ్గురి పాత్రా ఉందంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తాడు భూపతి - కొడుకులపై. భూపతి చిరకాల ప్రత్యర్థి చిన్నప్ప (త్యాగరాజన్) చేసి ఉండొచ్చునని అనుమానం. ఈ నేపథ్యంలో తనని చంపాలనుకున్నది చిన్నప్ప కాదని తెలిసిన భూపతి గుండెపోటుతో మరణిస్తాడు.
ఇక్కడ నుంచి అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. తండ్రి స్థానాన్ని తను ఆక్రమించాలంటే తను అని గొడవ పడతారు. త్యాగు భార్య రేణు (ఐశ్వర్య రాజేష్)ని డ్రగ్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారు. రుద్ర భార్య ఛాయ (డయానా) సెర్బియాలో హత్యకు గురవుతుంది. ఒక్కొక్కరిని మట్టుపెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎక్కడో విదేశాల్లో ఉన్న తమకి ఆ అవకాశం అంతగా ఉండదు కాబట్టి ఇవన్నీ వరదనే చేయిస్తున్నాడని అభిప్రాయపడతారు త్యాగు, రుద్ర.
భూపతిపై హత్యా ప్రయత్నం చేసిందెవరు? చిరకాల ప్రత్యర్థి చిన్నప్ప కానప్పుడు.. అనుమానం ముగ్గురు కొడుకులపై ఉంటుంది. వీరి మధ్యలో పోలీస్ ఆఫీసర్ రసూల్ పాత్ర ఏమిటి? అతడెందుకు భూపతిని సపోర్ట్ చేస్తూ వచ్చాడు? భూపతిపై హత్యా ప్రయత్నం.. రుద్ర భార్య మరణం.. పోలీసు కేసులో ఇరుక్కున్న త్యాగు భార్య రేణు.. వీటన్నింటి వెనుక ఎవరి హస్తం ఉంది?
సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా కథ ఇలా సాగిపోతూంది. ఫ్యామిలీ డ్రామాలో క్రైం సస్పెన్స్ థ్రిల్లర్‌ని పండించి.. కథని ఆఖరి వరకూ లాగటంలో అంత ఎఫెర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఏ దర్శకుడికైనా. కానీ -మణిరత్నం అలా కాదు. ఎందులోనైనా అతడి ప్రత్యేకత ఉండాల్సిందే. ఈ కథలోనూ అంతే. ‘ఓకే బంగారం’తో కాస్త ఊరట చెందినప్పటికీ.. ‘చెలియా’ సినిమా ఎవరికీ అర్థం కాకపోవటంతో -అంతా ‘మణి’లోనూ ‘రత్నం’లోనూ ఆలోచనా మెరుపులు తగ్గాయని భావించారు. కానీ -అవేవీ తగ్గలేదని ఈ సినిమాతో నిరూపించాడు. మల్టీస్టారర్ సినిమా. ఒక్కో పాత్రని ఎంతో అందంగా మలచాల్సి ఉంటుంది. ఏ పాత్రనీ తక్కువ చేయటానికి లేదు. కథాపరంగా ఆయా పాత్రల నిడివి తక్కువైనప్పటికీ - మణిరత్నం ఆయా నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ని చక్కగా రాబట్టుకుంటూ వచ్చాడు. కథ సింపుల్ కాబట్టి - ఆయా పాత్రల మనస్తత్వాల్లోకి తొంగి చూశాడు. మాఫియా కథల్లో మనస్తత్వాల గొడవ ఏల? అని భావించకుండా - మాఫియా డాన్‌గా ఎదిగే ప్రయత్నంలో ముగ్గురు అన్నదమ్ములు ఎటువంటి ప్రయత్నాలు చేశారన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. మొదటిగా చెప్పుకోవాల్సింది -వరద (అరవింద్ స్వామి) పాత్ర. అధికార పీఠం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి వరద. వరద భార్య మరణించే సన్నివేశంలో అతడు పలికిన ఉద్వేగ పూరిత మాటలు ప్రేక్షకుల గుండెల్లో కన్నీళ్లు తిరిగేట్టు చేస్తాయి.
చాలా కాలానికి శింబుని మళ్లీ కొత్తదనంలో చూశారు ప్రేక్షకులు. ఇతగాడికి రొమాంటిక్ సన్నివేశాలు కామనే అయినప్పటికీ - రొమాంటిక్ లుక్‌తో గిలిగింతలు పెట్టాడు. అదితిరావు హైదరీ స్టైలిష్‌గా కనిపించింది. ఇక - ఆయా పాత్రల్లో ఎవరి పరిధి మేరకు వారు వొదిగిపోయి - స్క్రీన్‌కి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. థ్రిల్లింగ్‌ని అందించారు. ఐతే -మణిరత్నం అందరికీ అర్థంకాడు. ప్రేక్షకుల స్థాయిని బట్టి అతడు దిగడు. ప్రేక్షకుల్నే తన స్థాయికి తీసుకెళ్తాడు. కానీ అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఈ చిత్రంలోనూ అదే జరిగింది. ఆ ‘డెప్త్’ని అర్థం చేసుకుంటే ఇదీ మంచి సినిమానే. ఆఖరిగా - దర్శకుడు మణిరత్నం సినిమాల్లో భాషా తారతమ్యాలు అంతగా కనిపించవు. కానీ ఈ సినిమా అంతా తమిళ వాసన. అదే ఇబ్బందికి గురిచేసే అంశం. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం వీనులకింపుగానూ.. చూడబుల్‌గానూ ఉంది. ఛాయాగ్రహణం సంతోష్ శివన్ - ఆయా సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించటమే కాదు.. మనసుపై ముద్ర వేసేలా చేశాడు.

బియన్కె