రివ్యూ

నేరం వెనుక చీకటి సాక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధాధున్ ** ఫర్వాలేదు
**
తారాగణం: ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే, అనిల్ ధావన్, జాకీర్ హుస్సేన్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: కెయు మోహనన్
దర్శకత్వం: శ్రీరామ్ రాఘవన్
**
పియానో మెట్లపై జాలువారిన సుతిమెత్తని సంగీతం ఎలా ఉంటుంది? ఆ భావనకి అక్షరాలు దొరకవు. మనసు మాటలు తప్ప, వీనుల విందైన సరిగమల అర్థం తప్ప. ఆ మెట్లపై సంగీతంతో పాటు ‘హత్య’ జరిగితే?! ఊహకి అందని అందమైన హారర్ థ్రిల్లర్. కథలో ఎవరూ ఊహించని డిఫరెంట్ కానె్సప్ట్‌ని హేండిల్ చేయాలంటే -కచ్చితంగా ఆ స్క్రిప్ట్‌లోకి పరకాయ ప్రవేశం చేయాల్సిందే. స్ఫూర్తి ఎక్కడి నుంచైతేనేం?! ఇదొక ఫ్రెంచ్ షార్ట్ ఫిలిమ్. ‘ది పియానో ట్యూనర్’ (2010) కథకి ప్రేరణ. ఈ కథలో చెప్పటానికేం లేదు. కానీ- అన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని చుట్టుముట్టి -ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆయా సన్నివేశాల గురించి క్షణంపాటు ఆలోచించటానిక్కూడా సమయం ఇవ్వవు. అనుక్షణం ముప్పిరిగొంటాయి. మరి ఆ కథేమిటో చూద్దాం.
పూణెలోని మగర్‌పట్టా సిటీ. ప్రభాత్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ మధ్యతరగతి బ్రహ్మచారి ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా) నివాసం. ఇంకా కేరాఫ్ అడ్రస్‌లూ గట్రా చెప్పుకోవాలంటే- చాలా ఉంది. కానీ కథకి అవెంత అవసరమో? ఆ స్థితిగతుల వెనుక మిస్టరీ అంతే ముఖ్యం. అటువంటి విభిన్న వాతావరణం నుంచీ కమ్మటి సంగీతం చెప్పలేనంత హాయిని అందిస్తుంది. ఎంతలా అంటే- ఒకనాటి ‘చిత్రహార్’ ‘్ఛయాగీత్’ విన్నంత. కథకి ‘నిశ్శబ్ద సంగీతం’ (అంధాధున్) అని టైటిల్ పెట్టడంలోనే -ఎంతో అర్థాన్ని ఇమిడ్చి.. ఆ లేత సంగీతంలోంచి ‘మర్డర్’ వైపు దారి మళ్లిస్తాడు దర్శకుడు. ఆ హత్యకి ప్రత్యక్ష సాక్షి ఆకాశ్. ఏ కోర్టు ఒప్పుకుంటుంది? ఇతడు హత్యను చూశాడు (?) అంటే, ఆకాశ్‌కి కళ్లుండవు. ఆ విషయం ఎవరికీ తెలీనంతగా ప్రవర్తిస్తూంటాడు. ఎవరూ ఊహించరు కూడా. తాను చూసిన (?) క్రైంని అతడు ఏవిధంగా పోలీసులకు చెప్పగలడన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ మెదలుతుంది. ఇదే సినిమా!
అన్ని విషయాలూ వదిలేసి -క్లైమాక్స్ వరకూ కథని ఏవిధంగా నడిపించగలిగాడు? అన్న ఉత్కంఠతతోనే ప్రేక్షకుడు థియేటర్‌లో కదలక మెదలక కూర్చునేట్టు చేశాడు దర్శకుడు. అనేకానేక మలుపుల మధ్య.. అనేకానేక సందేహాల మధ్య.. అనేకానేక గజిబిజి పరిస్థితుల మధ్య నుంచీ కథని ఎంతో క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు. రాఘవన్ స్క్రీన్‌ప్లే అనుక్షణం ప్రేక్షకుల్ని ఆలోచనల్లోకి నెడుతుంది. ఓవైపు టెన్షన్ సృష్టిస్తూనే మరోవైపు హాస్యాన్ని ఒలికించటం దర్శకుడి శైలి. అదీగాక -పియానోని ఏ సందర్భంలో ఎలా ప్రెజెంట్ చేయాలో అతగాడికొక్కడికే తెలుసునేమో అనిపిస్తుంది.
ఏది ఏమైనా -ఒక సింగిల్ థాట్‌ని ఎక్కడా దారి తప్పకుండా.. మొదటి సన్నివేశం నుంచీ క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లటం అంటే మాటలు కాదు. ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించటానికి దర్శకుడితోపాటు నటీనటులంతా పాటుపడ్డారు. ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్‌ని చక్కగా పండించాడు. టబు సంగతి చెప్పనక్కర్లేదు. ఏ పాత్రనైనా సమర్థవంతంగా పోషించగలదు. వీటన్నింటితోపాటు అమిత్ త్రివేది సంగీతం వీనుల విందుగానే కాదు -క్రైం థ్రిల్లర్‌ని సైతం సుతిమెత్తగా ఆలపించగలిగింది.
సంగీతం -క్రైం రెండిటికీ అస్సలు పొసగదు. అటువంటిది ఈ కథలో సమాంతరంగా సాగిపోతూనే ఏమేరకు ప్రేక్షకుల్ని అలరించగలవో ఆమేరకు ఉపయోగపడ్డాయి. హత్యా సన్నివేశం ఒక్కటి చాలు. కథలో టర్నింగ్ పాయింట్ ఇదే కాబట్టి.. దర్శకుడు ప్రయోగించిన టెక్నిక్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ‘వాటీజ్ లైఫ్? ఇట్ డిపెండ్స్ ఆన్ ది లివర్’ - అంటూ ఒకింత సందిగ్ధంలోకి నెట్టివేస్తూనే -‘బ్లైండ్’ పియానిస్ట్‌నీ, బార్ ఓనర్ కూతురు రాధికని ‘యాక్సిడెంటల్’గా పరిచయం చేస్తాడు. ఇలా ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల ఒళ్లు పులకరిస్తూనే ఉంటుంది. అందుకే దర్శకుడితో ‘బ్లైండ్’గా ఫాలో అయిపోయారు ప్రేక్షకులు.

బియన్కె