రివ్యూ

మంచి.. చౌక భారమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భలే మంచి చౌకబేరమ్ * బాగోలేదు
*
తారాగణం: నవీద్, కేరింత నూకరాజు, రాజా రవీంద్ర, యామినీ భాస్కర్, ముజ్‌తాబ్ అలీఖాన్ తదితరులు
కానె్సప్ట్: మారుతి
సంగీతం: హరిగౌర
నిర్మాత: ఆరోళ్ల సతీష్‌కుమార్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మురళీకృష్ణ
*
చిత్ర ప్రయత్నం ‘మారుతి బ్రాండ్’ (కానె్సప్ట్ మారుతిదే) ప్రేక్షకులకు అందించాలనే. కానీ నేరుగా అందిస్తే వైవిధ్యం ఏముంటుందని అనుకున్నారో ఏమో -కానె్సప్ట్‌కు దేశభక్తి పూత పూశారు. ‘చౌకబేరం’ ‘్భలే’వుందని ఆడియన్స్ అనుకోవాలన్నది దర్శకుడు మురళీకృష్ణ ఆలోచన. కానీ -ఆచరణ కష్టమైంది. ‘్భలే మంచి చౌకబేరమ్’ -అనుకున్న కామెడీని కన్‌ఫ్యూజ్ చేసి, సందేశాన్ని సంశయంలో పడేసి.. చివరకు శిరోభారమైంది.
**
ఉద్యోగం కోసం బ్రోకర్ల సాయంతో దుబాయ్ వెళ్లిపోదామని సొంతూరునుంచి హైద్రాబాద్‌కి వస్తారు పార్థు (నవీద్), సలీమ్ (కేరింత నూకరాజు). వీళ్లకీ మోసపోయిన అనుభవమే ఎదురౌతుంది. చేసేది లేక క్యాబ్ డ్రైవర్‌గా ఒకడు, కొరియర్ బోయ్‌గా మరొకడు సెటిలైపోతారు. ఒకసారి విధి నిర్వహణలో భాగంగా ఒక ఇంటినుంచి రిటర్న్ కొరియర్‌లు తీసుకున్న సలీమ్‌కు అందులో -‘దేశ రహస్యాలు’ అన్న పుస్తకం దొరుకుతుంది. దాన్ని పాకిస్తాన్‌కు అమ్మేసి డబ్బు సంపాదించేస్తే ఇంకెలాంటి బాధలూ ఉండవనుకుని ఆ పనుల్లో పడతారు పార్ధు, సలీమ్. వాళ్ల ప్రయత్నాలు ఫలించాయా? చివరికేమైంది? అన్నదే ‘చౌకబేరమ్’. నిజానికి కానె్సప్టే -సీరియస్ కంటెంట్. దాన్ని అర్థవంతంగా తెరమీద ఆవిష్కరించాలంటే చక్కటి నేర్పుండాలి. ఆ నేర్పూ.. వగైరాలను ‘చౌక’చేసి -గందరగోళ కామెడీతో విసుగు పుట్టించారు. లౌడ్ కామెడీని బిగ్‌స్క్రీన్‌మీద రెండు గంటలు భరించటం ఒకింత కష్టమైంది.
కథగా అనుకోడానికైనా -ఓ మేజర్ ఆర్మీలో 30 ఏళ్ళు పనిచేసినా దేశ రహస్యాలు వంటివి తెలిసే అవకాశం తక్కువ. ఎందుకు తెలీవు? అనుకుంటే మాత్రం పరిజ్ఞానలేమికి పరాకాష్టే అవుతుంది. అలాగే టెర్రరిస్టుల నాయకుడిని భయంకర పాత్రగా ఉపోద్ఘాతమిచ్చి, చివరకి చిన్ని విషయంలో హతమైనట్టు చూపడం మరీ విడ్డూరం. ఏ అంశంలోనూ సినిమాటిక్ శ్రద్ధ కరవవడం చౌక బేరానికి పెద్ద మైనస్. నటీనటుల విషయానికొస్తే ముందుగా మేజర్ యాకూబ్‌ఖాన్ పాత్ర పోషించిన రాజారవీంద్రను చెప్పుకోవాలి. కేరీర్‌లో మంచి పాత్రను పోషించడమే కాదు, కామెడీ టైమింగ్‌నీ పండించగలిగాడు. పార్థుగా నవీద్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్లూ ఆడియన్స్‌కు అందలేదు. జోడీగా నటించిన యామినీ భాస్కర్‌తో కెమిస్ట్రీ కుదరలేదు. యామిని పాత్రకీ పరిధి తక్కువ. సలీమ్‌గా నటించిన నూకరాజు ‘పంచ్’ బేస్‌డ్ కామెడీ అక్కడక్కడా పండింది. ‘హైపర్ ఆది’ అనుకరణ కనిపించటంతో ఎక్కువచోట్ల విసుగుపుట్టించాయి. మిగతా పాత్రలన్నీ మామూలే. ‘అమ్మ బ్రతుకునిస్తే, దేశం బ్రతకనిస్తుంది’, ‘ముసల్మాన్ అంటే సాయం చేసే వాడే కానీ, ప్రాణం తీసేవాడు కాదు’, ‘ఎక్కడైనా తల్లిదండ్రుల్ని చూడని పిల్లలుంటారేమోకానీ, పిల్లల్ని చూడని, పెంచని తల్లిదండ్రులుండరు’, ‘దైవభక్తి లేనివాణ్ణి నాస్తికుడంటారు, కానీ దేశభక్తి లేనివాణ్ణి ఏమనాలో ఓ పదాన్ని మీరే కనిపెట్టండి’ అన్న సంభాషణలు బాగున్నాయి. హర గౌర రాగాల్లో అలవాటైన ‘హరిలోరంగ హర’ పాటకు జోడించిన ఆధునిక బాణీ బావుంది. లిరిక్ రైటర్ అంత్యప్రాసల్ని (బెంగ, తీరంగ.. అంటూ) బాగా కలిపారు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం (జెబి అందించారు) బాగుంది. మొత్తానికి రెండు వైరుధ్యమైన అంశాలు (సీరియస్, కామెడీ) జోడించే విధానంలో చాచచక్యం చూపకపోతే ‘నాన్ సింక్’ (ఈ పదమూ ఈ చిత్రంలో సలీం పాద్రారి పదే పదే వాడినదే) ఎలా అవుతుందో అన్నదానికి ‘భలే మంచి చౌక బేరమ్’ బేషరతు ఉదాహరణ.

అన్వేషి