రివ్యూ

కాజల్ గోల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెలికాప్టర్ ఈలా * బాగోలేదు

తారాగణం: కాజోల్, రిద్ధిసేన్, నేహా ధూపియా, తోతారాయ్ చౌదరి, ముఖేష్ రిషి తదితరులు
సంగీతం: అమిత్ త్రివేది - రాఘవ్ సచర్
నిర్మాతలు: అజయ్ దేవగన్ - జయంతిలాల్ - ధావల్ అక్షయ్
దర్శకత్వం: ప్రదీప్ సర్కార్
==================================================
అసలు ఈ సినిమా టైటిల్‌కి అర్థం ఏమిటి? కాజోల్‌ని అడిగితే - వెల్ అంది. అజయ్ దేవగన్‌ని అడిగితే - ఎవరికి తోచిన అర్థం వారిని తీసుకోమంటాడు. ఇలా మరోటి మరోటి. ఎనె్నన్నో విపరీతార్థాల మధ్య కాస్తంత అర్థంపర్థంలేని కథని చుట్టేశారా? అన్న సందేహం కలుగుతుంది. గుజరాతీ కథ ‘బేటా, కాగ్డో’ మూలం. క్లుప్తంగా చెప్పుకొన్నా.. పేజీల కొద్దీ చెప్పినా - కథ సింగిల్ లైన్. ఐతే - నాటకంగా ఎంతో జనాదరణ పొందిన ఈ కథ స్క్రీన్‌పైకి వచ్చేప్పటికి.. కథలో ఆ ‘్ఫల్’ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. మాటిమాటికీ ప్రేక్షకుడు కాంప్రమైజ్ అవుతూ.. కేవలం కాజోల్‌ని చూట్టం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ కథలో ప్రత్యేకించి మెరుపులేం ఉండవు.
కథ -ఈలా రాయ్‌టర్కర్ (కాజోల్) ’90ల నాటి ఒకానొక గాయని. ఊహల్లో బతకటం ఈమె జీవితం. ఆ ఊహల చుట్టూ ఆమె పుత్రరత్నం వివాన్ (రిద్ధీ సేన్). జనరేషన్ గ్యాప్ అంటే అంతగా పట్టించుకోదు. రేపటి తరంతోపాటు సమాంతరంగా వెళితేనే - లైఫ్ బాగుంటుందన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. సంగీతంలో ఎలాగైతే - మార్పులొచ్చాయో? అలాగే జీవితంలోనూ రావాలంటుంది.
ఫస్ట్ హాఫ్ అంతా -నవ దంపతుల (కాజోల్ - తోతా రాయ్ చౌదరి) సంసార సరిగమల్లోని... భావోద్వేగాలనూ - మానసిక సంఘర్షణనూ.. సుఖ దుఃఖాలను తరచి చూపిన దర్శకుడు - అక్కడ కూడా ‘మెలోడ్రామా’ని అంతగా పండించకుండా - సెకండ్ హాఫ్‌లోకి దాటి వచ్చేస్తాడు.
కథలో ఏం చెప్పాలనుకున్నాడో - అతి స్పష్టంగా తెలుస్తూన్నప్పటికీ.. ఈ ‘సింగిల్ మామ్ లవ్’ రెండు గంటలపాటు సాగితే ఎలా ఉంటుంది? సర్దుకుపోగలిగితే ఫర్వాలేదు. కాకపోతే - ప్రతి ఇంటిలోనూ కాలేజీకొచ్చిన పిల్లాడో పిల్లో ఉంటారు కాబట్టి - ఆయా సన్నివేశాలను కుటుంబ నేపథ్యంలో తరచి చూసుకొంటూంటే మాత్రం అక్కడక్కడ ‘కథ’తో కనెక్ట్ అవుతూ ఉంటాం. పిల్లాణ్ణి కనిపెట్టుకొని ఉండాలంటూ.. కొడుకుతోపాటు ఏకంగా కాలేజీ తరగతి గదిలో తిష్ఠ వేస్తే.. అది హాస్యం కోసమని సర్ది చెప్పుకోవాలి. ఒక సెంటిమెంటల్ టాగ్‌ని ప్రేక్షకుడే తగిలించుకొని.. కథతోపాటు వెళ్తూ ఉండటమే. అలా ఎంతవరకూ వెళ్లగలం? వెళ్లేంతవరకూ. మాటిమాటికీ కథలో వెనక్కి తిరిగి చూసుకున్నట్టయితే.. కచ్చితంగా ‘ట్రాక్’ తప్పే ప్రమాదం ఉంది. కనుక దిక్కులు చూడకుండా సాగిపోవటమే.
‘ఈలా’ కాలేజీ చదువు అయిపోయి - సరిగ్గా 22 ఏళ్లు అవుతుంది. తను వదిలిపెట్టిన కాలేజీ.. క్లాస్‌రూమ్.. బెంచీలూ ‘ఇలా’ ఆమెది అదో లోకం. 22 ఏళ్ల తర్వాత అదే కాలేజీలో ఈలా కొడుకు వివాన్ చేరటం.. అదే క్లాస్‌రూంలో పాఠాలు వినటం.. లాంటి ఎమోషనల్ ఈవెంట్ తప్ప.. మళ్లీ కథ రొటీన్ గాడిలో పడుతుంది.
కథానాయిక ’90 కాలం నాటిది కాబట్టి.. ‘రుక్ రుక్ రుక్ అరె బాబా రుక్’తో రీమిక్స్‌తోనైనా ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసి.. ఆ కాలంలోకి పట్టుకెళ్తాడనుకుంటే.. ఆ రీమిక్స్ కూడా చతికిలపడి - ప్రేక్షకుల మతిని పోగొట్టి - పాత సంగీతపు వాసనల్ని సైతం తుడిచిపెట్టింది.
ఒక్కమాటలో చెప్పాలంటే- దర్శకుడు చేసే ప్రయత్నాలన్నీ ‘రివర్స్’లో ప్రేక్షకులకు ఎదురొస్తాయి. వీటికి తోడన్నట్టుగా.. కాజోల్ దర్శకుడి ఆదేశాల చొప్పున నటించిందో (?) లేక మరీ ఎమోషనల్‌గా ఫీలై (?) ఓవర్ యాక్షన్ చేసిందోగానీ.. నటనలో మెలోడ్రామా మరీ కాస్త ఎక్కువై.. ‘హెలికాప్టర్’లో ఎగిరి వెళ్లిపోదామన్న తిక్క పుడుతుంది.
ఈలా బాయ్‌ఫ్రెండ్ అరుణ్‌గా చేసిన తోతారాయ్ చౌదరి.. వివాన్‌గా నటించిన రిద్ధీ సేన్ ఫర్వాలేదనిపించారు. కానీ అన్నీతానై.. కాజోల్ నటించటంతో ఏ సన్నివేశంలో చూసినా.. ఆమే అనిపించి... బోర్ కొట్టింది. సంగీతం ఫర్వాలేదు. నాటకాన్ని స్క్రీన్ కథగా మార్చటంలో పడిన శ్రమంతా ఆ కథని పాడుచేయటానికే తోడ్పడినట్టుగా ఉంది.

బియన్కె