రివ్యూ

హృదయారవింద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవింద సమేత *** బాగుంది

నటీనటులు: ఎన్టీఆర్, పూజాహెగ్డే, సునీల్, జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బ, రావు రమేష్ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
స్టంట్స్: రామ్ లక్ష్మణ్
సినిమాటోగ్రాపర్: పిఎస్ వినోద్
సంగీతం: యస్ తమన్
నిర్మాత: కె రాధాకృష్ణన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్
============================================

పొడి మాటల్లో తడిని చూపించటం త్రివిక్రమ్‌ది పాళీతో పెట్టన విద్య. తడిదేరిన మాటల్ని తుపాకీ గుళ్లలా కురించటం జూ.ఎన్టీఆర్ శైలి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా కోసం ఏళ్ల తరబడి ఎదురు చూశారు అభిమానులు. నిజానికి పనె్నండేళ్లుగా త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ కూడా ఎదురు చూశాడు. పుష్కరకాలం తరువాత సినిమా కుదిరింది. అరవింద సమేత వీర రాఘవగా వచ్చింది. ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లోనూ ఎక్కువైంది. అందుక్కారణం -జూ.ఎన్టీఆర్ మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయడం. ఇన్ని అంశాల నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి. త్రివిక్రమ్ శైలిలో తెరకెక్కిన సినిమాలో అసలు అరవింద ఎవరు? వీర రాఘవుడి కథేమిటి? ఆ రెంటి లింకే -అసవీరా.
***
రాయలసీమలో ఫ్యాక్షన్ కామన్. అదెంత దారుణంగా ఉంటుందో సినిమాటిక్‌గా చాలా చిత్రాల్లో ఆడియన్స్ చూసేశారు. రెండు వర్గాలమధ్య దారుణమైన సంఘర్షణలు, రక్తపాతాలతో చాలా సినిమాలే వచ్చేశాయి. ఈ సినిమాలోనూ ఇద్దరు ప్రత్యర్థుల మధ్యే భీకర పోరు.
నారప్పరెడ్డి (నాగబాబు) కొడుకు వీర రాఘవరెడ్డి (జూ.ఎన్టీఆర్). ఈ కుటుంబానికి, బసిరెడ్డి (జగపతిబాబు) కుటుంబానికి దశాబ్దాలుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ ఫ్యాక్షన్‌లో చుట్టుపక్కల 20 ఊళ్ల ప్రజలు నలిగిపోతుంటారు. లండన్‌లో చదువుకున్న వీరరాఘవ సొంత ఊరికి వస్తాడు. కొడుకుని తీసుకుని ఊరికి వెళ్తుంటే మధ్యలో బసిరెడ్డి ముఠా అటాక్ చేస్తుంది. తండ్రిని శత్రువులు తమ కళ్లముందే చంపేయడంతో రాఘవరెడ్డి కూడా ఉగ్రరూపం దాలుస్తాడు. శత్రువులను కత్తికో కండగా నరికేస్తాడు. బసిరెడ్డిపైనా దాడి చేస్తాడు. ఇంటికొచ్చాక తనవాళ్ల పరిస్థితి చూసి చలించిన వీర రాఘవుడిపై నాయనమ్మ మాటలు ప్రభావం చూపిస్తాయి.
తర్వాత గొడవలకు దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా పరిచయమవుతుంది అరవింద (పూజా హెగ్డే). ఇద్దరి మధ్యా కుదిరిన స్నేహంలో ఆమె మాటలూ వీరరాఘవపై మరింత ప్రభావం చూపిస్తాయి. దీంతో ఫ్యాక్షనిజాన్ని సమూలంగా రూపుమాపాలన్న ఆలోచనకు వస్తాడు వీరరాఘవ. అందుకోసం ఏం చేశాడు? అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడి లక్ష్యం నెరవేరిందా? అన్నది మిగతా కథ.
***
ఎన్టీఆర్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర వీరరాఘవ. ఆ పాత్రకు న్యాయం చేయడంతో ఎన్టీఆర్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది అరవింత సమేత. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఆది, సాంబలాంటి సినిమాలతో పోలిస్తే నటుడిగా ఎన్టీఆర్‌లో పరిణితి స్థాయి కనిపిస్తుంది. పైగా ప్రేక్షకుల అభిరుచి నాటిని పట్టిన హీరోగా పాత్ర ఔచిత్యాన్ని ప్రదర్శించగలిగాడు. ఆది, సాంబతో ఫ్యాక్షన్ మొదలెట్టిన జూ.ఎన్టీఆర్, అరవింద సమేతలో అదే ఫ్యాక్షన్‌కు బ్రేకులు వేయడం ఆడియన్స్‌కి కనెక్టింగ్ పాయింట్. కేవలం మాటలతో ప్రత్యర్థుల్ని భయపెట్టే సన్నివేశం, ‘యుద్ధం ముగించి నీ దగ్గరికి వస్తా’ అంటూ కథానాయికతో చెప్పే సన్నివేశం బాగుంది. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూపించగల సన్నివేశాలను అద్భుతంగా అల్లుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఒకచోట అతడిని ‘టార్చ్ బేరర్’ అంటూ పొగుడుతాడు రావు రమేష్. ఎన్టీఆర్‌ని ఎలివేట్ చేయడంలో త్రివిక్రమ్ పనితనం ఈ పదంలో కనిపిస్తుంది. తారక్ తర్వాత నటనలో విశ్వరూపం చూపించింది జగపతిబాబు. తగిన పాత్ర దొరకడంతో -విలనిజాన్ని మరింత హైట్స్‌కు తీసుకెళ్లగలిగాడు. వేషం, ఆహార్యం, సంభాషణా చాతుర్యం.. అన్నీ గొప్పగా అమరాయి. ప్రేక్షకుడిపై బలమైన ముద్ర వేయగల పాత్ర బసిరెడ్డి. తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినా నవీన్ చంద్ర ఓకే అనిపించుకున్నాడు. గ్లామరస్ డాళ్ పూజా హెగ్డే పాత్రే కథకు కీలకం. కానీ, అందంగా కనిపించిందే తప్ప పాత్ర ఔచిత్యాన్ని ప్రదర్శించడంలో విఫలమైంది. సునీల్, బ్రహ్మాజీ, శత్రు ఓకే.
సాంకేతిక వర్గంలో మొదట చెప్పుకోదగ్గది తమన్ మ్యూజిక్. ‘పెనివిటి’ సాంగ్‌తో సంచలనం రేపాడు. ‘అనగనగనగా..’ పాట వినడానికి బాగున్నా చిత్రీకరణ అంతంతమాత్రం. పాటలపరంగా ఓకే అనిపించిన తమన్, నేపథ్య సంగీతపరంగానూ పదును చూపించాడు. కీలక ఘట్టాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్లస్‌గా నిలిచాడు. పిఎస్ వినోద్ ఛాయాగ్రహణం బావుంది. అటు సీమ నేపథ్యాన్ని చూపుతూనే, సాత్విక సన్నివేశాల్లో ఆహ్లాదకరమైన ప్రజెంటేషన్ ఇచ్చాడు. నిర్మాణ విలువలకు ఢోకాలేదు. ఇక అరవిందతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్. లైట్ వెయిటెడ్ చిత్రాల నుంచి ఒక్కసారి టర్న్ తీసుకున్న త్రివిక్రమ్, సీరియస్ కథలో బలమైన సొల్యూషన్ చూపించడానికి ఒక ట్రాక్ వేసినట్టే. కథ పాతదే అయినా, రాయలసీమ నేపథ్యాన్ని భిన్నంగా చూపించే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్ స్థాయిని గుర్తు చేసే సంభాషణలకు కొదవ లేదు.
స్టార్ దర్శకుడు, స్టార్ హీరోలమధ్య సినిమా అనగానే కమర్షియల్ హంగులతో అవసరం లేని మసాలాలు అద్దడం సహజం. కానీ ఈ సినిమా విషయంలో అది జరగలేదు. మారుతోన్న ప్రేక్షకుడి ఆలోచన నాడికి అనుగుణంగా మేకర్సూ మారుతున్నారన్న విషయాన్ని రుజువు చేశాడు త్రివిక్రమ్. కథపైనే దృష్టి పెట్టి సినిమాను ట్రాక్ తప్పకుండా నడిపించాడు. త్రివిక్రమ్ కొత్త శైలికి తగిన ఎన్టీఆర్ లాంటి ఆయుధం దొరకడంతో, సీమ ఫ్యాక్షన్‌కు కొత్త భాష్యం చెప్పడంలో సఫలమైనట్టే. ఫ్యాక్షన్‌లో నలిగిపోయే పల్లెలు, అక్కడి గొడవలు, ఫ్యాక్షన్ మనుషులు, వాళ్ల భాష, యాస.. అలా ప్రభావవంతంగా తెరమీదికి తేవడంలో అరవింద సఫలమైంది.
వినోదం విషయంలో అంచనాలతో రావొద్దంటూ త్రివిక్రమ్ టీం ముందే చెప్పేసింది కనుక -ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా కనిపించదు. కాకపోతే -ఈషా రెబ్బ పాత్ర ఎందుకన్నదీ అర్థంకాదు. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ నిస్సారంగా సాగి, మొదట్లో కలిగిన ఫీలింగ్‌నూ చంపేసింది. ‘అరవింద సమేత..’ టైటిల్‌కు న్యాయం చేయడం కోసమే హీరోయిన్ పాత్రను ఉత్ప్రేరకంగా చూపించాలనుకున్న ప్రయత్నం ఫెయిలైంది. సిల్లీగా సాగే ఆ పాత్ర కథలోని ఇంటెన్సిటీకి బ్రేక్ వేసింది.

-శ్రీనివాస్ ఆర్.రావ్