రివ్యూ

పట్టపగల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పందెంకోడి 2

తారాగణం: విశాల్, కీర్తిసురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్, రామ్‌దాస్ తదితరులు..
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కేఏ శక్తివేల్
నిర్మాతలు: విశాల్, ధవల్, అక్షయ్
దర్శకత్వం: ఎన్ లింగుస్వామి

ఇమేజ్ గ్రాఫ్ పైకి నడవనపుడు పాత హిట్టుకు ఓ సీక్వెల్ చెయ్ -అన్నది హీరోలకు సినీ విజ్ఞులు నేర్పిన పాఠం. ఫలితాల మాటెలావున్నా, పరిశ్రమలో మాత్రం క్రమంగా అది సెంటిమెంట్‌గా బలపడింది. ఇప్పుడు విశాల్ -దానే్న పాటించాడు. పనె్నండేళ్ల క్రితమే మాస్ హీరోగా విశాల్‌కు పేరు తెచ్చిన చిత్రం (సైన్డయ్ కోళి) పందెం కోడి. ఆ ఇమేజ్‌ను నిలబెట్టుకోడానికి ఎన్నో మాస్ చిత్రాలు చేశాడు. తెలుగు నేటివ్ హీరోలతో పోటీ పడకున్నా, హీరోగా తానున్నానంటూ డిటెక్టివ్, అభిమన్యుడులాంటి చిత్రాలతో ఆడియన్స్‌కి కనిపిస్తూనే ఉన్నాడు. అలా విశాల్ మాస్ చిత్రాలు ఎన్నొచ్చిన -పందెంకోడిని బీట్ చేసిన సినిమా రాలేదు. అందుకే కెరీర్ గ్రాఫ్ పెంచుకోడానికి సొంత బ్యానర్‌పై పాత హిట్టుకు సీక్వెల్ చేశాడు విశాల్. అదే -రెండో పందెంకోడి. సీక్వెల్‌కూ లింగుస్వామే దర్శకుడు. మొదటి పందెం కోడి ఇమేజ్‌ను రెండో పందెంకోడి ఎంత పెంచిందన్నదే విశాల్ కెరీర్‌కు ఇంపార్టెంట్ పాయింట్.
కథ:
రాయలసీమ నేపథ్యంలో నడిచే రొటీన్ కథే. రాజారెడ్డి (రాజ్‌కిరణ్) ఏడూళ్లకు పెత్తందారు. అతని కొడుకు బాలు (విశాల్). ఏడూళ్ల జనం జాతర చేసుకోవడం ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ. అలా ఓ ఏడాది జాతరలో కుటుంబ పగలు రగులుతాయి. రెండు కుటుంబాల ఘర్షణ కారణంగా జాతర ఆగిపోతుంది. ఫ్యాక్షన్ గొడవల కారణంగా విదేశాలకు వెళ్లిపోతాడు బాలు. వానలు మాయమై సీమకు కరవు దాపురించటానికి కారణం జాతర జరగకపోవడమేనని జనం నమ్ముతారు. కానీ, జాతర మొదలెడితే రక్తపాతం తప్పదనీ భయపడుతుంటారు. ఈ క్రమంలో ఊళ్ల సంక్షేమం కోసం జాతర జరపడానికి తలపెడతాడు రాజారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రక్తపాతానికి తావివ్వకూడదని అనుకుంటాడు. విదేశాల్లో చదువుకుంటున్న రాజారెడ్డి తనయుడు బాలు జాతర కోసం ఊరికొస్తాడు. ఫ్యాక్షన్ గొడవల్లో భర్త ప్రాణాలు పొగొట్టుకున్న భవాని (వరలక్ష్మి శరత్‌కుమార్) జాతరను అడ్డుకోవడానికి కంకణం కట్టుకుంటుంది. జాతర జరిగిందా? తండ్రి సంకల్పం కోసం భవాని మనుషులను బాలు ఎలా నిలువరించాడు. అసలు ఏడూళ్ల మధ్య పాతకక్షలేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
విశాల్‌కు టైలర్ మేడ్ మాస్ క్యారెక్టర్ కనుక పర్ఫెక్ట్‌నెస్ చూపించాడు.
యాక్షన్ ఘట్టాలు, ఎమోషనల్ సన్నివేశాల్లో అతి చేయకుండా మంచి స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు. కీర్తి పాత్రను చూస్తుంటే, ‘పందెంకోడి’లో మీరాజాస్మిన్ గుర్తుకొస్తుంది. నిజానికి ఈమె పాత్రే ఒకింత రిలీఫ్. మీరా జాస్మిన్ అల్లరిని మరిపించేలా కీర్తి సురేష్ బలమైన ముద్ర వేయగలిగింది. ‘మహానటి’ పోశ్చర్‌లో కనిపించిన కీర్తిని పందెంకోడి పాత్రలో ఊహించుకోలేకున్నా, ఊర మాస్ పెర్ఫార్మెన్స్, యాక్టివ్‌నెస్‌తో ఆకట్టుకుంది. హీరో తండ్రి రాజారెడ్డిగా కీలకమైన పాత్రలో రాజ్‌కిరణ్ హూందా అయిన పాత్రలో కనిపించాడు. విలన్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ హావభావాలు ఆకట్టుకుంటాయి. క్రూరత్వాన్ని, పగను మేళవించిన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన వారంతా తమిళ నటీనటులే. పాత్రల పరిధిమేరకు కనిపిస్తారు.
యాక్షన్ కథలను బిగింపుతో నెరేట్ చేయడంలో మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు లింగుస్వామి. మొదటి ‘పందెంకోడి’తో విశాల్‌తోపాటు లింగుస్వామికీ మంచి పేరొచ్చింది. పుష్కరం తరువాత సీక్వెల్ వస్తుందనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. తొలి ‘పందెంకోడి’లో ఏ ఫార్ములాను అనుసరించాడో, అదే ఫార్ములాను ఈసారీ కథగా రాసుకున్నాడు లింగుస్వామి. మాస్ మసాలాలు బాగా దట్టించాడు. ఫస్ట్ఫాను యాక్షన్ ఎడిసోడ్స్‌తో నింపేశాడు. అందుకే కథ కంటే ఫైట్లే ఎక్కువ అనిపిస్తాయి.
విశాల్, కీర్తిసురేశ్‌ల మధ్య రొమాన్స్‌తో యాక్షన్‌కు బ్రేక్ పడుతుంది. దీనికితోడు ద్వితీయార్థంలో మైండ్‌గేమ్ సన్నివేశాలు మొదలవుతాయి. ‘పందెంకోడి’ సక్సెస్‌కు కారణం స్క్రీన్‌ప్లే మ్యాజిక్. అదే ఫార్ములాను రిపీట్ చేయడంతో ‘రెండో పందెంకోడి’ ఆసక్తికరం అనిపించదు. వరలక్ష్మి విలనిజంపై ఫోకస్ పెంచడంతో, అసలు కథ గాడితప్పేసింది. లేడీ విలన్‌గా వరలక్ష్మి మెప్పించినా సన్నివేశాలు రక్తికట్టలేదు. పగ, ప్రతీకారం ఫార్ములాయే ప్రధానం కావడంతో, ఒకప్పటి పందెంకోడినే మరోసారి చూస్తున్న భావన కలుగుతుంది. విలన్ పాత్రలో దమ్ము లేకపోవడం, హీరో విలన్ల మధ్య డైరెక్ట్ పోరు లేకపోవడం, సినిమాను నడిపించే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చిన్నది కావడంతో ఆసక్తి నీరుగారిపోతుంది. తమిళ నేటివిటీ డామినేట్ చేయడంతో తెలుగు ఆడియన్స్ అభిరుచులు మచ్చుకు కూడా కనిపించవు. మాసిజాన్ని ఇష్టపడే ఆడియన్స్‌కైనా ఎక్కుతుందో లేదో డౌటే.
యవన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం తమిళ ఆడియన్స్‌కు నచ్చుతుందేమోకానీ, తెలుగులో కిక్కవ్వలేదు. నేపథ్య సంగీతంలో వాయిద్యాల హోరు ఎక్కువైంది. పాటలు తమిళ డబ్బింగ్ చూస్తున్న ఫీలింగ్‌నే కలిగిస్తాయి. సాహిత్యం సరిగ్గా వినిపించ లేదు, వినిపించిన కొంతైనా అర్థంకాదు. కొన్ని పాటలు తెలుగులో వస్తున్నాయో, తమిళంలో వస్తున్నాయో అర్థంకానంత కన్ఫ్యూజన్ ఉంటుంది. శక్తివేల్ రాజా కెమెరా పనితనం బావుంది. జాతర నేపథ్యంలో సాగే కథను జాతర చూస్తున్నంత భావన కలిగించేలా చిత్రీకరించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.

-ఆర్‌ఆర్