రివ్యూ

మైండ్ క్రైమ్ కోటెడ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బజార్ * బాగోలేదు
*
తారాగణం: సైఫ్ అలీఖాన్, రోహన్ మెహ్రా, రాధికా ఆప్టే, చిత్రాంగద సింగ్, మనీష్ చౌదరి తదితరులు
సంగీతం: హనీ సింగ్, బిలాల్ సారుూద్
నిర్మాతలు: నిఖిల్ అద్వానీ -మధు జి భోజ్వానీ
దర్శకత్వం: గౌరవ్ కె చావ్లా
*
‘వాల్‌స్ట్రీట్’ మాట వినని హాలీవుడ్ ప్రేక్షకుడుండడు. ఫుల్‌సూట్‌లో ఓ చేత్తో పిస్తోలుతో-అందమైన భామల మధ్య తళతళ మెరిసే కథానాయకుడు కనిపిస్తాడు. అతగాడు ఏది చేసినా ‘నీట్’గా పిస్తోలుకిగానీ, కత్తిగానీ నెత్తురంటకుండా చేయటం రివాజు. అదో వెరైటీ. ఆలీవర్ స్టోన్స్ ఆస్కార్ డ్రామా అంత. హాలీవుడ్‌లో ఏనాడో తిరగేసిన పేజీల్ని మళ్లీ బాలీవుడ్ తెర పుటలకి అతికించటం వొకింత సాహసమే అయినప్పటికీ -ఆ టెంపోనీ, అదే థ్రిల్లింగ్‌ని తెచ్చిపెట్టిన ‘బాజార్’ సినిమా ఏ కొద్దిమందికో నచ్చటానికి కారణం ఇదొక స్టోరీ లేని యాక్షన్ మూవీ కావటం.
కథ: -రిజ్వాన్ అహ్మద్ (రోహన్ మెహ్రా) ఆకాశ హర్మ్యాలంత కోరికలతో ముంబైలో అడుగుపెడతాడు. కానీ అతడి మనస్తత్వానికి ముంబై ఏమాత్రం కొరుకుడు పడదు. రిజ్వాన్ స్ఫూర్తికారకుడు షాకున్ కొఠారి (సైఫ్ అలీఖాన్) అడుగుజాడల్లో నడవాలన్న ఆశ. స్టాక్ మార్కెట్‌ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టిస్తున్న షాకున్‌తో రిజ్వాన్ కలిశాడా? ఆ అండర్ వరల్డ్ ‘స్టాక్’ మార్కెట్ లోతుపాతుల్ని అంచనా వేయగలిగాడా? అన్నది కథ సారాంశం.
‘గ్రీడ్ ఈజ్ గుడ్’ పంచ్‌లైన్‌తో సినిమా మొత్తం నడుస్తుంది. స్టాక్ మార్కెట్ కథాంశంగా అడపాదడపా కొన్ని కథలు వచ్చినప్పటికీ, ఒక ఫుల్‌లెంగ్త్ మూవీ రావటం ఇదే కావొచ్చు. షేర్స్‌లో మనీ ఇనె్వస్ట్ చేసి రాత్రికి రాత్రి మహరాజులయి -పోయేవారి అదృష్ట జాతకాన్ని తమకూ ఆపాదించుకొని.. ఎత్తులకు పైఎత్తులేస్తూ ‘స్టాక్’ చుట్టూ తిరిగే వాళ్లు కోకొల్లలు. లేలేత ప్రేమ కథా చిత్రాలూ.. కుటుంబ కథాంశాలతో బోర్‌కొట్టి కాస్తంత వెరైటీ కానె్సప్ట్ కోరుకునే వారికి ఈ క్రైం థ్రిల్లర్ చక్కటి అనుభూతినిస్తుంది. 1987లో మిఖాయిల్ డగ్లస్ నిర్మించిన ‘వాల్‌స్ట్రీట్’కీ ఈ చిత్రానికీ సంబంధ బాంధవ్యాలున్నాయా? అంటే ఉన్నాయి, ఉంటాయి మరి.
ముంబై నగరం చీకటి ప్రపంచానికి రారాజు. నేర ప్రవృత్తికి పరాకాష్ఠ. ఆ నేపథ్యంలోంచి ‘స్టాక్ మార్కెట్’ వైపు ఒక అడుగు వేస్తే -స్టాక్ బ్రోకర్లు, పవర్ బ్రోకర్లు, వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు.. ఇలా ఒకానొక కోణం సాక్షాత్కరిస్తుంది. అందులో గుజరాతీ వ్యాపారవేత్త షాకున్ ‘దలాల్ స్ట్రీట్’ తాలూకు చీకటి నీడల్ని ప్రతిబింబిస్తాడు. ఇక్కడ మానవత్వం -ప్రేమలూ లాంటివి ఉండవు. కేవలం డబ్బు. మనీ మనీ. తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకూ -అదే పదం. ఆ ‘మనీ’ కోసం ఎనె్నన్ని ఎత్తులైనా వేస్తారు. ఎంతమంది ప్రాణాలైనా తీస్తారు? ఎంతటి మోసానికైనా పాల్పడతారు? ‘కాంప్లెక్స్’ ఆలోచనలు ఎలా ఉంటాయో? తెరచాటున ట్రేడింగ్ ఎలా ఉంటుందో? ఫైనాన్షియల్ అవకతవకలు ఏవిధంగా చేస్తారో? కేపికల్ మేనేజ్‌మెంట్.. ‘మార్కెట్’ లోపటి సమాచారాన్నీ.. చట్టవ్యతిరేక టెలీకాం బిడ్స్ గురించీ.. అవినీతి రాజకీయాల గురించీ.. ఒక వైపు మాఫియా.. మరోవైపు రాజకీయ వ్యవస్థ ‘స్టాక్ మార్కెట్’లో ఎలా పావుల్ని కదుపుతుందో? అన్నింటినీ ఒక్కటొక్కటిగా ‘తెర’కి అందించారు.
కథ ‘వాల్‌స్ట్రీట్’లానే థ్రిల్లింగ్‌గా సాగిపోతుంది. సైఫ్ అలీఖాన్ గుజరాతీ వ్యాపారవేత్తగా, స్టాక్ మార్కెట్ ఆనుపానుల్ని చక్కగా అర్థం చేసుకొని.. ఏ సమస్యకి ఏ ఎత్తుగడ వేయాలో తెలిసిన లౌక్యమైన వ్యక్తిగా నటించాడు. గుజరాతీ యాసతో అలరిస్తాడు. రిజ్వాన్ అహ్మద్‌గా రోహన్ మెహ్రా చక్కగా చేశాడు. రాధికా ఆప్టే, చిత్రాంగద సింగ్ పాత్రల పరిధి మేరకు నటించారు.
కథలో మరుక్షణం ఏం జరగబోతోందో ప్రేక్షకుడి ఆలోచనలకు తట్టటం అన్నది ప్రధాన లోపం. తెర మీద ఏం చేయబోతున్నారన్నది ముందుగానే ఊహించేస్తే ఇక థ్రిల్లింగ్‌కి ఆస్కారం ఎక్కడ? ఈ కథలో జరిగింది ఇదే. మలుపులూ గట్రా లేకుండా సాఫీగా సాగిపోతూంటుంది. అక్కడక్కడ థ్రిల్లింగ్‌ని కలిగిస్తూంటుంది. ఐతే- మలుపులు లేని కథ చప్పగా ఉంటుంది కదా. ఇదీ అదే పరిస్థితి. క్రైం థ్రిల్లర్‌లో పాటలుంటే? అదీ లెఖ్ఖకి మించి. కథ సైడ్ ట్రాక్ పట్టటాన్ని మనం తప్పుపట్టలేం. మొత్తంగా వైట్‌కాలర్డ్ బ్రోకింగ్ క్రైంని విపరీతంగా ఇష్టపడేవాళ్లకు ఒకింత ఆలోచన రేకెత్తించే సినిమా -బజార్.

బియన్కె