రివ్యూ

మహా అయోమయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీర భోగ వసంత రాయలు * బాగోలేదు
*
నటీనటులు: నారా రోహిత్, శ్రీయ, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, శ్రీనివాస్‌రెడ్డి, మనోజ్ నందం, శశాంక్, రవిప్రకాశ్ తదితరులు
సంగీతం: మార్క్ కె రాబిన్
కూర్పు: శశాంక్, మాలి
కెమెరా: వెంకట్, నవీన్ యాదవ్
కథ, దర్శకత్వం: ఇంద్రసేన
*
ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం కోసం తాపత్రయపడే యువతరం హీరోల్లో -నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణును చెప్పుకోవచ్చు. కథను ఎంచుకోవడం నుంచి స్క్రీన్ ప్రజెంటేషన్ వరకూ భిన్న పార్శ్వాలను టచ్ చేయడానికి తెగువ చూపించే బ్యాచ్ ఇది. ఇప్పటి వరకూ చేసిన చిత్రాల జాబితాను తిరగేస్తే -మిగిలిన హీరోలకంటే వైవిధ్యంగా, కమర్షియల్ ట్రాక్ ఆకర్షణకు దూరంగానే వీళ్ల సినిమాలు ఉంటాయని అర్థమవుతుంది. ఇంతకుముందే ‘శమంతకమణి’లో రోహిత్, సుధీర్ కలిసి పనిచేశారు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్‌తో స్క్రీన్‌కు వచ్చారు. అదే -వీర భోగ వసంత రాయలు. టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా టాప్ హీరోయిన్ శ్రీయ, శ్రీవిష్ణు డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో టీజర్ రేటింగ్ పెంచడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఆడియన్స్ అట్రాక్షన్‌ను క్యాష్ చేయడంలో యువ దర్శకుడు ఇంద్రసేన ఎంతవరకూ సక్సెస్ అయ్యాడు? సినిమా ఎలా ఉంది? వైవిధ్యాన్ని కోరుకునే హీరోలు ఎలా మెప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కథలోకి వెళ్దాం.
కథ
ఓపక్క హైదరాబాద్‌లో కిడ్నాప్‌ల సీక్వెన్స్. అనాధ ఆడపిల్లల్ని ఓ ముఠా మాయం చేస్తుంటుంది. మరోపక్క -క్రీడాకారులు, సెలబ్రిటీలతో శ్రీలంక నుంచి భారత్‌కు వస్తున్న ఫ్లైట్ మిస్. ఇంకోపక్క -ఓ పదిహేనేళ్ల కుర్రాడు ఇల్లు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు. ఈ మూడింటి లింకేంటి? దుష్టశిక్షణకు దిగిన -వీర భోగ వసంత రాయలు (శ్రీవిష్ణు) ఎవరు? ఎక్కడివాడు? ఏం చేశాడు? ఇదే సినిమా. ప్రతి సినిమాలోనూ ఆడియన్‌ని కుర్చీ అంచుకు జరిపించే నాట్స్ కొన్నుంటాయి. ఇందులో -దర్శకుడు తెలివిగా క్రైం ‘మూడే’శాడు. ఆ చిక్కుల్ని దర్శకుడు విప్పుతుంటే -మనం సమాధానం వెతుక్కోవాలన్న మాట. పాయింట్‌పరంగా స్క్రీన్‌ప్లే బేస్‌డ్ చిత్రం. ఎలావుందో చూద్దాం..
కథను మొదలెట్టడంలోనే దర్శకుడు ఆసక్తిని రేకెత్తించాడు. అప్పుడెప్పుడో వచ్చిన ‘రాజుగారి చేపల చెరువు’లో చెరువు మాయమైనట్టుగానే.. ఇల్లు అదృశ్యమైందన్న కానె్సప్ట్ నుంచి ఆడియన్స్ బుర్రల్లోకి ప్రశ్నలు సంధించాడు. ఇల్లు మాయమైందా? ఎలా? ఎక్కడికి? అసలిది సాధ్యమేనా? ఈ డైలమా మస్తిష్కంలో చిక్కబడుతున్న టైంలోనే -విమానం మాయమైన ఘటన ముందుకొస్తుంది. ఈ గగ్గోలుకు -వీర భోగ వసంత రాయలు కళ్లు తెరుస్తాడు. దుష్ట శక్తుల నిర్వీర్యానికి కొన్ని అమాయక ప్రాణాల్ని ఫణంగా పెట్టొచ్చన్న కానె్సప్ట్‌తో గే(క్రై)మ్ స్టార్టవుతుంది. ఇంత స్పష్టంగా కథను స్క్రీన్‌కు ఎక్కించివుంటే ఆ ఫలితమే వేరుండేది. కానీ, అదే జరగలేదు. ఆలోచనల్లోని కథను కాగితంపై రాయడం వేరు, స్క్రీన్‌కు ఎక్కించడం వేరు. ఈ రెంటిమధ్యా అననుభవ దర్శకుడి గందరగోళం, దాన్నుంచి పుట్టుకొచ్చిన నిరాసక్తత వెరసి.. ఆడియన్స్‌ని బోర్‌కు గురి చేస్తాయి. బలహీన సన్నివేశాలే అనుకుంటే, అవీ లాజిక్‌కు దూరంగా సాగిపోవడంతో విసుగు పుడుతుంది. స్క్రీన్‌మీద సాగుతున్న సన్నివేశాల్ని చూస్తూ.. ప్రేక్షకుడు ప్రశ్నలేసుకోవడమే తప్ప సమాధానాలు వెతుక్కోలేడు. వీర భోగ వసంతరాయలు లక్ష్యమేమిటో చివరి వరకూ తెలీకపోవడంతో, ఆడియన్స్ సైతం కన్ఫ్యూజన్ గేమ్‌కు బలైపోయారు. సినిమా చివరి వరకూ లక్ష్యంలేని ప్రయాణం చేసేశారు. పతాక సన్నివేశాలకు ముందు చెప్పదలచుకున్న విషయంపై దర్శకుడు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా, క్లైమాక్స్ గందరగోళం దారుణంగా దెబ్బతీసింది. సినిమా నుంచి ఆశించే సహజమైన వినోదాన్ని గాలికొదిలేసి, కథలో ముందు వెనుకలను ఆలోచిస్తూ కూర్చోవాల్సి వచ్చింది. ఆరోతరగతి పిల్లలకు ఐన్‌స్టీన్ సైన్స్ పాఠాన్ని ఆ స్థాయిలోనే చెప్పాలన్నది -సినిమాకూ వర్తించే రూల్. దర్శకుడు ఆ రూల్‌ని పాటించలేదు. అమితమైన తెలివితేటలతో రాసిన కథని, సగటు ప్రేక్షకుడికి సులువుగా అర్థమయ్యేలా స్క్రీన్ డిజైన్ చేయలేకపోయాడు. క్రైం కేసుల్లో సవాలక్ష గందరగోళాలు సృష్టించి, ఆనక అసలు విషయం చెప్పేస్తే ఆడియన్స్ శెహభాష్ అంటారనుకున్న అతి అంచనాలు సినిమా ఊపిరి తీసేశాయి. కేవలం క్లైమాక్స్ కోసమే సస్పెన్స్‌ను గందరగోళపర్చడంతో -దర్శకుడే కన్ఫ్యూజైపోయాడు. లాజిక్‌లేని సన్నివేశాలలు (విమానం హైజాక్) కథాగమనం ముందుకాళ్లకు బంధం వేయడంతో, సీరియస్‌నెస్‌ని సంభాషణల్లో చూపించకపోవడం మరో పెద్ద పొరబాటు. సూటిగా చెప్పే విషయాన్ని గందరగోళానికి గురిచేద్దామన్న సరికొత్త ప్రయోగ ప్రయత్నంలో మాత్రం దర్శకుడు పాస్.
దర్శకుడు కథను చెప్పినపుడు అద్భుతమనిపించి ఉండాలి. లేదంటే నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రీయ, శ్రీవిష్ణులాంటి నటులు తమ ఇమేజ్‌ను పక్కనబెట్టి ఒప్పుకునేంతగా సినిమాలో ఏమీ కనిపించదు. దర్శకుడు మరోసారి స్క్రిప్ట్‌మీద వర్కవుట్ చేసి ఉంటే ఫలితం బావుండేది. అదీ జరగలేదన్న విషయం సినిమాలో స్పష్టంగా కనిపించింది. నటనపరంగా శ్రీయ సహా హీరోలంతా ఓకే అయినా, వాళ్లను సరిగ్గా సంధించడంలో దర్శకుడే విఫలమయ్యాడు. ‘మేకోవర్’ ఒక్కటే మంచి సినిమాకు గీటురాయి కాదన్న పాఠం ఈ చిత్రం నుంచి నేర్చుకోవచ్చు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబును ఒక్క ప్రేమ్‌లో చూపించగలిగే సన్నివేశాన్నీ దర్శకుడు సృష్టించుకోలేకపోయాడు. సాంకేతికంగా -ఏమాత్రం స్టామినాను చూపించలేని చిత్రమిది. బడ్జెట్ మాటెలావున్నా -చిన్న సినిమా స్టాండర్డ్‌ను మించలేదు. మరీ తక్కువ బడ్జెట్‌తో సినిమాను ముగించారనిపిస్తుంది. టేకింగ్‌పరంగా నాణ్యత కరవు. గ్రాఫిక్స్ నాసిరకం. బ్యాక్‌గ్రౌండ్ బోర్. వెరసి -వీర భోగ వసంతరాయలు అనే సౌండింగ్‌లో వున్న కెపాసిటీ సినిమాలో లేదు.

-ప్రవవి