రివ్యూ

ఆకలితీర్చే అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌మా చావల్ ** ఫర్వాలేదు
**
తారాగణం: రిషీకపూర్, అనిరుధ్ తన్వర్, అమైరా దస్తూర్, అపరశక్తి ఖురానా, హరీష్ ఖురానా తదితరులు
సంగీతం: హితేష్ సోనిక్
నిర్మాతలు: గులాబ్‌సింగ్ తన్వర్, లీనా యాదవ్, స్వాతిశెట్టి, అసీమ్ బజాజ్
స్క్రీన్‌ప్లే: వివేక్ అంచలియా
దర్శకత్వం: లీనా యాదవ్
**
20ఆ్ద ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీన్ అయిన ఈ సినిమాని ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రెజెంట్ చేసింది. చూట్టానికి చిన్న కథ అయివుండొచ్చుగానీ.. మనసు లోలోతుల్లోకి వెళ్లి మానవీయ సంబంధాల మానసిక సంఘర్షణనీ.. మరచిపోతున్న కుటుంబ వ్యవస్థనీ... తరాల మధ్య అంతరాల్నీ ఆవిష్కరించే పెద్ద చిత్రమిది. కొన్నాళ్ల క్రితం వరకూ ‘్ఫ్యమిలీ’ అనేది ఏ కొద్దో గొప్పో ఉండేది. రాన్రాను ‘కుటుంబం’ అన్న మాట మాయమై.. ఒకే గూటి కింద ఉంటున్నప్పటికీ -ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు తల్లిదండ్రుల, పిల్లల రూట్ పూర్తిగా సెపరేటైంది. ప్రతి ఒక్కరి చేతుల్లోను చేతల్లోను, ఆలోచనల్లోను మనసుల్లోనూ -‘మొబైల్’ తప్ప మరో మాట వినపడదు. ‘నెట్‌వర్క్’ సైతం ‘కనెక్టివిటీ’ని కోరుతుంది. ఇక్కడ దానితో సంబంధం లేదు. నిస్తేజంగా నిర్వీర్యంగా నిస్తబ్దంగా ‘కుటుంబం (?)’లోని వ్యక్తులు ‘స్క్రీన్’కి కళ్లని కట్టేసి -ఆలోచనలతో పనిచేయటం మానేశారు. కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ వంటింట్లోనూ.. అన్నీ ‘మొబైల్’ సంభాషణలే. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లోని సమస్యే. ఆ సమస్యని ఎంతో అందంగా.. తరానికీ తరానికీ మధ్య అగాధాల్ని ఎంతో సున్నితంగా స్పృశిస్తూ మరోవైపు ఆలోచనల్ని రేకెత్తిస్తూ సాగిందీ కథ. ఇంత ఉపోద్ఘాతం అందుకే?!
కథ -ఓ సగటు వ్యక్తి రిషికపూర్. భార్య ఉన్నంతవరకూ అతనికీ కొడుక్కీ మధ్య ‘రిలేషన్’ ఫర్వాలేదు అనిపించినా.. ఆమె మరణం తర్వాత కొడుకు తనకి దూరమైపోవటం రిషి తట్టుకోలేక పోతాడు. ఆ ‘అనుబంధం’ ఎక్కడ మిస్సవుతోంది? తన ఆలోచనల్లోని లోపమా? లేక తరాలమధ్య ఉంటున్న దూరమా? ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌ని పోగొట్టుకోవటం ఎలా? అని ఆలోచించి -న్యూఢిల్లీలో వ్యాపారరీత్యా పిల్లాడి చదువురీత్యా ఉంటున్నప్పటికీ -ఆ గజిబిజి జీవితం నుంచీ మూలాల్ని వెతుక్కుంటూ చాందినీ చౌక్ చేరతాడు. కాస్మొపాలిటన్ సిటీనుంచి రావటంవల్ల ఇక్కడి ‘స్లో లైఫ్’కి అడ్జస్ట్ కాలేకపోతాడు రిషి కొడుకు. ఈ నేపథ్యంలో చుట్టూ ఉండే మనుషులూ.. మనస్తత్వాలూ అతనిలో క్రమంగా అనుబంధాల పరమార్థాన్ని తెలియజెప్తాయి. కుటుంబం నుంచీ ఏం పోగొట్టుకుంటున్నామో? రోజూ పేపర్లలోనూ సమాజంలో చూస్తూన్న ఆత్మహత్యల చీకటి కోణాల్ని అర్థం చేసుకుంటాడు.
సమస్య చిన్నదిగానే కనిపిస్తుంది. కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరక్కపోదు.. అని అనేవారే గానీ- ‘మాటలు’ లేనప్పుడు పరిష్కార దిశగా సమస్య వెళ్లేదెప్పుడు? ఇటువంటి సున్నిత అంశాన్ని ఎంతో చక్కగా పరిష్కరించిందీ సినిమా.
ఓల్డ్ ఢిల్లీకి న్యూఢిల్లీకి తేడాని స్పష్టంగా చూపిస్తూ.. అక్కడక్కడ ‘ప్రేమ’ తాలూకు ఛాయల్ని.. నేటి యువతరం లేలేత ప్రేమను ప్రతిబింబించటంతో దాదాపుగా అన్ని సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. ఓల్డ్ ఢిల్లీ -అనేప్పటికి ఇరుకిరుకు వీధులూ -రద్దీగా ఉండే మార్కెట్లూ.. నేరమయ జీవితం -మోసం దగా కుట్రపూరిత వాతావరణం అన్న భావన పలు సినిమాలు కలిగించాయి. కానీ -చాందినీ చౌక్ మార్కెట్ స్ట్రీట్ సైతం డిఫరెంట్‌గా కనిపించటానికి కొంత కథ కారణమైతే.. మరికొంత సినిమాటోగ్రాఫర్ డొనాల్డ్ మెక్‌అల్‌పైన్ కారణం. దర్శకుడు లీనా యాదవ్ తన కెరీర్‌ని బుల్లితెరతో ప్రారంభించి.. ఓ చక్కటి కథతో వెండితెరని అలరించాడు. కథకి తగ్గట్టు సంగీతం అమరింది. నటన విషయంలో ఏ ఒక్కరిని ఎన్నిక పెట్టటానికి లేదు. కథలో జీవించారు.

బిఎన్కె