రివ్యూ

సవ్యత లేని ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశదిమ్మరి * బాగోలేదు
*
తారాగణం: తనీష్, షరీన్, ముకుల్‌దేవ్, సుమన్, ఫిష్ వెంకట్
సంగీతం: సుభాష్ ఆనంద్
నిర్మాత: స్వతంత్ర గోయెల్
కెమెరా: మల్లికార్జున్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నగేష్ నారదాసి
*
చెప్పదలచుకున్న పాయింట్ కొద్దిగా కొత్తదైనా, చెప్పే విధానంలో అవలంభించే అపసవ్యతలవల్ల దాని ఆవిష్కరణ సవ్యంగా జరగడంలేదు. అందుకు ‘దేశదిమ్మరి’ మినహాయింపు కాదు. ‘ఆశ ఉండొచ్చు కానీ అత్యాస కూడదు..’ అన్న ప్రాథమిక సూత్రానికి కొంత కొనసాగింపుగా డబ్బు ప్రాధాన్యత, పరిమితులను స్పృశించడం ఇందులో ప్రధాన అంశం. కానీ దాన్ని తెరపై ప్రతిబింబింపజేయడంలో ‘ఆసక్తిదాయకత’ అన్న ప్రాణప్రధాన విషయాన్ని దేశదిమ్మరి గమనించలేదు. దాంతో ఆడియెన్స్‌కి దిమ్మతిరిగే విసుగుపుట్టింది. వివరాల్లోకి వెళ్తే..
కనగానే తల్లినీ, కొంతకాలం తర్వాత తండ్రినీ కోల్పోయిన యోగి (తనీష్) ఏదీ పట్టించుకోకుండా ఎలాపడితే అలా దేశాలు (ప్రాంతాలు) పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఓ సందర్భంలో ఆశ (షరీన్) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమె పరిచయం అతని జీవన శైలిలో ఎలాంటి మార్పు తెచ్చింది? చివరకు అతని అభిప్రాయ సరళి ఏ గమ్యం చేరుతుందన్న అంశంతో ‘దేశదిమ్మరి’ ప్రయాణం ముగుస్తుంది. సాధారణంగా చాలా సినిమాల్లో పేర్లుకీ, అందులోని అంశాలకీ పెద్దగా పొత్తుండదు. కానీ ఈ సినిమా పేరుని ప్రతిబింబించేలా షూటింగ్ చాలామటుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో (పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్) జరిగింది. ఇదొక్కటి ఇందులోని ప్లస్ పాయింట్. అయితే సన్నివేశాల క్రమంలో ఒకదానితో ఒకటి సంఘర్షించుకునే సంగతీ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు స్వామీజీ (సుమన్) ఆశ్రమంలో యోగినుద్దేశించి ఈ ఆశ్రమం ఆశను తీరుస్తుంది తప్ప ‘అత్యాశ’ను కాదు అని అంటాడు. వాస్తవానికి కథానాయకుని తీరూ అంతే.. అందుకే ఓ సందర్భంలో ‘నేను జీరో ఎక్స్‌పెక్టేషన్స్, జీరో ప్రాబ్లమ్స్’ విధానంలోని వ్యక్తిని అంటాడు. అంటే ‘ఆశ- అత్యాశ’లు అతని జోనర్‌వి కావు. కానీ అతనే ఈ రెండు వైరుధ్య అంశాలలో తేలుతున్నట్టు చూపటం సరికాదు. అలాగే అసలలా ఏ పనికీ ఉపక్రమించని బద్ధకస్తుని జీవితం అంత సాఫీగా సాగడం కుదరని పని. మరిందులో అలా దీర్ఘకాలం సాగినట్టు చూపడం విచిత్రం. ఇక హీరోయిన్‌ని దేవ్ (ముకుల్‌దేవ్) బ్యాచ్ కిడ్నాప్ చేయడం, అలా అన్నాళ్లు ఓ భవంతిలో ఉంచడం, వగైరా అన్నీ మనం అనేక సినిమాల్లో చూసేసిన రొడ్డకొట్టుడు పెట్టుడు సన్నివేశాలే! ఇంక ‘కొత్తదనం’ అన్నమాటకు ఇక్కడ సావకాశమే లేదు. పైగా అంత పెద్ద విలనూ అమ్మాయి అంటే పడి చేసే పిల్లచేష్టలూ, దానికి వత్తాసుగా వెంకట్ (ఫిష్ వెంకట్) చేసే విన్యాసాలూ తదితరాలు తెలుగు ఆడియెన్స్ ఇప్పటికే అనేక చిత్రాల్లో చూసి చూసి యేష్ట (విసుగు) కొచ్చేశారు. మరి వీటిలో ఏంనవ్యత ఉందనుకున్నారో నగేష్ నారదాసే (దర్శకుడు) చెప్పాలి. ఈ తతంగాన్ని పక్కకు పెడితే యోగిగా తనీష్ తనకు లభించిన పాత్రకు తన శక్త్యానుసారం నటించేశాడు. కొన్నిచోట్ల చిరంజీవి అనుకరణ (ముఖ్యంగా కథానాయికతో కొన్నిచోట్ల సంభాషిస్తున్న సందర్భంలో) కనిపించింది. ఆశగా షరీన్‌కి ప్రజ్ఞ చూపించతగ్గ సన్నివేశాలు లేకపోయినా, ఉన్నంతలో పాటల్లో అందంగా కనిపించింది. కానీ ఆ పాత్రకిచ్చిన ప్రాసెస్ అస్సలు ఒప్పుకోలు (డ్రామా ఆర్టిస్టు.. కిడ్నాప్) విధానంలో లేదు. ఉన్న సన్నివేశాల్లో వీరే ఎక్కువ కనిపిస్తారు కనుక, మిగతా పాత్రధారులెవరికీ అంతగా పరిధే లేదు. కొన్ని పాటల్లో ఎక్కువగా ‘హిందీ’ పదాలు దొర్లడం (యే దిల్ క్యాహువా, నీవైపే లాగింది, హే.. పైసా అనాడీ కిలాడీ..లాంటివి) జరిగాయి. బహుశా సంగీతం అందించినది ఉత్తరాదివారు కావడంవల్లనేమో! స్వరపరంగా అయితే ‘అగ్గి రాజుకుంటే బల్లే, సిగ్గు దాచుకుంది పిల్లే’ బావుంది. ఇందులో సన్నివేశపరంగా పాటల్లో పదాలు (హోరాహోరీ పోరులో ఓడి గెల్వనా.. వంటివి) బాగా కుదిరాయి. అదే రీతిలో ‘ఎవరో నేను, ఎవరో నువ్వు, కలిపిన మాయే ప్రేమ’ అన్న భావనా చక్కగా ఉంది. ‘పశువులు మేస్తాయి కానీ మోసుకుపోవు’లాంటి డైలాగులు చిత్ర కథ థ్రెడ్ (ఆశ - అత్యాశ)ని బాగా ప్రస్ఫుటీకరించాయి. దాంతోపాటు యోగా విధానాల ప్రాముఖ్యత తెలుపుతూ ‘మెలికలు తిరిగితేనే మలినాలు పోయి’ అన్న డైలాగూ బాగుంది. ‘ఉందో లేదో తెలియని మోక్షం కోసం ఉప్పు కారం తినని జీవితం ఎందుకు?’ అని చాలామందికి అనిపించే సంగతికి సుమన్ పాత్ర ద్వారా ‘మన పూర్వీకుల వృత్తాంతాల విషయం చెప్పగలవా?’ అని ప్రశ్నించడం రక్తికట్టింది. సినిమాకున్న మరో పెద్ద ఎస్సెట్ ఫొటోగ్రఫి. చూపించిన ప్రదేశాల అందాన్ని మరింత ద్విగుణీకృతమయ్యేలా మల్లికార్జున్ (కెమెరామెన్) లెన్స్ మెస్మరైజ్ చేశాయి. మొత్తానికి సూర్యుడే తండ్రి, జాబిల్లే తల్లి అని నమ్ముకునే పంధాతోపాటు, పని పాటలూ చెయ్యాలన్న విషయాన్ని తెలియజెబుతామనుకున్న చిత్ర బృందం ఉద్దేశ్యం మంచిదే అయినా దాన్ని మనసుకు పట్టేలా చూపుంటే ‘దేశదిమ్మరి’ ప్రస్థానంలో ప్రేక్షకులూ అధిక సంఖ్యలో భాగస్వాములయ్యేవారు.

అన్వేషి