రివ్యూ

పేలని ఫిరంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ * బాగోలేదు
*
తారాగణం: అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్, రోనిత్ రాయ్,
అబ్దుల్ ఖాదర్ అమీన్ తదితరులు
సంగీతం: అజయ్ - అతుల్
సినిమాటోగ్రఫీ: మానుష్ నందన్
నిర్మాత: ఆదిత్య చోప్రా
స్క్రీన్‌ప్లే, డైరెక్షన్: విజయ కృష్ణ ఆచార్య
*
300 కోట్ల భారీ బడ్జెట్. భారీ సెట్టింగ్స్ భారీ తారాగణం.. వెరసి ఓవర్సీస్ మార్కెట్. ఓవైపు అమితాబ్ వీరోచిత నటన -మరోవైపు అమీర్‌ఖాన్ సాహసోపేత కామెడీ -కత్రినా కైఫ్ రంగేళీ నృత్యాలూ -్ఫతిమా సనా లేలేత చూపులూ -ఇంకేం కావాలి? కథకి ఇవన్నీ సరిపోతాయా? ప్రేక్షకుణ్ణి అలరించటానికి ఇన్ని మసాలాలూ- భారీ నటన జోడించింత్తర్వాత చూడక ఛస్తారా? చూస్తే కచ్చితంగా ఛస్తారు?! ఓవరాక్షన్‌కి తోడు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా అప్పుడప్పుడూ కొంప ముంచుతూంటాయి. పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచిగానే ఉంటుంది- అచ్చంగా ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ లాగ. ఆ చూపుల్తో చూస్తే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వెలవెలబోతుంది. సాధారణంగా అదే దృష్టితో చూస్తాం కాబట్టి -ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దానికి తోడు -అంతా కంగాళీ.
1700 ప్రాంతం. భారతదేశంలోని ఒక్కో రాజ్యాన్నీ కబళిస్తూ లేనిపోని చట్టాల్ని చేస్తూ.. దొరికినంత దోచుకుంటూ బలంగా వేళ్లూనుకుంటున్న బ్రిటీష్ సామ్రాజ్యం తాలూకు చీకటి నీడలు ఒక్కొక్కరి గుండెల్లో గుబులు పుట్టిస్తూంటాయి. వర్తకం పేరుతో హిందుస్థాన్‌లో అడుగిడినప్పటికీ -ఇక్కడి సంపదని చూసి కన్నుకుట్టి.. ఈ నేలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్న దృఢ సంకల్పంతో - సంస్థానాలనూ రాజ్యాలనూ ఒక్కొక్కటిగా తమ వశం చేసుకుంటున్నారు బ్రిటీష్ ప్రభువులు. రోనక్‌పూర్ ఓ స్వతంత్ర రాజ్యం. ఆ సంస్థానం రూపురేఖా విలాసాలపై మనసు పడ్డ బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్ తన ఎత్తుగడలను రోనక్‌పూర్ రాజుపై ప్రయోగిస్తాడు. రాజునీ, ఆయన కుమారుణ్ణీ బంధించి వారిని చంపేస్తాడు. ఈ నేపథ్యంలో రోనక్‌పూర్ రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ (అమితాబ్) యువరాణి జఫీరా (ఫాతిమా సనా షేక్)ను బ్రిటీష్ ప్రభువు జాన్ క్లైవ్ పన్నాగం నుంచీ రక్షిస్తాడు. రోజులు గడుస్తాయి. ఖుదా బక్ష్ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటీష్ పాలకులపై సముద్ర మార్గం ద్వారా తిరుగుబాటు చేస్తూంటాడు. ఖుదా బక్ష్ తిరుగుబాటును సహించలేని బ్రిటీష్ పాలకులు అతణ్ణి దోపిడీ దొంగగా ముద్రవేసి అతణ్ణి పట్టుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూంటారు. ఖుదా బక్ష్‌ని బంధించటం వారి తరం కాదు. ఇక ఆఖరి అస్త్రంగా -తమకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తున్న జిత్తులమారి ఫిరంగి (అమీర్‌ఖాన్)కి ఖుదా బక్ష్‌ని బంధించే పనిని అప్పగిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది క్లైమాక్స్.
థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ -అంటూన్నప్పటికీ థగ్స్’ చరిత్ర జోలికి వెళ్లలేదు. టైటిల్ చూస్తే -ఆ చరిత్రని తిరగదోడారేమోనన్న సందేహం వస్తుంది. ఈ అంశం నిరాశని కలిగిస్తుంది. ఇక -కథ విషయానికి వస్తే - ఎంతో సాదాసీదా కథ. ‘్థగ్స్’ నేపథ్యం కాకండా -ఇలాంటివి ఎన్నో చూసేశాం. రెండు గంటల నలభై ఐదు నిమిషాల సేపు వీర‘సాగ’తీతలా అనిపిస్తుంది కథ. యుద్ధ సన్నివేశాలు భావోద్వేగ సంఘటనలూ కొన్ని మెరుపుల్లా వచ్చి వెళ్తాయి. కానీ ఇవేవీ మనసు తెరపై బలమైన ముద్ర వేయవు. టేకింగ్‌లో తీసుకున్నంత శ్రద్ధ -కథపై పెట్టి ఉంటే కథనం మరోలా ఉండేది. ఇంత మందీ మార్బలం ఉండగా - కథ ఎలా సాగితేనేం అనుకున్నారేమో? కథలో బలం లేకపోతే - ఇటు అమితాబ్ అయినా.. అటు అమీర్‌ఖాన్ అయినా సినిమాని నిలబెట్టలేరు. ఎవరికి వారే అతిరథ మహారథులు. పార్ట్‌లు పార్ట్‌లుగా చూస్తే - బాగానే ఉంది అనిపిస్తుంది గానీ.. సినిమా మొత్తంగా చూస్తే లోపాలన్నీ బయట పడుతూంటాయి. ఇది యాక్షన్ సినిమానా? థ్రిల్లరా? కామెడీనా? హిస్టరీనా? అంటే చెప్పటం కష్టం.
అమితాబ్ బచ్చన్ - అమీర్‌ఖాన్ పోటాపోటీగా నటించారు. ఓకే. కత్రినా కైఫ్‌ని రెండు పాటలూ.. నాలుగు లైన్ల డైలాగులతో ముగించారు. అంతోటి దానికి ఆవిడే ఎందుకు? ‘దంగల్’ సినిమా తర్వాత ఫాతిమా సనా షేక్‌కి గుర్తుండిపోయే పాత్ర లభించింది. తనేమిటో ఈ పాత్ర ద్వారా రుజువు చేసుకుంది. భారీ విజువల్స్ ఒక్కటే సినిమాని బతికించలేవు అన్నది మరోసారి రూఢి అయ్యింది. సంగీతం ఫర్వాలేదు.

బియన్కె