రివ్యూ

సారీ, ఇక్కడేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదుగో * బాగోలేదు
*
నటీనటులు: అభిషేక్ వర్మ, నభా నటేష్, రవిబాబు తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: సుధాకర్‌రెడ్డి
నిర్మాత: సురేష్‌బాబు
రచన, దర్శకత్వం: రవిబాబు
*
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు నచ్చవని చెప్పే రవిబాబు తన పంథాలో భిన్నమైన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అందులో కొన్ని ఆకట్టుకున్నా, ఎక్కువ శాతం ప్రేక్షకులకు నచ్చని సినిమాలే. అయినా ఇవేవీ పట్టని రవిబాబు మాత్రం తనకు నచ్చిన సినిమాలను తీసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే పలు మానవేతర జీవులతో (ఈగ, దోమ, ఏనుగు, మేక, ఆవు, పాము..) సినిమాలు తీశారు కాబట్టి తానూ ఏదైనా జంతువుతో సినిమా చేయాలనుకున్నాడు. హాలీవుడ్‌లో కామిక్ ఎడిసోడ్స్‌కే పరిమితం చేసిన పందిని పట్టుకుని ‘అదుగో..’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆధునిక టెక్నాలజీతో రవిబాబు తనకోసం రూపొందించుకున్న వరాహం చేసిన గారడీ ఏమిటి? ఆడియన్స్‌ని ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం.
కథ
ఒక పిల్లాడు ప్రేమగా చూసుకునే బంటి (పందిపిల్ల)ని ఇద్దరు రౌడీలు తస్కరిస్తారు. దాన్ని కొరియర్ ద్వారా వాళ్ల బాస్‌కు పంపుతారు. అయితే రాంగ్ అడ్రెస్ కారణంగా అది హీరో (అభిషేక్ వర్మ) దగ్గరకు చేరుతుంది. అందులో ఏముందో చూడకుండానే (పంది పిల్లను) తన ప్రేయసి (నభా నటేష్)కి బహమతిగా ఇస్తాడు హీరో. రాంగ్ అడ్రెస్‌కు వెళ్లిన పందిపిల్ల కోసం రౌడీ గ్యాంగులు, మాఫియా ముఠాలు రంగంలోకి దిగుతాయి. బంటి కోసం అంతమంది ఎందుకు వెతుకుతున్నారు? దాని ప్రాముఖ్యత ఏంటి? దుండగుల నుంచి వరాహం ఎలా తప్పించుకుని యజమాని దగ్గరికి చేరిందన్నది మిగతా కథ.
అడ్వాన్స్ అయిపోయిన ఒక తరహా తెలుగు సినిమాకు ఆడియన్స్ కూడా అలవాటైపోయిన తరుణంలో -పంది ‘పిల్ల’ చేష్టల చిత్రం కనుక సీరియస్‌గా సమీక్షించాల్సిన అవసరం ఉండదు. తన సినిమాల్లో ఏదోక పాత్రలో కనిపించే రవిబాబు -ఈసారి సిక్స్ ప్యాక్ శక్తిగా రక్తికట్టించి అక్కడక్కడా కితకితలు పెట్టాడు. హీరోయిక్ మెటీరియల్‌గా ఏమాత్రం అనుకూలతలేని అభిషేక్ వర్మ -కాసేపు కూడా ఎంటర్‌టైన్ చేయలేకపోయాడు. రవిబాబు హీరోల తరహాలోనే అతనూ కనిపిస్తాడు. ‘నన్ను దోచుకుందువటే’ భామ నభా నటేష్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. మిగతా నటీనటులంతా పాత్రల పరిధిని దాటకపోవడం శుభపరిణామం. లీడ్‌రోల్ బంటిగాడే కనుక -ఆ విషయంలో చిత్రబృందం చాలా కేర్ తీసుకుంది. ఏది ఓరిజినలో, ఏది యానిమేషనో గుర్తించలేనంతగా ‘బంటి’ని తీర్చిదిద్దారు. యానిమేషన్ టీంను ఈ విషయంలో ప్రశంసించాలి.
టెక్నికల్‌గా చూస్తే - ప్రశాంత్ విహారి సంగీతం ఫర్వాలేదు. హీరో హీరోయిన్లమీద వచ్చే పాట వినసొంపనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వెరీ పూర్. రవిబాబు అభిరుచికి తగిన ఔట్‌పుట్ అనుకోవాలి. సుధాకర్‌రెడ్డి కెమెరా పనితనమూ ఏ విభాగాన్ని డామినేట్ చేయదు. ఇక్కడా దర్శకుడు రవిబాబు టేస్టే కనిపించింది. యానిమేటెడ్ పార్ట్ తప్ప మిగతాచోట్ల ఎక్కడా నిర్మాణ విలువల్ని ఆశించలేం. గ్రాఫిక్స్/ వీఎఫ్‌ఎక్స్‌తో ముడిపడిన చిత్రం కనుక, అంతవరకూ ఓకే అనుకోడానికీ మనసొప్పదు. గత కొనే్నళ్లలో అద్భుతమైన ఎఫెక్ట్స్ డిజైన్ చేస్తూ హాలీవుడ్ చిత్రాలు తెలుగులోనే అందుబాటులోకి వచ్చేస్తున్న కాలమిది. సో, ప్రేక్షకుడికి ఈ సారం ఏమాత్రం సరిపోదు. పందిపిల్లతో సినిమా తీయాలన్న ఆలోచన వరకు దర్శకుడు రవిబాబు ప్రయత్నాన్ని అభినందించాలి. కథ, కథనాల విషయంలో ఇంతకుముందు చిత్రాల మాదిరి దర్శకుడినుంచి ఏమాత్రం ఆశించడానికి ఏమీ లేదు.
రవిబాబు కథలన్నీ విపరీత స్థాయిలోనే ఉంటాయి. వినోదం పండించడానికి అతను చేసే ఎక్స్‌ట్రీమ్ ఆలోచనలు ఒక్కోసారి నవ్విస్తాయి, ఇంకోసారి ఆశ్చర్యపరుస్తాయి.. ఎక్కువశాతం మాత్రం ఎబ్బెట్టు అనిపిస్తాయి. ‘అదుగో’ చివరి కోవకు చెందిందే. సెన్సాఫ్ హ్యూమర్ వున్న దర్శకుడు పంది పిల్లతో సినిమా తీస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది. దీని ప్రోమోలు చూస్తే పందిపిల్ల విన్యాసాలు కడుపుబ్బ నవ్విస్తాయన్న ఆశ కలిగింది. కానీ, బలవంతపు కితకితలు తప్ప స్పాంటేనియస్ కామెడీ ఇందులో ఎక్కడా కనిపించదు. కథలోని కీలకమైన మలుపులకు లాజిక్ లేదు. ఆ మలుపులు సహేతుకంగానూ అనిపించవు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువ వాడేయడమే ఈ పరిస్థితికి కారణమన్న భావన కలుగుతుంది. కామెడీ కోసం ఉద్దేశించిన సన్నివేశాలూ ఏమాత్రం కన్విన్సింగ్ అనిపించలేదు సరికదా సహనానికి పరీక్ష పెట్టాయి. అల్లరి, నచ్చావులే.. సమయంలో రవిబాబు కామెడీ కొత్తగా అనిపించేది. కానీ ఇపుడు స్టీరియో టైప్ అనేద అర్థమైపోతుంది. విలన్‌మీద పందిపిల్ల మల విసర్జన చేయడం.. విలన్ తన అసిస్టెంట్‌మీద పాన్ ఊయడం లాంటి రిపీటెడ్ సీన్లు చూస్తే, కామెడీ కోసం రవిబాబు ఇంత దిగిపోతాడా అనిపిస్తుంది. పందిపిల్ల చుట్టూ కథల్లితే ఆడియన్స్‌కు నచ్చదనుకున్నాడో ఏమో, హీరో హీరోయిన్ల ప్రేమ కథనూ మెలితిప్పాడు. అదీ వికటించింది. ఉన్నంతలో పందిపిల్ల, దాన్ని పెంచుకునే కుర్రాడిమధ్య ఎమోషనే ఆడియన్స్‌కి ఒకింత రిలీఫ్. మొత్తంగా రవిబాబు కొత్త ప్రయోగం అడ్రెస్ తప్పి ఎక్కడికో పోయింది.