రివ్యూ

ఆకలితీరని పోలీసు కసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోషగాడు * బాగోలేదు

నటీనటులు: విజయ్ ఆంటోని, నివేద పెతురాజ్, డానియల్ బాలాజీ తదితరులు
ఛాయాగ్రహణం: రిచర్డ్ నాథన్
సంగీతం: విజయ్ ఆంటోని
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోని
దర్శకత్వం: గణేషా
==============================================================

బిచ్చగాడు చిత్రంతో తెలుగులో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ, ఇక్కడి మార్కెట్‌పై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన పోలీసు అధికారిగా రోషగాడు అంటూ మరో ప్రయత్నం చేశాడు. రోషగాడు ఎవరు? ఏం చేశాడన్న విషయం చూద్దాం.
కథ
కానిస్టేబుల్ కుమారస్వామి (విజయ్ ఆంటోని) తన తమ్ముడు రవిని ఎలాగైనా ఇన్స్‌పెక్టర్‌ను చేయాలనీ అనుకుంటాడు. కానీ చదువు అంటే ఏమాత్రం ఇష్టముండని రవి హైదరాబాద్ పారిపోయి అక్కడి రౌడీ (బాబ్జి) దగ్గర చేరి హత్యలు చేస్తుంటాడు. రెండేళ్ల తరువాత ఇన్స్‌పెక్టర్‌గా హైదరాబాద్‌కు బదిలీమీద వచ్చిన కుమారస్వామికి తన తమ్ముడు కలుస్తాడు. అతను చేసే హత్యల గురించి తెలుసుకొని ఎన్‌కౌంటర్‌లో రవిని చంపేస్తాడు. కానీ తన తమ్ముడిలాగా మరికొంతమంది పిల్లలు కూడా బాబ్జికోసం పనిచేస్తున్నారని తెలుసుకొని కుమారస్వామి వారందరిని మార్చాలనుకుంటాడు. ఈక్రమంలో కుమారస్వామి అనుకున్నది చేయగలిగాడా? ఇంతకీ బాబ్జి ఎవరు? అనేదే అసలు సినిమా.
కుమారస్వామి పాత్రలో విజయ్ ఆంటోని సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో మెప్పించాడు. సీరియస్‌గావుంటూ ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి నటన కనబర్చాడు. ఇక విజయ్‌కి సపోర్టు చేసే పాత్రలో నటించిన హీరోయిన్ నివేద పేతురాజ్ లుక్స్‌పరంగా ఆకట్టుకోవడమే కాదు, ఎనర్జిటిక్‌గా నటనతో మెప్పించింది. విలన్ పాత్రలో నటించిన డానియల్ బాలాజీ తన పాత్రకు పూర్తిన్యాయం చేశాడు. ఫస్ట్‌హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలుతోపాటు ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది.
స్టోరీలైన్ బాగున్నప్పటికీ దాన్ని సినిమాగా మలచడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. కథనం ఆకట్టుకోలేదు. ఆసక్తికరమైన మలుపులు, ఎంటర్‌టైన్‌మెంట్ మిస్సవడంతో -దర్శకుడు సినిమాను సాదాసీదా చేసేశాడు. ఫలితంగా చిత్రం బిలో యావరేజ్‌లోనే ఉండిపోయింది. సంగీతం, ఎడిటింగ్ అందించిన హీరో విజయ్ ఆంటోని రెండింటిలోనూ మెరుపులు మెరిపించలేదు. ఉన్నవి మూడు పాటలే అయినా దాంట్లో ఏ ఒక్కటీ గుర్తుండేస్థాయిలో లేదు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమా చాలాచోట్ల విసుగు పుట్టించింది. రిచర్డ్ నాథన్ ఛాయాగ్రహణం బాగుంది. లోబడ్జెట్ సినిమా అయినా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి. దర్శకుడు గణేశా మంచి మెసేజ్‌వున్న స్టోరీని ఎంచుకున్నా, దాన్ని తెరమీద తేవడంలో తడబడ్డాడు. ముఖ్యంగా స్లో నేరేషన్‌తో విసిగించాడు. దాంతో ఫస్ట్‌హాఫ్ బోర్ కొడుతుంది. కానీ ఇంటర్వెల్‌లో ఒక చిన్న ట్విస్ట్‌తో సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సఫలమైన తరువాత అదే మ్యాజిక్‌ని కొనసాగించలేకపోయాడు. పైగా సినిమా మొత్తం తమిళ ఫ్లేవర్‌లో ఉండటం, కొన్నిచోట్ల హద్దులుదాటడం వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు రుచించవు.
చివరగా.. భిన్నమైన కథతో ‘రోషగాడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ఆంటోనికి ఈ చిత్రం మరో బిచ్చగాడు కాలేకపోయింది. దర్శకత్వ లోపాలు, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, స్లో నేరేషన్ సినిమాను దారుణంగా దెబ్బతీశాయి. విజయ్ సిన్సియర్ యాక్టింగ్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్సే ఆడియన్స్‌కు కాస్త రిలీఫ్.